ద‌స‌రా త‌ర‌వాతే ‘వ‌కీల్ సాబ్‌’

చిత్ర‌సీమ మ‌ళ్లీ షూటింగుల‌తో క‌ళ‌క‌ళ‌లాడుతోంది. స్టార్ హీరోలంతా ఒకొక్క‌రుగా సెట్స్‌పైకి వ‌స్తున్నారు. త్వ‌ర‌లోనే ప‌వ‌న్‌క‌ల్యాణ్ సైతం షూటింగుల‌తో బిజీ కానున్నారు. ఆయ‌న క‌థానాయ‌కుడిగా తెర‌కెక్కుతున్న చిత్రం `వ‌కీల్ సాబ్‌`. లాక్ డౌన్‌కి ముందు 70 శాతం షూటింగ్ పూర్త‌య్యింది. ఇప్పుడు మ‌ళ్లీ షూటింగుల‌కు స‌మాయాత్తం అవుతోంది. ద‌స‌రా త‌ర‌వాత `వ‌కీల్ సాబ్` కొత్త షెడ్యూల్ హైద‌రాబాద్ లో మొద‌లు కాబోతోంది. ఈ షెడ్యూల్ లో ప‌వ‌న్‌, శ్రుతిపై కీల‌క‌మైన సన్నివేశాల‌తో పాటు ఓ పాట‌ని తెరకెక్కించ‌నున్నారు. ఈ షెడ్యూల్ తోనే షూటింగ్ మొత్తం పూర్తి కాబోతోంది. ఇందుకోసం ఆర్‌.ఎఫ్‌.సీ లో ఓ సెట్ ని ప్ర‌త్యేకంగా తీర్చిదిద్దారు. సంక్రాంతికి `వ‌కీల్ సాబ్`ని ప్రేక్ష‌కుల ముందుకు తీసుకొస్తారు. అంజ‌లి, నివేదా థామ‌స్‌ కీల‌క‌మైన పాత్ర‌లో న‌టిస్తున్న సంగ‌తి తెలిసిందే. వాళ్ల‌కు సంబంధించిన సన్నివేశాల‌న్నీ ఇటీవ‌లే పూర్తి చేసేశారు. త‌మ‌న్ సంగీతం అందిస్తున్నారు. ఇప్ప‌టికే ఓ పాట బ‌య‌ట‌కు వ‌చ్చింది. ఇది కాకుండా మ‌రో నాలుగు పాట‌లు కూడా ఆల్బ‌మ్ లో ఉండ‌బోతున్నాయి. అయితే సినిమాలో మాత్రం మూడే పాటులంటాయ‌ని టాక్‌.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

“గ్యాగ్” ఆర్డర్స్‌పై సుప్రీం స్టే..!

ఏపీ మాజీ అడ్వకేట్ జనరల్ దమ్మాలపాటి కేసులో ఎఫ్ఐఆర్‌లో విషయాలను మీడియాలో.. సోషల్ మీడియాలో ప్రచారం చేయకుండా ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ఇచ్చిన గ్యాగ్ ఆర్డర్‌పై సుప్రీంకోర్టు స్టే ఇచ్చింది. అంటే.. ఆ...

ఆ సినిమాలో ర‌కుల్ లేదు

మోహ‌న్‌బాబు క‌థానాయ‌కుడిగా తెర‌కెక్కుతున్న చిత్రం.. సన్నాఫ్ ఇండియా. డైమండ్ ర‌త్న‌బాబు ద‌ర్శ‌కుడు. ఇళ‌య‌రాజా సంగీత అందిస్తున్నారు. ఎం.ధ‌ర్మ‌రాజు ఎం.ఏ, పుణ్య‌భూమి నాదేశం త‌ర‌హాలో సాగే క్యారెక్ట‌రైజేష‌న్ ఈ సినిమాలో క‌నిపించ‌బోతోంద‌ట‌. మ‌ళ్లీ ఆ...

రివ్యూ: అంధ‌కారం

హార‌ర్‌, థ్రిల్ల‌ర్ సినిమాల్ని చూసి.. విసుగొచ్చేసింది. అన్నీ ఒక ఫార్మెట్‌లోనే సాగుతుంటాయి. హార‌ర్ అన‌గానే... భ‌యంక‌రమైన రీ సౌండ్లు, ఓ ఇల్లు, అందులో కొన్ని పాత్ర‌లు విచిత్రంగా ప్ర‌వ‌ర్తించ‌డం.. ఇవే క‌నిపిస్తాయి. థ్రిల్ల‌ర్లూ...

పెంచుకుంటూ పోయే ప్రక్రియలో ఈ సారి ఆస్తి పన్ను..!

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పన్నులు పెంచుకుటూ పోతోంది. ఎక్కడ అవకాశం ఉంటే అక్కడ.. అవకాశం లేకపోయినా స్పేస్ చూసుకుని మరీ పెంచుకుటూ పోతోంది. పెట్రోలో నుంచి టోల్ చార్జీల వరకూ కొత్త కొత్త ఆలోచనలు...

HOT NEWS

[X] Close
[X] Close