వరుణ్ తేజ్ ఆపరేషన్ వాలెంటైన్ తో బాలీవుడ్ ఎంట్రీ ఇస్తున్నాడు. ఎయిర్ ఫోర్స్ యాక్షన్ థ్రిల్లర్ గా రూపొందిన ఈ సినిమాకి శక్తి ప్రతాప్ సింగ్ దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ రోజు సినిమా ట్రైలర్ ని విడుదల చేశారు. ట్రైలర్ లో కథని దాదాపుగా రివిల్ చేశారు. అర్జున్ దేవ్ (వరుణ్ తేజ్) ఎయిర్ ఫోర్స్ లో స్క్వాడ్రన్ లీడర్. పుల్వామా ఉగ్రదాడిలో 42 మంది సీఆర్పీఎఫ్ జవాన్లు వీర మరణానికి ఇండియన్ ఎయిర్ ఫోర్స్ ఎలా బదులు చెప్పింది ? ఈ యుద్ధంలో అర్జున్ పాత్ర ఏమిటి ? అనేది కథ.
ట్రైలర్ లో యాక్షన్, ఎమోషన్, దేశభక్తి సమపాళ్లలో మిక్స్ చేశారు. వైమానిక దాడులని బాగానే చిత్రీకరించారు. వరుణ్ తేజ్ బాడీ లాంగ్వేజ్ ఆ పాత్రకు సరిగ్గా నప్పింది. ఇందులో మానుషి చిల్లర్ తో ఓ లవ్ ట్రాక్ కూడా వుంది. సినిమాటోగ్రఫీ రిచ్ గా వుంది. మిక్కీ జె మేయర్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఆకట్టుకుంది. అయితే ట్రైలర్ ఇటివలే వచ్చిన హృతిక్ రోషన్ టాప్ గన్ ఛాయలు కనిపించాయి. అందులో మెయిన్ థీం కూడా పుల్వామా ఉగ్రదాడికి ఇండియన్ ఎయిర్ ఫోర్స్ బదులు చెప్పడమే. ఆపరేషన్ వాలెంటైన్ నడక అలానే అనిపిస్తోంది. ఏదేమైనా ఎయిర్ వార్ నేపధ్యంలో తెలుగులో ఇప్పటివరకూ సినిమాలు పెద్దగా రాలేదు. ఇప్పుడు వరుణ్ తేజ్ ఈ జోనర్ పరిచయం చేస్తున్నాడు. తెలుగు, హిందీ భాషల్లో మార్చి 1సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.