రవిప్రకాష్‌కు హైకోర్టులోనూ ఊరట..!

రవిప్రకాష్‌పై టీవీ9 కొత్త యాజమాన్యం నమోదు చేసిన బోనస్ కేసు విషయంలో తదుపరి ఎలాంటి చర్యలు తీసుకోవద్దని హైకోర్టు పోలీసులకు ఆదేశించింది. అభియోగాలపై నవంబర్ రెండో తేదీన వరకూ స్టే విధించింది. అప్పటి వరకూ కేసును వాయిదా వేసింది. సీఈవోగా ఉన్న సమయంలో.. రవిప్రకాష్ రూ. 18 కోట్లు సంస్థ నిధులను అక్రమంగా తరలించారని అలంద మీడియా ఫిర్యాదు చేసింది. ఫిర్యాదు చేసిన.. గంటల్లోనే రవిప్రకాష్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. ఆయనను కస్టడీలోకి తీసుకునేందుకు కోర్టులో పిటిషన్ వేశారు. అయితే.. కస్టడీకి ఇచ్చేందుకు కోర్టు నిరాకరించింది. మరో వైపు క్వాష్ పిటిషన్‌ను రవిప్రకాష్ హైకోర్టులో దాఖలు చేశారు.

అలంద మీడియా దాఖలు చేసిన కేసు విషయంలో… ఎలాంటి చర్యలు వద్దని హైకోర్టు స్టే విధించడంతో… రవిప్రకాష్‌కు బెయిల్ వ‌చ్చే మార్గం సుగమం అయిందని ఆయన న్యాయవాదులు భావించారు. ఈ మేరకు నాంపల్లి కోర్టులో జరిగిన వాదనల్లో… అలంద మీడియా తరపు న్యాయవాదులు.. కోర్టు తీర్పు అందలేదనే వాదన వినిపించారు. బెయిల్ ఇవ్వవద్దని వాదించారు. మరో వైపు.. సెషన్స్ కోర్టులో కస్టడీ పిటిషన్ కూడా వేశారు. హైకోర్టు ఉత్తర్వులను.. రవిప్రకాష్ న్యాయవాదులు ప్రస్తావించి.. ఎలాంటి చర్యలు వద్దని హైకోర్టు చెప్పిందని గుర్తు చేశారు. అయితే.. ఇక్కడ కూడా.. హైకోర్టు ఉత్తర్వాలు ఇంకా అందలేదనే వాదననే… అలంద తరపు న్యాయవాదులు జడ్జికి వినిపించారు.

హైకోర్టు ఉత్తర్వుల ప్రతులను.. అందుకున్న తర్వాత వాటిని రవిప్రకాష్ లాయర్లు కోర్టులో ప్రొడ్యూస్ చేసి.. బెయిల్ కోరే అవకాశం ఉంది. అయితే.. రవిప్రకాష్‌ను ఎలాగైనా కస్టడీకి తీసుకోవాలన్న ఉద్దేశంలో… పోలీసులు ఉన్నారు. వారికి హైకోర్టు నిర్ణయం ఇబ్బందికరంగా మారింది. హైకోర్టు నవంబర్ రెండో తేదీ వరకూ స్టే ఇచ్చినందున… రవిప్రకాష్ బెయిల్ పై… ఉత్కంఠ ఏర్పడింది. అయితే.. బెయిల్ ఇవ్వడానికి అభ్యంతరం ఉండదని.. రవిప్రకాష్ న్యాయవాదులు చెబుతున్నారు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

అలా చేస్తే రాహుల్ నపుంసకుడో కాదో తేలుతుంది..కాంగ్రెస్ నేత సంచలన వ్యాఖ్యలు

ఎన్నికలు వచ్చిన ప్రతిసారి కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ పెళ్లి విషయంపై బీజేపీ నేతలు కామెంట్స్ చేయడం పరిపాటిగా మారింది. ఆయనకు మగతనం లేదని అందుకే పెళ్లి చేసుకునేందుకు భయపడుతున్నారని బీజేపీ నేతలు...

బీజేపీకి రాజాసింగ్ షాక్…ఏం జరిగిందంటే..?

హైదరాబాద్ బీజేపీ ఎంపీ అభ్యర్థి మాధవీలత నామినేషన్ కు ఎమ్మెల్యే రాజాసింగ్ డుమ్మా కొట్టారు.హైదరాబాద్ సెగ్మెంట్ ఇంచార్జ్ గా తన అభిప్రాయాన్ని తీసుకోకుండానే ఏకపక్షంగా మాధవీలత అభ్యర్థిత్వాన్ని ఫిక్స్ చేశారని రాజాసింగ్ అసంతృప్తిగా...

తెలంగాణలో ఛాలెంజింగ్ పాలిటిక్స్

లోక్ సభ ఎన్నికల్లో కాంగ్రెస్, బీజేపీ, బీఆర్ఎస్ హోరాహోరీగా తలపడుతున్నాయి. ప్రజాభిప్రాయం ఎలా ఉన్నా మెజార్టీ సీట్లు మావంటే మావేనని ప్రకటిస్తున్నాయి. ప్రత్యర్ధి పార్టీలపై ఆయా పార్టీల నేతలు విమర్శలు, ప్రతి విమర్శలు...

కొనసాగింపు కథల బాక్సాఫీసు వేట

‘బాహుబలి’ సినిమా సైజ్ ని పెంచింది. ప్రేక్షకులందరికీ థియేటర్స్ లోకి తీసుకురాగలిగితే బాక్సాఫీసు వద్ద ఎలాంటి మాయ చేయొచ్చు నిరూపించింది. సినిమా కథకు కూడా కొత్త ఈక్వేషన్ ఇచ్చింది. బహుబలికి ముందు దాదాపు...

HOT NEWS

css.php
[X] Close
[X] Close