ఆ విషయంలో భాజపాకి కాంగ్రెస్ పార్టీయే ఆదర్శమా?

ఒకప్పుడు కాంగ్రెస్ పార్టీ కేంద్రంలో అధికారంలో ఉన్నప్పుడు దేశంలోని కాంగ్రెసేతర ప్రభుత్వాలను కూల్చడానికి ప్రయత్నించేది. ఆంధ్రాలో ఎన్టీఆర్ ప్రభుత్వాన్ని, తమిళనాడులో కరుణానిధి ప్రభుత్వాన్ని, గోవాలో మనోహర్ పరిక్కర్ ప్రభుత్వాన్ని…ఇలాగ చెప్పుకొంటూపోతే ఆ జాబితా చాలానే ఉంది. ఇప్పుడు కేంద్రంలో అధికారంలో ఉన్న భాజపా కూడా కాంగ్రెస్ బాటలోనే నడుస్తున్నట్లుంది. కొన్ని రోజుల క్రితమే అరుణాచల్ ప్రదేశ్ లో కాంగ్రెస్ ప్రభుత్వంలోని ఎమ్మెల్యేలను తిరుగుబాటుకి ప్రోత్సహించి ప్రభుత్వాన్ని కూల్చివేసింది. ఆ తరువాత భాజపా సభ్యుల మద్దతుతో కాంగ్రెస్ తిరుగుబాటు ఎమ్మెల్యే కలికో పౌల్ నేతృత్వంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. దానిపై మాజీ ముఖ్యమంత్రి నబం తూకి ప్రధానిని, రాష్ట్రపతిని కలిసి పిర్యాదు చేసినా ప్రయోజనం లేకుండా పోయింది.

ఇప్పుడు భాజపా దృష్టి ఉత్తరాఖండ్ లోని కాంగ్రెస్ ప్రభుత్వంపై పడింది. అక్కడ కూడా సరిగ్గా అదే ఫార్ములాని ఉపయోగించి తొమ్మిది మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలని ప్రభుత్వంపై తిరుగుబాటుకి ప్రోత్సహించింది. వారు భాజపా ఎమ్మెల్యేలతో కలిసి రాష్ట్ర గవర్నర్ కృష్ణ కాంత పౌల్ ని కలిసి ప్రభుత్వ ఏర్పాటుకి అవకాశం కల్పించవలసిందిగా కోరగానే, ఆయన వెంటనే సానుకూలంగా స్పందిస్తూ ఈనెల 28లోగా శాసనసభలో బలం నిరూపించుకోమని ముఖ్యమంత్రి హరీష్ ని ఆదేశించారు.

నరేంద్ర మోడీ దేశాన్ని మళ్ళీ గాడిన పెట్టి అభివృద్ధి పధంలో ముందుకు నడిపించగలరనే నమ్మకంతోనే ప్రజలు ఎన్డీయే కూటమికి తిరుగులేని మెజార్టీతో అధికారం కట్టబెట్టారు. కానీ ఇప్పుడు అది కూడా కాంగ్రెస్ బాటలోనే కొనసాగుతూ ఈవిధంగా ప్రజలెన్నుకొన్న ప్రభుత్వాలను కూల్చివేసే ప్రయత్నాలు చేస్తుండటం ప్రజలు జీర్ణించుకోలేకపోతున్నారు. భాజపాని దేశమంతటా వ్యాపింపజేయాలని తాపత్రయం పడటం తప్పు కాదు. కానీ అందుకు ఇటువంటి అప్రజాస్వామిక పద్దతులు అవలంభించడమే చాలా తప్పు.

తమ గురించి ప్రజలు ఏమనుకొంటున్నారో గ్రహించనట్లుగా నటిస్తూ కేంద్రమంత్రి వెంకయ్య నాయుడు నిసిగ్గుగా తమ పార్టీ తప్పులను సమర్ధించుకొన్నారు. ఆనాడు కాంగ్రెస్ ప్రభుత్వం కూడా ఇలాగే చేసిందని చెప్పుకొచ్చి, అది చేస్తే తప్పు కానిది తాము చేస్తే తప్పేలాగవుతుందని ప్రశ్నించారు. ఇక ఆర్ధిక మంత్రి అరుణ్ జైట్లీ మాట్లాడుతూ ఆ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీలో అంతర్గతంగా ముఠాల కుమ్ములాటలు కారణంగానే హరీష్ రావత్ ప్రభుత్వానికి ఈ పరిస్థితి ఏర్పడింది తప్ప దానికి మా పార్టీ కారణం కాదని సర్దిచెప్పుకొన్నారు.

