వెంకటేష్ స్పీచులు భలే గమ్మత్తుగా వుంటాయి. సాగదీత వుండదు. చిన్న చిన్న వాక్యాలతో భలే సరదాగా మాట్లాడతారు. చిరు ‘మన శంకర వర ప్రసాద్ గారు’ సినిమాలో వెంకీ ఓ పాత్ర చేస్తున్నారు. ఈ సినిమా ప్రీరిలీజ్ ఈవెంట్ లో వెంకీ మాట్లాడిన తీరు ఆట్టుకుంది. ‘చిరు రఫ్ ఆడేస్తారు. నేను కూడా ఎనీ సెంటర్ సింగల్ హ్యాండ్ అని రఫ్ ఆడాను. ఇద్దరం రాఫ్ఫాడాం. రచ్చ రచ్చే’అన్నారు
”నేను మా తమ్ముళ్ళు పవన్ కళ్యాణ్ తో మహేష్ తో మల్టీ స్టార్స్ చేశాను. అప్పుడు మంచి సౌండ్ వచ్చింది. ఇప్పుడు అన్నయ్యతో చేస్తున్నాను. సౌండ్ ఇంకా గట్టిగా ఉండాలి. ఇదే సంక్రాంతి స్పిరిట్. ఇది మంచి ఫ్యామిలీ ఫిలిం. మంచి ఎంటర్టైన్మెంట్ ఫిలిం సంక్రాంతికి వస్తోంది. అలాగే సంక్రాంతి ఫిలిమ్స్ అన్ని చాలా పెద్ద హిట్ అవ్వాలని’అని కోరుకున్నారు వెంకీ.
