స్పీకర్ పక్షపాతంగా వ్యవహరిస్తున్నారని అసెంబ్లీని బహిష్కరించిన భారత రాష్ట్ర సమితి.. అధికారపక్షానికి ఓ ఆఫర్ ఇచ్చింది. పవర్ పాయింట్ ప్రజెంటేషన్ అవకాశాన్ని తమకు కల్పిస్తే అసెంబ్లీకి వస్తామని ప్రకటించారు. తెలంగాణ భవన్ లో నిర్వహించిన మీడియా సమావేశం ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి స్పీకర్ ను టార్గెట్ చేసుకున్నారు. ప్రశ్నోత్తరాల సమయంలో సీఎం రేవంత్ రెడ్డి గంటన్నర సేపు మాట్లాడి సభాసంప్రదాయాలను ఉల్లంఘించారన్నరు. తమకు మాట్లాడేందుకు అవకాశం ఇవ్వలేదని విమర్శించారు.
తాము అసెంబ్లీని బహిష్కరించడంపై నెగెటివ్ ఫీడ్ బ్యాక్ వస్తుందని బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు అర్థం చేసుకున్నారు. అందుకే కవర్ చేసుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. 2016లో కేసీఆర్ అసెంబ్లీలో పీపీటీ ఇచ్చినప్పుడు కాంగ్రెస్ వ్యతిరేకించిందన్నారు. అప్పట్లో టీడీపీ ఎమ్మెల్యేగా రేవంత్ రెడ్డి కూడా పీపీటీని వ్యతిరేకించారని చెప్పుకొచ్చారు. అయితే అప్పట్లో వారు బహిష్కరించారని ఇప్పుడు మేము బహిష్కరించామని సమర్థించుకోవడమే కాస్త వింతగా ఉంది. అయినా బీఆర్ఎస్కు మరో దారి లేదు. పీపీటీకి చాన్స్ ఇస్తే వస్తామని చెప్పడం ద్వారా అదే కారణం అన్నట్లుగా ప్రజలకు చెప్పుకుంటున్నారు.
ప్రభుత్వం అసెంబ్లీలో శనివారం పీపీటీ ఇస్తోంది. దాన్ని బేస్ చేసుకుని ఆదివారం పవర్ పాయింట్ ప్రజెంటేషన్.. తెలంగాణ భవన్ లో ఇవ్వాలని హరీష్ రావు నిర్ణయించుకున్నారు. తెలంగాణ భవన్ లో ఆదివారం.. ప్రభుత్వం ఇచ్చే ప్రెజెంటేషన్ కు పోటీగా ..తమ వాదన వినిపించనున్నారు.
