మెగా హీరోల్లో తనదంటూ ఓ సెపరేట్ మార్క్ సృష్టించుకొన్నాడు వరుణ్ తేజ్. కొత్త తరహా కథలకు కొన్నాళ్లు కేరాఫ్ గా నిలిచాడు. ఆ తరవాత తాను కూడా కమర్షియల్ బాట పట్టాడు. కొంత కాలంగా వరుణ్‌కి హిట్ లేదు. ఓ హిట్ కొట్టి, మళ్లీ ట్రాక్ లోకి ఎక్కాలని గట్టిగా ప్రయత్నిస్తున్నాడు. ప్రస్తుతం ‘కొరియన్ కనకరాజు’ సినిమా చేశాడు. షూటింగ్ పూర్తయ్యింది. త్వరలోనే విడుదల చేస్తారు. ఈలోగా మరో కథ ఒప్పుకొన్నాడు.
‘కమిటీ కుర్రాళ్లు’తో ఆకట్టుకొన్న దర్శకుడు యదువంశీ. ఇప్పుడు వరుణ్‌తో ఓ సినిమా చేస్తున్నాడు. కథ లాక్ అయిపోయింది. ఉగాదికి లాంఛనంగా ప్రారంభిస్తారని టాక్. నిహారిక ఈ చిత్రానికి నిర్మాతగా వ్యవహరించనున్నారు. ‘కమిటీ కుర్రాళ్లు’ చిత్రానికీ నిహారికనే నిర్మాత. త్వరలోనే ఓ అధికారిక ప్రకటన రావొచ్చు. నిహారిక నిర్మించిన `రాకాస` రిలీజ్ కి రెడీ అయిన సంగతి తెలిసిందే.
మరోవైపు మారుతి దర్శకత్వంలో వరుణ్ ఓ సినిమా చేసే ఛాన్స్ వుంది. ‘రాజాసాబ్’ తరవాత మారుతి చేసే సినిమా ఇది. స్క్రిప్టు పనులు జరుగుతున్నాయి. వరుణ్‌కి ఓ నేరేషన్ ఇవ్వాలి. అది అయ్యాక.. ప్రాజెక్ట్ పై ఓ క్లారిటీ వస్తుంది. మెగా హీరోలతో మారుతికి మంచి అనుబంధం వుంది. అల్లు శిరీష్, సాయిధరమ్ తేజ్ లతో సినిమాలు చేశారు. ఇప్పుడు వరుణ్ తో కూడా దాదాపుగా ఫిక్సయినట్టే.
