తెలకపల్లి వ్యూస్: వెంకయ్యపై వేడి వేడి విమర్శలు

ఇందిరే ఇండియా అన్న దేవకాంత బారువాను మించిపోయి నరేంద్ర మోడీ దేవుడిచ్చిన కానుకగా కీర్తించిన కేంద్రమంత్రి వెంకయ్య నాయుడు మాటలు ఆరెస్సెస్‌ పీఠాధిపతులకు కూడా మింగుడుపడక గట్టిగానే మందలించారని ఆ పార్టీ వర్గాలు ధృవీకరిస్తున్నాయి. మోడీ గురించి ప్రజలు అలా అనుకుంటున్నారని తాను చెబితే మీడియా తప్పుగా రాసిందని వెంకయ్య నాయుడు షరా మామూలుగా వివరణ ఇచ్చినట్టు మరో సమాచారం. వాస్తవానికి శ్రుతిమించిన పొగడ్తలు వెంకయ్యకు కొత్తేమీ కాదు. స్వతహాగా అద్వానీ అనుయాయుడుగా పేరున్న వెంకయ్య, వాజ్‌పేయి ప్రధానిగా వుండగా ఆయన ‘వికాస్‌ పురుష్‌’ అని కీర్తించి రాజకీయ ప్రతిష్టంభనకు కారణమైనారు. తర్వాత వాజ్‌పేయి ఎలాగో సర్దుకుని మళ్లీ సజావుగా సాగనిచ్చారు.

అదలా వుంచి ఆంధ్ర ప్రదేశ్‌ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడును అవకాశమొచ్చినప్పుడల్లా ఆకాశానికెత్తి మాట్లాడ్డం ఎందుకని బిజెపి నేతలే ప్రశ్నిస్తుంటారు. మోడీని, చంద్రబాబును అదేపనిగా పొగిడే వెంకయ్య నాయుడు కన్నయ్య వంటి కుర్రాళ్లపై పదేపదే దాడి చేస్తున్నారు. కాంగ్రెస్‌ కొత్తకొత్త హీరోలను తయారు చేస్తున్నదని ఇటీవలి ఘటనల తర్వాత ఆయన అపహాస్యం చేశారు. ఆయన నిరంతరం దేశ రాజకీయాలపైన ఏదో ఒక వ్యాఖ్యానం చేస్తూనే వుంటారు.

ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణలలో మీడియాకు మేత ఇస్తూనే వుంటారు. మీరు పార్టీ విధానాలను చెప్పవలసిన అధికార ప్రతినిధి కానప్పుడు ఇవన్నీ ఎందుకు చేస్తున్నారని కూడా ఆరెస్సెస్‌ అగ్రనేతలు ఆగ్రహించినట్టు, ఆయనకు కూడా సన్నిహితులైన వారే వెల్లడించారు. ఈ ఏడాది చివరకు తెలుగుదేశం బిజెపి తెగతెంపులు ఖాయమైనప్పుడు చంద్రబాబును వూరికే పొగిడితే రేపు ఏం చెప్పుకోవాలని బిజెపి రాష్ట్ర నాయకులు వాపోతున్నారు. అసలు హెచ్‌సియు విసిగా అప్పారావును మళ్లీ పంపించి ఇంత రభసకు అవకాశం ఇవ్వడం పార్టీకి ఏ విధంగా ఉపయోగమని కూడా కొందరు జాతీయ నాయకత్వానికి ప్రభుత్వాధినేతలకు ఫిర్యాదు చేసినట్టు సమాచారం. అయితే ఇలాటివన్నీ ఆ సీనియర్‌నేత వైఖరిలో మార్పు రావడం అంత సులభమా

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

బీజేపీ వర్సెస్ టీఆర్ఎస్: నిన్న ఐటీఐఆర్.. ఇవాళ రైల్వే కోచ్ ఫ్యాక్టరీ..!

ఎమ్మెల్సీ ఎన్నికల పుణ్యమా అని తెలంగాణ రాజకీయాల్లో రోజుకో అంశం హైలెట్ అవుతోంది. హైదరాబాద్ ఎమ్మెల్సీ స్థానం గురించి బీజేపీపై విమర్శలు చేసేటప్పుడు ఐటీఐఆర్ ప్రాజెక్టును హైలెట్ చేసిన కేటీఆర్.. వరంగల్‌కు పోయి.....

ఏపీ డీజీపీపై కేంద్ర హోంశాఖ విచారణ చేయిస్తున్న రఘురామరాజు..!

వైసీపీ ఎంపీ రఘురామకృష్ణరాజు తన నియోజకవర్గం నర్సాపురం వెళ్తే దొంగ కేసులు పెట్టి అరెస్ట్ చేయించాలని ప్లాన్ చేస్తున్నారని అనుమానిస్తున్నారు. అందుకే ఆయన ఉంటే ఢిల్లీ లేకపోతే హైదరాబాద్‌నే ఎంచుకుంటున్నారు. కానీ నర్సాపురం...

బెజవాడకు టీడీపీ హైకమాండ్ కేశినేనినే..!

బెజవాడకు తానే హైకమాండ్ అని ప్రకటించుకున్న ఎంపీ కేశినేని నాని చివరకు తాను అనుకున్నది అనుకున్నట్లుగా చేసుకుంటున్నారు. తన కుమార్తె శ్వేతను మేయర్ అభ్యర్థిగా ప్రతిపాదించారు. హైకమాండ్ ఆమోదముద్ర వేసేలా చూసుకున్నారు. తాను...

కొత్త త‌ప్పుల్ని చేస్తానేమో.. పాత‌వి రిపీట్ చేయ‌ను – రాజ్ త‌రుణ్‌తో ఇంట‌ర్వ్యూ

ద‌ర్శ‌కుడ‌వ్వాల‌నుకుని వ‌చ్చి - అనుకోకుండా హీరో అయిపోయిన వాడు రాజ్ త‌రుణ్‌. అదే త‌న‌కు బాగా క‌లిసొచ్చింది. ఉయ్యాల జంపాలా, కుమారి 21 ఎఫ్‌, సినిమా చూపిస్త మావ‌.. ఇలా హ్యాట్రిక్ సినిమాల‌తో...

HOT NEWS

[X] Close
[X] Close