ప్ర‌భాస్ సినిమాలో.. మ‌రింత మంది స్టార్లు

ప్ర‌భాస్ – నాగ అశ్విన్ కాంబోలో ఓ సినిమా రూపుదిద్దుకుంటున్న సంగ‌తి తెలిసిందే. అమితాబ్ బ‌చ్చ‌న్‌, దీపికా ప‌దుకొణెలాంటి స్టార్లు ఇప్ప‌టికే ఈసినిమాలో చేరారు. ఈ ప్ర‌వాహం ఇక్క‌డితో ఆగిపోవ‌డం లేదు. త్వ‌ర‌లోనే మ‌రికొంత మంది స్టార్లు ఈ ప్రాజెక్టులోకి రాబోతున్నార‌ని తెలుస్తోంది. ముఖ్యంగా త‌మిళ‌, మ‌ల‌యాళ చిత్ర‌సీమ నుంచి ఒక్కో అగ్ర క‌థానాయ‌కుడు ఈ ప్రాజెక్టులోకి ఎంట్రీ ఇస్తార‌ని స‌మాచారం. తెలుగు నుంచి కూడా ఓ ప్ర‌ముఖ న‌టుడు ఈ సినిమాలో భాగం పంచుకోబోతున్నార‌ని తెలుస్తోంది. పాన్ ఇండియా స్థాయిలో తెర‌కెక్కుతున్న చిత్ర‌మిది. అన్ని భాష‌ల వారినీ ఆక‌ట్టుకోవాలి. అందుకే… వివిధ భాష‌ల‌కు చెందిన న‌టీన‌టుల‌కు ఈ సినిమాలో చోటు క‌ల్పించ‌బోతున్నారు. చిన్న పాత్ర‌ని సైతం.. పేరున్న న‌టుల‌కే అప్ప‌గిద్దామ‌ని డిసైడ్ అయ్యారు. ఒక్కొక్క‌రి పేరు… ఒక్కోసారి ప్ర‌క‌టిస్తూ, ఈ ప్రాజెక్టుకు మ‌రింత హైప్ తీసుకురావాల‌న్న ప్ర‌య‌త్నాల్లో ఉంది చిత్ర‌బృందం. దాదాపు 250 కోట్ల భారీ బ‌డ్జెట్ తో తెర‌కెక్క‌బోతున్న చిత్ర‌మిది. అందులో స‌గం పారితోషికాల‌కే స‌రిపోయేట‌ట్టుంది. ప‌రిస్థితి చూస్తుంటే… స్టార్లు ఎంట్రీ ఇచ్చే కొద్దీ క్ర‌మంగా ఈ సినిమా బ‌డ్జెట్ కూడా పెరిగే అవ‌కాశాలున్నాయ‌నిపిస్తోంది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

విజ‌య్ దేవ‌ర‌కొండ.. త్రివిక్ర‌మ్‌.. అలా మిస్స‌య్యారు!

'గుంటూరు కారం' త‌ర‌వాత త్రివిక్ర‌మ్ త‌దుప‌రి సినిమా విష‌యంలో క్లారిటీ రాలేదు. ఆయ‌న అల్లు అర్జున్ కోసం ఎదురు చూస్తున్నారు. బ‌న్నీ ఏమో.. అట్లీ వైపు చూస్తున్నాడు. బ‌న్నీతో సినిమా ఆల‌స్య‌మైతే ఏం...

ఆయన 20 మంది ఎమ్మెల్యేలతో వచ్చేత్తా అంటే కేసీఆరే వద్దన్నారట !

కాంగ్రెస్ ప్రభుత్వం తన దయా దాక్షిణ్యాల మీదనే ఆధారపడి ఉందని అంటున్నారు కేసీఆర్. ఎందుకంటే ఇరవై మంది ఎమ్మెల్యేలను తీసుకుని వచ్చే ఓ సీనియర్ నేత .. కేసీఆర్ తో టచ్...

కేంద్ర‌మంత్రిగా ఈట‌ల రాజేంద‌ర్… బీజేపీ అగ్రనేత జోస్యం!

మాజీ మంత్రి ఈట‌ల రాజేంద‌ర్ కేంద్ర‌మంత్రి కాబోతున్నారా...? మ‌ల్కాజ్ గిరి దీవించి పంపితే జ‌రిగేది అదే అంటూ సంచ‌ల‌న ప్ర‌క‌ట‌న చేశారు కేంద్ర‌మంత్రి. మల్కాజ్ గిరిలో ఈట‌ల గెలిస్తే కేంద్ర‌మంత్రి అవుతారు అంటూ...

జైల్లో కేజ్రీవాల్ మామిడిపండ్లు తింటున్నారు…ఈడీ కొత్త ఆరోపణ

లిక్కర్ స్కామ్ లో అరెస్ట్ అయిన ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ షుగర్ లెవల్ పెంచుకునేందుకు ప్రయత్నిస్తున్నారని ఆరోపించింది ఈడీ. వైద్య పరమైన సాకులతో బెయిల్ పొందేందుకుగాను కేజ్రీవాల్ మామిడిపండ్లు, స్వీట్లు ఉద్దేశ్యపూర్వకంగా...

HOT NEWS

css.php
[X] Close
[X] Close