నా ఫ్రెండ్ రోజాపై పోటీ చేయ‌డానికి రెడీ…వాణి విశ్వ‌నాధ్‌

స‌మ‌కాలీన రాజ‌కీయాల్లో ఎపిలో అగ్ర‌గామి మ‌హిళా నేత‌గా వెలిగిపోతున్న‌ వైసీపీ మ‌హిళా ఫైర్ బ్రాండ్ రోజాకి ప్ర‌త్య‌ర్ధి డిసైడ్ అయ్యింది. అటు గ్లామ‌ర్ ఇటు ఫైర్ రెండూ ఒకే కొంగున క‌ట్టుకున్న వాణివిశ్వ‌నాధ్‌ను తెలుగుదేశం పార్టీకి రోజా కోసం స్పెష‌ల్‌గా తీసుకొస్తోంది. రాజ‌కీయాల్లోకి ఎంట్రీ ఇస్తున్న నాటి హీరోయిన్‌ వాణి విశ్వ‌నాధ్ మంగ‌ళ‌వారం ఓ ఇంట‌ర్వ్యూలో మాట్లాడింది.

తాను తెలుగుదేశం పార్టీలో చేరుతున్న‌ట్టు స్ప‌ష్టం చేసిన వాణి విశ్వ‌నాధ్‌… తాను రోజాకి పోటీగా వ‌స్తున్న‌ట్టు భావించ‌డం లేద‌ని చెప్పింది. త‌న‌కు రోజాతో వ్య‌క్తిగ‌తంగా ఎటువంటి స్ప‌ర్థ‌లూ లేవ‌ని ఆమె త‌న‌కు మంచి స్నేహితురాలంది. న‌గ‌రి నియోజ‌క‌వ‌ర్గంలో పోటీ చేస్తారా అని అంద‌రూ అంటున్నార‌ని, పోటీ చేయ‌డానికి త‌న‌కేమీ అభ్యంత‌రం లేదంది.

న‌గ‌రి అని కాద‌ని, అథిష్టానం ఎక్క‌డ నుంచి పోటీ చేయ‌మ‌న్నా చేస్తాన‌ని స్ప‌ష్టం చేసింది. వ్య‌క్తిగ‌తంగా తానెప్ప‌టి నుంచో ఎన్టీఆర్, చంద్ర‌బాబుల అభిమానిన‌ని అంటున్న వాణి విశ్వ‌నాధ్‌… ఎన్టీఆర్ బ్ర‌తికి ఉన్న‌ప్పుడే ఆయ‌న‌తో తాను మాట్లాడాన‌ని, రాజ‌కీయాల్లోకి అంటూ వ‌స్తే మీ పార్టీలోకి మాత్ర‌మే వ‌స్తాన‌ని చెప్పాన‌ని గుర్తు చేసుకుంది.

తెలుగు ప్ర‌జ‌ల‌కు సేవ చేయాల‌న్న‌దే త‌న ఏకైక త‌ప‌న త‌ప్ప త‌న రాజ‌కీయ ప్ర‌వేశానికి వేరే ప్ర‌త్యేక కార‌ణం ఏమీ లేద‌ని అంటున్న వాణి విశ్వ‌నాధ్‌… త్వ‌ర‌లోనే తెలుగుదేశం పార్టీలోకి అధికారికంగా చేర‌నున్నాన‌ని చెప్పింది. ఏదేమైనా… తెలుగుదేశం పార్టీ త‌న మీద పెట్టుకున్న న‌మ్మ‌కాన్ని నిల‌బెట్టుకుంటుందా? రోజాకి థీటైన ప్ర‌త్య‌ర్ధిగా వాణి విశ్వ‌నాధ్ నిలుస్తుందా? లేదా అనేది త్వ‌ర‌లోనే తేల‌నుంది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com