జ‌న‌తా గ్యారేజ్‌.. రీషూట్‌

ఎన్టీఆర్ – కొర‌టాల శివ కాంబినేష‌న్‌లో తెర‌కెక్కుతున్న జ‌న‌తా గ్యారేజీ షూటింగ్ స్పీడు స్పీడుగా సాగిపోతోంది. అన్నీ అనుకొన్న‌ట్టు జ‌రుగుతున్న స‌మ‌యాన‌… ఓ చిన్న షాక్‌. జ‌న‌తా గ్యారేజ్‌లో అనూహ్య‌మైన మార్పు సంభ‌వించింది. వివ‌రాల్లోకి వెళ్తే… ఈ సినిమాలో ఎన్టీఆర్‌కి పెద‌నాన్న‌గా మోహ‌న్‌లాల్ న‌టిస్తున్న సంగ‌తి తెలిసిందే. ఆయ‌న‌కు జోడీగా ఒక‌ప్పటి క‌థానాయిక దేవ‌యానిని తీసుకొన్నారు. ఎన్టీఆర్ సినిమా అన‌గానే ఆమె కూడా సంతోషంగా వ‌చ్చి.. కాల్షీట్లు ఇచ్చేసింది. అయితే ఇప్పుడు దేవ‌యాని ఈ సినిమా నుంచి త‌ప్పుకొంది.

దేవ‌యాని – మోహ‌న్‌లాల్ మ‌ధ్య కొన్ని సన్నివేశాల్ని ఇటీవ‌ల తెర‌కెక్కించారు. తీరా ర‌షెష్ చూస్తే.. మోహ‌న్‌లాల్ న‌ట‌న‌కు, దేవ‌యాని న‌ట‌న‌కు ఏమాత్రం స‌రితూగ‌లేద‌ని అనిపించంద‌ట‌. దేవ‌యాని మిస్ మ్యాచ్ అవుతోంద‌ని, అలాగైతే స‌న్నివేశాల‌న్నీ తేలిపోతాయ‌ని చిత్ర‌యూనిట్ భ‌య‌ప‌డింది. అందుకే.. దేవ‌యానిని అర్థాంత‌రంగా తొల‌గించార‌ని టాక్‌. ఆమె స్థానంలో సుహాసినిని తీసుకొన్నార‌ట‌. ఆమె అయితే.. త‌న అనుభ‌వంతో మోహ‌న్‌లాల్‌కి దీటుగా న‌టిస్తుంద‌ని చిత్ర‌బృందం ఆలోచ‌న‌. ఒక‌ట్రెండు రోజుల్లో సుహాసిని చిత్ర‌బృందంతో జాయిన్ అయ్యే అవ‌కాశాలున్నాయి. దేవ‌యాని పుణ్య‌మా అని.. జ‌న‌తా గ్యారేజ్ రీ షూట్‌లో ప‌డింది. దేవ‌యాని స‌న్నివేశాల్ని సుహాసినితో తెర‌కెక్కించ‌బోతున్నారు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

అలా చేస్తే రాహుల్ నపుంసకుడో కాదో తేలుతుంది..కాంగ్రెస్ నేత సంచలన వ్యాఖ్యలు

ఎన్నికలు వచ్చిన ప్రతిసారి కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ పెళ్లి విషయంపై బీజేపీ నేతలు కామెంట్స్ చేయడం పరిపాటిగా మారింది. ఆయనకు మగతనం లేదని అందుకే పెళ్లి చేసుకునేందుకు భయపడుతున్నారని బీజేపీ నేతలు...

బీజేపీకి రాజాసింగ్ షాక్…ఏం జరిగిందంటే..?

హైదరాబాద్ బీజేపీ ఎంపీ అభ్యర్థి మాధవీలత నామినేషన్ కు ఎమ్మెల్యే రాజాసింగ్ డుమ్మా కొట్టారు.హైదరాబాద్ సెగ్మెంట్ ఇంచార్జ్ గా తన అభిప్రాయాన్ని తీసుకోకుండానే ఏకపక్షంగా మాధవీలత అభ్యర్థిత్వాన్ని ఫిక్స్ చేశారని రాజాసింగ్ అసంతృప్తిగా...

తెలంగాణలో ఛాలెంజింగ్ పాలిటిక్స్

లోక్ సభ ఎన్నికల్లో కాంగ్రెస్, బీజేపీ, బీఆర్ఎస్ హోరాహోరీగా తలపడుతున్నాయి. ప్రజాభిప్రాయం ఎలా ఉన్నా మెజార్టీ సీట్లు మావంటే మావేనని ప్రకటిస్తున్నాయి. ప్రత్యర్ధి పార్టీలపై ఆయా పార్టీల నేతలు విమర్శలు, ప్రతి విమర్శలు...

కొనసాగింపు కథల బాక్సాఫీసు వేట

‘బాహుబలి’ సినిమా సైజ్ ని పెంచింది. ప్రేక్షకులందరికీ థియేటర్స్ లోకి తీసుకురాగలిగితే బాక్సాఫీసు వద్ద ఎలాంటి మాయ చేయొచ్చు నిరూపించింది. సినిమా కథకు కూడా కొత్త ఈక్వేషన్ ఇచ్చింది. బహుబలికి ముందు దాదాపు...

HOT NEWS

css.php
[X] Close
[X] Close