ఒకవేళ కాంగ్రెస్ పార్టీలో అంతర్గతంగా కుమ్ములాటలు జరుగుతుంటే, అసమ్మతివాదులతో భాజపా ఎందుకు చేతులు కలిపింది? కాంగ్రెస్ పార్టీ అంతర్గత సమస్యలలో భాజపా ఎందుకు వేలు పెడుతోంది? అసమ్మతివాదులతో చేతులు కలిపి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఎందుకు కూల్చి వేయాలని ప్రయత్నిస్తోంది? అనే ప్రశ్నలకు వచ్చే సమాధానమే భాజపా వైఖరిని పట్టిస్తోంది.

ప్రస్తుతం భాజపా అధికారంలో ఉంది కనుక ఏమి చేసినా చెల్లుతుంది. దానిని ఎవరూ ప్రశ్నించలేరు కూడా. కానీ ఒకప్పుడు కాంగ్రెస్ కూడా ఈవిదంగానే ప్రజలను పట్టించుకోకుండా తప్పులు చేసింది కనుకనే దానికి బుద్ధి చెప్పారు. ఇప్పుడు భాజపా కూడా అలాగే వ్యవహరించదలిస్తే, సమయం వచ్చినప్పుడు దానికీ ప్రజలు తప్పకుండా బుద్ధి చెపుతారు. అధికారంలో ఉన్నప్పుడు కన్నుమిన్నుకానకుండా వ్యవహరిస్తూ, ఎన్నికల సమయంలో ప్రజలను ప్రసన్నం చేసుకోవడానికి నానా తిప్పలు పడే బదులు, అధికారంలో ఉన్నప్పుడు ప్రజల ఆశలకు అనుగుణంగా బుద్ధిగా పని చేస్తే సరిపోతుంది కదా?

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

జగన్ తండ్రిని కూడా వదల్లేదా..? షర్మిల సంచలన వ్యాఖ్యలు

ఏపీ కాంగ్రెస్ చీఫ్ వైఎస్ షర్మిల అసలు రాజకీయం ఇప్పుడు స్టార్ట్ చేశారు.వైఎస్సార్ కు వారసురాలు జగన్ రెడ్డి కాదని బలంగా చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. వైఎస్ రాజకీయ వారసత్వాన్ని కొనసాగిస్తున్నది తను...

భయపెడుతోన్న ఎండలు…వాతావరణ శాఖ బిగ్ అలర్ట్

ఎండలతో తెలుగు రాష్ట్రాలు కుతకుత ఉడుకుతున్నాయి. బయటకు వెళ్లేందుకు జనం జంకుతున్నారు. పగలూ, సాయంత్రం అనే తేడా లేకుండా ఉక్కపోత సెగలు పుట్టిస్తోంది.ఈ క్రమంలోనే వాతావరణ శాఖ బిగ్ అలర్ట్ ఇచ్చింది. రానున్న...

ఈవీఎం, వీవీ ప్యాట్ పిటిషన్లపై సుప్రీం కీలక తీర్పు

లోక్ సభ ఎన్నికల వేళ ఈవీఎం-వీవీప్యాట్‌కు సంబంధించి దాఖలైన పిటిషన్లపై సుప్రీంకోర్టు తీర్పు వెలువరించింది. వీవీప్యాట్‌ స్లిప్పులతో ఈవీఎం ద్వారా పోలైన ఓట్లను వందశాతం సరిపోల్చాలనే పిటిషన్లను సర్వోన్నత న్యాయస్థానం తిరస్కరించింది. జస్టిస్...

పోలింగ్ ముగిసిన తర్వాత ట్యాపింగ్ కేసులో అసలైనఅరెస్టులు !

ఎన్నికల హడావుడి తగ్గిన తర్వాత ట్యాపింగ్ కేసులో ఎన్నో బ్రేక్ డాన్సులు చోటు చేసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. స్పెషల్‌ ఇంటెలిజెన్స్ బ్యూరో చీఫ్‌గా పనిచేసిన ప్రభాకర్ రావుపై రెడ్ కార్నర్ నోటీసులు...

HOT NEWS

css.php
[X] Close
[X] Close