పూల రంగడు, అహనా పెళ్లంట సినిమాలతో నవ్వించాడు వీరభద్రమ్. భాయ్‌తో డిజాస్టర్ దెబ్బ గట్టిగానే తగలడంతో కెరీర్‌కి కాస్త గ్యాప్ వచ్చింది. ఇటీవల చుట్టాలబ్బాయ్ తీశాడు. ఈ సినిమా హిట్ కాకపోయినా.. డీసెంట్ వసూళ్లని దక్కించుకొంది. ఆ ధైర్యంతోనే మెగా కాంపౌండ్‌లో అడుగుపెట్టాడు వీరభద్రమ్. సాయిధరమ్ తేజ్ కోసం ఓ కథ రెడీ చేసుకొని.. కాల్షీట్ల కోసం ఎదురుచూస్తున్నాడు. చుట్టాలబ్బాయ్ నిర్మాతలే… ఈ సినిమాని టేకప్ చేయనున్నారని తెలుస్తోంది. ఇదో లవ్, యాక్షన్ ఎంటర్టైనర్ అని సమాచారం. ఇటీవలే సాయిధరమ్‌ని కలసి చూచాయిగా లైన్ చెప్పాడట. పూర్తి కథ సిద్దం చేయండి.. అప్పుడు మళ్లీ కలుద్దాం అంటూ మాటిచ్చినట్టు టాక్.
సాయిధరమ్ వరుస సినిమాలతో బిజీగా ఉన్నాడు. తిక్క దెబ్బకొట్టడంతో కెరీర్ విషయంలో మరింత జాగ్రత్తగా నిర్ణయాలు తీసుకొంటున్నాడు. ఈ దశలో మరో రాంగ్ స్టెప్ వేస్తే.. బ్యాడ్ డేస్ మొదలైనట్టే. అందుకే వీరభద్రమ్‌కి ఓకే చెప్పడానికి కాస్త సంశయిస్తున్నాడని టాక్. సాయి చూపు ప్రస్తుతానికి పెద్ద దర్శకులపై ఉంది. మరో హిట్ పడితే కచ్చితంగా ఓ రేంజు దర్శకుల నుంచి పిలుపులు వస్తాయి. అలాంటి ఆఫర్ కోసం ఎదురుచూస్తున్నాడు. ఈ దశలో జస్ట్ యావరేజ్ సినిమా తీసిన వీరభద్రమ్‌కి అవకాశం ఇస్తాడా అన్నది డౌటే. అయితే వీరభద్రమ్ లైన్ కాస్త టెమ్టింగ్‌గా ఉండడం, నిర్మాతని రెడీ చేసుకొని మరీ హీరో అప్పాయింట్మెంట్ తీసుకోవడం వీరభద్రమ్‌కి కలిసొచ్చే విషయాలు. కథ కూడా నచ్చేస్తే.. వీరభద్రమ్‌కి లైన్ క్లియర్ అవుతుంది. అందుకే.. మెగా హీరో పిలుపు కోసం పడిగాపులు కాస్తున్నాడీ దర్శకుడు.