టీడీపీ హయాంలో జరగలేదా ? “కేసినో”పై ఇదే వైసీపీ ఎదురుదాడి !

కొడాలి నాని గుడివాడలో కేసినో నిర్వహించి అడ్డంగా దొరికిపోయారు. ఆధారాలు ఒకదాని తర్వాత ఒకటి వెల్లువగా బయటకు వస్తూనే ఉన్నాయి. ఈ అంశంపై వైసీపీ తన విధానాన్ని ప్రకటించాల్సిన సమయంలో.. అడ్డగోలుగా కొడాలి నానిని సమర్థిస్తూ.. టీడీపీ హయంలో జరగలేదా అనే వాదనతో తెర ముందుకు వచ్చేశారు. వైసీపీ అధికార ప్రతినిధి అంబటి రాంబాబు ప్రెస్‌మీట్ పెట్టి.. టీడీపీ హయాంలోనూ విచ్చలవిడిగా కేసినోలు జరిగాయని.. అప్పుడు ఈ టీడీపీ నేతంతా ఎక్కడకు వెళ్లారని ప్రశ్నించారు.

టీడీపీ హయాంలో కేసినోలు జరిగితే టీడీపీ నేతలే ఏర్పాటు చేసి ఉంటారు.. మరి వైసీపీ నేతలు అప్పుడు బయట పెట్టకుండా ఏం చేశారు అనే ప్రశ్న వస్తుందని తెలిసినా అంబటి రాంబాబు ఏ మాత్రం తగ్గలేదు. తాము చేసి దొరికిపోయాం కాబట్టి.. అదే ఎదుటి వాళ్లు కూడా చేశారని బురద పూసేస్తే బ్యాలెన్స్ అయిపోతుందన్నది వైసీపీ వ్యూహం. అన్ని విషయాల్లోనూ అంతే. ఏదైనా తప్పు చేస్తే.. తాము తప్పు చేయలేదని చెప్పరు.. ఏం మీరు చేయలేదా అంటారు. ఎక్కడ చేశారో చెప్పరు. ఇక్కడా అంతే.. వ్యక్తంచేశారు.అభివృద్ధిని చూసి ఓర్వలేకనే ఇలాంటి ఆరోపణలు చేస్తున్నారని అంబటి రాంబాబు చెప్పుకొచ్చారు.

సీఎం వైఎస్‌ జగన్‌ అధికారంలోకి వచ్చాక క్లబ్బులపై ఉక్కుపాదం మోపారని ..రాష్ట్రంలో ఎక్కడైనా ఇప్పుడు క్లబ్‌ కల్చర్‌ ఉందా? అంటూ అంబటి రాంబాబు ప్రశ్నించారు. ప్రతీ ఊళ్లో పేకాట శిబిరాలను… క్లబ్బులను ఎమ్మెల్యేలు, మంత్రులే నిర్వహిస్తున్నారని సాక్ష్యాలతో సహా అనేక సార్లు బయటకు వచ్చింది. మంత్రి గుమ్మనూరు జయరాం ఊళ్లోనే పేకాట క్లబ్ వెలుగులోకి వచ్చింది. మొత్తంగా కేసినో గతంలో టీడీపీ నేతలు నిర్వహించారు.. తాము నిర్వహిస్తే తప్పేంటన్నట్లుగా వైసీపీ అధికారిక స్పందన ఉంది. ఇక ఇలాంటి కేసినోలు పలు చోట్ల జరుగుతాయేమో చూడాలి!

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

తెలంగాణలోనూ మసీదులు తవ్వుదామంటున్న బండి సంజయ్ !

బండి సంజయ్ ఏ మాత్రం మొహమాటలు పెట్టుకోవడం లేదు. ముందూ వెనుకా ఆలోచించడం లేదు. తన రాజకీయం తాను చేస్తున్నారు. యూపీలో జ్ఞానవాపి మసీదులో శివలింగం బయటపడిందని.. తెలంగాణలోనూ అదే వాదన...

అనంతబాబు సస్పెన్షన్ – గౌతంరెడ్డిని చేసినట్లుగానేనా!?

ఎమ్మెల్సీ అనంతబాబును చేయలేక.. చేయలేక సస్పెండ్ చేశారు వైఎస్ఆర్‌సీపీ అగ్రనేతలు. ఆయనను పార్టీ నుంచి సస్పెండ్ చేస్తున్నట్లుగా మీడియాకు సమాచారం ఇచ్చారు. అయితే నిజంగానే సస్పెండ్ చేశారో లేకపోతే.. గతంలో వంగవీటి రంగాపై...

మా పార్టీ నేతలపై దాడులు చేసుకుంటామా ?: సజ్జల

అమలాపురం దాడుల వెనుక వైసీపీ నేతల కుట్ర ఉందన్న తీవ్ర ఆరోపణలు వస్తూండటంతో ముఖ్య సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి తెరపైకి వచ్చారు. విపక్షాల విమర్శలు చూస్తుంటే... నవ్వొస్తుంది... అధికార పార్టీ నేతలప ఇళ్లపై...

మళ్లీ జగన్‌ను దారుణంగా అవమానించిన టీఆర్ఎస్ మంత్రి !

సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి దావోస్‌లో కేటీఆర్‌తో భేటీ అయి... తమ మధ్య మంచి ర్యాపో ఉందని నిరూపిస్తూంటే తెలంగాణలో మాత్రం టీఆర్ఎస్ నేతలు దారుణమైన వ్యాఖ్యలు చేస్తున్నారు. ఏపీ సీఎం జగన్...

HOT NEWS

css.php
[X] Close
[X] Close