గన్నవరం మాజీ ఎమ్మెల్యే, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేత వల్లభనేని వంశీకి మరో బిగ్ షాక్ తగిలింది. నకిలీ ఇళ్ల పట్టాల కేసులో నూజివీడు కోర్టులో వంశీకి చుక్కెదురు అయింది.
తనకు బెయిల్ ఇవ్వాలని వంశీ దాఖలు చేసిన పిటిషన్ పై విచారణ చేపట్టిన నూజివీడు కోర్టు..ఈ పిటిషన్ ను కొట్టివేసింది. ఈ కేసులో ఇరు పక్షాల వాదనలు విన్న న్యాయస్థానం… ఆయనకు బెయిల్ ఇవ్వడం సరైంది కాదని అభిప్రాయపడుతూ బెయిల్ పిటిషన్ ను డిస్మిస్ చేసింది.
ఇప్పటికే ఇదే కేసులో వల్లభనేని వంశీ అరెస్ట్ అయి , ప్రస్తుతం విజయవాడ జైలులో రిమాండ్ ఖైదీగా ఉన్నారు. వంశీ అరెస్టు అయి మూడు నెలలకుపైగా అవుతోంది. గన్నవరం టీడీపీ ఆఫీసుపై దాడి చేసిన కేసులో ఫిర్యాదుదారుడ్ని కిడ్నాప్ చేసి బెదిరించిన కేసులో బెయిల్ వచ్చినప్పటికీ ఇతర కేసుల్లో పీటీ వారెంట్ దాఖలు చేయడంతో జైల్లోనే ఉండాల్సి వస్తోంది.
జైల్లో తరుచుగా అనారోగ్యానికి గురి అవుతున్నట్లు చెబుతున్న వంశీ ఈ కారణంతో బెయిల్ కోసం ప్రయత్నిస్తున్నారు. కానీ , ఆయనకు వరుస షాక్ లు తగులుతున్నాయి.