దేవుడిగా వెంక‌టేష్‌!

త‌మిళంలో సూప‌ర్ హిట్ అయిన సినిమా… ఓ మై క‌డ‌వులే. ఈ చిత్రాన్ని తెలుగులో రీమేక్ చేస్తున్నారు. `ఓరి దేవుడా` పేరుతో. విశ్వ‌క్‌సేన్ హీరో. అశ్వ‌త్ మ‌రిముత్తు ద‌ర్శ‌కుడు. ఈ సినిమాలో దేవుడి పాత్ర కీల‌కం. త‌మిళంలో ఆ పాత్ర‌ని విజ‌య్ సేతుప‌తి చేశాడు. తెలుగులో దాన్ని ఓ టాప్ హీరోతో చేయించాల‌ని గ‌త కొన్నాళ్లుగా చిత్ర‌బృందం ప్ర‌య‌త్నిస్తోంది. ఎట్ట‌కేల‌కు ఈ సినిమాకి దేవుడు దొరికేశాడు. ఆ పాత్ర చేయ‌డానికి వెంక‌టేష్ ఒప్పుకొన్నారు. ఆయ‌న ఈ సినిమాకి ఇచ్చింది నాలుగైదు రోజుల కాల్షీట్లే. త‌మిళంలో విజ‌య్‌సేతుప‌తి మీద కేవ‌లం 3 రోజుల్లో ఆయా సన్నివేశాల్ని తెర‌కెక్కించారు. దాంతో పోలిస్తే.. వెంకీ కాస్త ఎక్కువ కాల్షీట్లు ఇచ్చిన‌ట్టే లెక్క‌. వెంకీ ఆగ‌మ‌నంతో `ఓరి దేవుడా` లుక్ పూర్తిగా మారిపోనుంది. మిథాలీ పార్క‌ర్ క‌థానాయిక‌గా న‌టిస్తున్న ఈ చిత్రాన్ని పీపుల్స్ మీడియా తెర‌కెక్కిస్తోంది. వెంక‌టేష్ పార్ట్ మిన‌హా షూటింగ్ మొత్తం పూర్త‌యింది. వెంకీ కోటా కూడా అయిపోతే, సినిమా సిద్ధ‌మైపోయిన‌ట్టే.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

అలా చేస్తే రాహుల్ నపుంసకుడో కాదో తేలుతుంది..కాంగ్రెస్ నేత సంచలన వ్యాఖ్యలు

ఎన్నికలు వచ్చిన ప్రతిసారి కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ పెళ్లి విషయంపై బీజేపీ నేతలు కామెంట్స్ చేయడం పరిపాటిగా మారింది. ఆయనకు మగతనం లేదని అందుకే పెళ్లి చేసుకునేందుకు భయపడుతున్నారని బీజేపీ నేతలు...

బీజేపీకి రాజాసింగ్ షాక్…ఏం జరిగిందంటే..?

హైదరాబాద్ బీజేపీ ఎంపీ అభ్యర్థి మాధవీలత నామినేషన్ కు ఎమ్మెల్యే రాజాసింగ్ డుమ్మా కొట్టారు.హైదరాబాద్ సెగ్మెంట్ ఇంచార్జ్ గా తన అభిప్రాయాన్ని తీసుకోకుండానే ఏకపక్షంగా మాధవీలత అభ్యర్థిత్వాన్ని ఫిక్స్ చేశారని రాజాసింగ్ అసంతృప్తిగా...

తెలంగాణలో ఛాలెంజింగ్ పాలిటిక్స్

లోక్ సభ ఎన్నికల్లో కాంగ్రెస్, బీజేపీ, బీఆర్ఎస్ హోరాహోరీగా తలపడుతున్నాయి. ప్రజాభిప్రాయం ఎలా ఉన్నా మెజార్టీ సీట్లు మావంటే మావేనని ప్రకటిస్తున్నాయి. ప్రత్యర్ధి పార్టీలపై ఆయా పార్టీల నేతలు విమర్శలు, ప్రతి విమర్శలు...

కొనసాగింపు కథల బాక్సాఫీసు వేట

‘బాహుబలి’ సినిమా సైజ్ ని పెంచింది. ప్రేక్షకులందరికీ థియేటర్స్ లోకి తీసుకురాగలిగితే బాక్సాఫీసు వద్ద ఎలాంటి మాయ చేయొచ్చు నిరూపించింది. సినిమా కథకు కూడా కొత్త ఈక్వేషన్ ఇచ్చింది. బహుబలికి ముందు దాదాపు...

HOT NEWS

css.php
[X] Close
[X] Close