వివేకా హత్య కేసులో వర్ల రామయ్య విచారణ..!

ఆంధ్రప్రదేశ్ పోలీసులు దూకుడు మీద ఉన్నారు. వివేకా హత్య కేసును చేధించేందుకు సమాచారం లభిస్తుందని భావిస్తున్న ప్రతీ ఒక్కరినీ ప్రశ్నిస్తున్నారు. ఈ జాబితాలో టీడీపీ నేత వర్ల రామయ్య కూడా చేరారు. వర్ల రామయ్యకు.. వైఎస్ వివేకా హత్య ను దర్యాప్తు చేస్తున్న ప్రత్యేక దర్యాప్తు బృందం నోటీసులు జారీ చేసింది. తమ ఎదుట హాజరై… కేసుకు సంబంధించి.. ఆయన వద్ద ఉన్న సమాచారం అంతా.. ఇవ్వాలని ఆదేశించింది. అసలు వర్ల రామయ్యకు.. వైఎస్ వివేకాకు ఎమిటి సంబంధం అనే సందేహం అందరికీ రావొచ్చు కానీ.. పోలీసులకు మాత్రం రాదు. ఎందుకంటే… వర్ల రామయ్య.. రోజూ… వైఎస్ వివేకా హత్య కేసుపై… టీడీపీ తరపున మీడియాతో మాట్లాడుతున్నారు. పోలీసుల తీరుపైనే విమర్శలు చేస్తున్నారు. అందుకే.. వర్ల రామయ్యను ప్రశ్నించాలని.. పోలీసులు నిర్ణయించారు.

కడప ఎస్పీగా… నాలుగు నెలల్లో మూడో ఐపీఎస్‌ని ప్రభుత్వం నియమించింది. ప్రస్తుతం అన్బురాజన్ ఎస్పీగా ఉన్నారు. వచ్చీ రాగానే ఆయన కేసులపై అనుమానాలు కలిగేలా ప్రకటనలు చేశారు. దీంతో… వర్ల రామయ్య మీడియా ముందుకు వచ్చారు. ఇప్పుడే కాదు.. ఆయన వైఎస్ వివేకా హత్య జరిగినప్పటి నుండి.. టీడీపీ తరపున ఆయనే మీడియాతో మాట్లాడుతున్నారు. ప్రభుత్వం తీరుపై.. పోలీసులు వ్యవహారంపై అనుమానాలు వ్యక్తం చేస్తూనే ఉన్నారు. పోలీసులపై విమర్శలు చేస్తూండటంతో.. పోలీసు అధికారుల సంఘం నేత కూడా.. మీసం తిప్పి.. తొడకొట్టి… వర్ల రామయ్యకు వార్నింగ్ ఇచ్చారు. ఆ తర్వాతి రోజే.. సిట్ నుంచి వర్ల రామయ్యకు నోటీసులు వచ్చాయి.

పూర్వాశ్రమంలో పోలీసు అధికారి అయిన వర్ల రామయ్య… వైఎస్ వివేకా హత్య ఎవరి పనో.. పులివెందులలో ప్రతి ఒక్కరికి తెలుసని వాదిస్తున్నారు. వైఎస్ జగన్ కు.. వైఎస్ భాస్కర్ రెడ్డి.. వైఎస్ వివేకా కుమార్తె సునీతకు అందరికీ తెలుసని వర్ల రామయ్య చెబుతున్నారు. ఈ క్రమంలో.. ఇలా తెలుసని చెప్పడానికి వర్ల రామయ్య వద్ద ఉన్న ఆధారాలేమిటో చెప్పాలని… పోలీసులు అడుగుతున్నారు. అయితే.. టీడీపీ నేతలు మాత్రం.. గతంలో.. జగన్, విజయసాయి లాంటి నేతలు చేసిన వ్యాఖ్యలు ఉదహరిస్తూ.. మరి వారిని ఎందుకు ప్రశ్నించరని అడుగుతున్నారు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

జగన్ పై ప్రత్యక్ష, చిరంజీవి పై పరోక్ష విమర్శలు చేసిన బాలకృష్ణ

బాలకృష్ణ మరో మూడు రోజుల్లో షష్టి పూర్తి చేసుకోబోతున్నారు. ఈ సందర్భంగా కొన్ని టీవీ చానల్స్ కు బాలకృష్ణ ఇంటర్వ్యూలు ఇస్తున్నారు. తాజాగా ఒక ఛానల్ కిచ్చిన ఇంటర్వ్యూలో ఏపీ సీఎం జగన్...

రివ్యూ : రాంగోపాల్ వ‌ర్మ ‘ క్లైమాక్స్‌ ‘

పాడుబ‌డ్డ బావిలో మురికే ఉంటుంది. ఒక‌ప్పుడు తీయ్య‌టి నీళ్లు ఇచ్చింది క‌దా అని, ఓ గుక్కెడు నీళ్లు గొంతులోకి దించుకోం క‌దా..? రాంగోపాల్ వ‌ర్మ అదే టైపు. శివ నుంచి స‌ర్కార్ వ‌ర‌కూ... 'సినిమా...

జగన్ తో భేటీతో సినీ పరిశ్రమ సాధించేది ఏమీ లేదు: బాలకృష్ణ

జగన్ తో తెలుగు సినీ పరిశ్రమ పెద్దలు త్వరలో భేటీ కానున్నారు. తెలంగాణ ప్రభుత్వం తో సినీ పరిశ్రమ భేటీ అయిన సందర్భంలో తనను పిలవలేదని బాలకృష్ణ అలగడం, భేటీకి హాజరైన పరిశ్రమ...

సూర్య తండ్రిపై కేసు పెట్టిన టీటీడీ..!

తమిళ స్టార్ సూర్య తండ్రి శివకుమార్‌పై తిరుమల తిరుపతి దేవస్థానం కేసు పెట్టింది. తమిళనాడులో జరిగిన ఓ సభలో శివకుమార్‌ తిరుమల ఆలయానికి వెళ్లవద్దని పిలుపునిచ్చిట్లుగా టీటీడీకి ఫిర్యాదు అందింది. తిరుమలలో డబ్బులున్న...

HOT NEWS

[X] Close
[X] Close