మెగాస్టార్ చిరంజీవి ‘మన శంకర వర ప్రసాద్’లో వెంకటేష్ ఓ కీలక పాత్ర పోషిస్తున్న సంగతి తెలిసిందే. ఇటీవలే ఆయన సెట్స్ లోకి అడుగుపెట్టారు. చిరంజీవి – వెంకీలపై కీలక సన్నివేశాల్ని తెరకెక్కిస్తున్నారు. నవంబరు తొలి వారం వరకూ ఈ షెడ్యూల్ ఉంటుంది. నిజానికి ఈ డేట్లు ఆయన త్రివిక్రమ్ సినిమాకి కేటాయించారు. ఈనెల 26 నుంచి త్రివిక్రమ్ సినిమా సెట్స్ పైకి వెళ్లాలి. అందుకు ఏర్పాట్లన్నీ పూర్తి చేసుకొన్నారు. కానీ చిరంజీవి సినిమా కోసం త్రివిక్రమ్ సినిమా పక్కన పెట్టాల్సివచ్చింది. చిరు సినిమా పూర్తయ్యాకే.. త్రివిక్రమ్ ప్రాజెక్ట్ పట్టాలెక్కిస్తారు. నవంబరు చివరి వారంలో త్రివిక్రమ్ సినిమా సెట్స్ పైకి వెళ్లే అవకాశం ఉంది. చిరుతో వెంకీకి ప్రత్యేకమైన అనుబంధం ఉంది. పైగా దర్శకుడు అనిల్ రావిపూడి అంటే చాలా ఇష్టం. వీరిద్దరి కాంబోలో హ్యాట్రిక్ సినిమాలొచ్చాయి. ‘సంక్రాంతికి వస్తున్నాం’ అయితే కెరియర్ బెస్ట్ గా నిలిచింది. ఆ అనుబంధంతోనే ఈ సినిమాకు వెంకీ కావల్సినన్ని డేట్లు కేటాయించారు. సంక్రాంతి బరిలో నిలిచిన సినిమా ఇది. నవంబరు చివరినాటికల్లా టాకీ పూర్తి చేయాలన్న ధ్యేయంతో చిత్రబృందం పని చేస్తోంది. అందుకే వెంకీ తన సినిమాని సైతం పక్కన పెట్టి, చిరు సినిమాకి కాల్షీట్లు అందించారు.
‘మన శంకర వర ప్రసాద్’ లో వెంకీది చిన్న పాత్రేం కాదు. చాలా ప్రాధాన్యం ఉన్న క్యారెక్టర్. సెకండాఫ్ లో కథని మలుపు తిప్పే పాత్రలో ఆయన కనిపించబోతున్నారు. వెంకీ క్యారెక్టర్ దాదాపు 45 నిమిషాల వరకూ ఉండబోతోందని టాక్. చిరు – వెంకీలపై ఓ పాట కూడా చిత్రీకరించనున్నారు. చిరు – వెంకీ ఈ సినిమాలో స్నేహితులుగా కనిపించబోతున్నారని, ‘సంక్రాంతికి వస్తున్నాం’ ఫ్లేవర్ లోనే వెంకీ పాత్ర ఉండబోతోందని టాక్. నయనతార ఈ చిత్రంలో కథానాయికగా నటిస్తున్న సంగతి తెలిసిందే. భీమ్స్ సంగీతాన్ని సమకూరుస్తున్నారు. ఇప్పటికే ఓ పాట బయటకు వచ్చింది. రమణ గోగుల పాడిన పాటని త్వరలో విడుదల చేస్తారు.
