ఉద్యోగం నుంచి డిస్మిస్ కావాల్సిన వ్యక్తిని.. ఉద్యోగం కన్నా వైసీపీ నేతగానే ఎక్కువగా రాజకీయం చేసే వ్యక్తిని ఉపేక్షిస్తే నెత్తి మీదకెక్కి డాన్స్ చేస్తాడని నిరూపిస్తున్నాడు వెంకట్రామిరెడ్డి. ప్రస్తుతం ఉద్యోగ సంఘం నాయకుడిగా ఉన్నారో లేదో తెలియదు కానీ ఆయన మాత్రం .. బెదిరింపులు ప్రారంభించారు. ప్రభుత్వం మారితే సగం మంది పోలీసుల్ని జైలుకు పంపిస్తాడట. తాడేపల్లిలో సమావేశం పెట్టి మరీ ఈ హెచ్చరికలు జారీ చేశారు.
గతంలో టీడీపీ ప్రభుత్వం ఉన్నప్పుడు రహస్య డాక్యుమెంట్లు దొంగతనం చేసిన ఘటన సస్పెండ్ అయ్యారు. అదే అర్హతగా వైసీపీలో పలుకుబడి సాధించారు. తర్వాత వైసీపీ అధికారంలోకి వచ్చాక.. ఫక్తు రాజకీయ నాయకుడు అియిపోయారు. ఉద్యోగుల ప్రయోజనాలన్నింటినీ తాకట్టు వ్యక్తిగత ప్రయోజనాలు నెరవేర్చుకున్నారు. స్థానిక సంస్థ ఎన్నికల సమయంలో ఏకంగా ఎస్ఈసీనే ధిక్కరించారు. సాధారణ ఎన్నికల సమయంలో వైసీపీకి ప్రచారం చేసి దొరికిపోయారు.
టీడీపీ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఆయన సస్పెండ్ అయ్యారు. ఆయనను డిస్మిస్ చేయించేంత అభియోగాలు రెడీ అయ్యాయి. కానీ చర్యలు మాత్రం తీసుకోవడంలేదు. ఏడాది అయిపోయింది అయినా చర్యలు తీసుకోకపోవడంతో మళ్లీ ఉద్యోగ సంఘం పేరుతో ఆయన తెరపైకి వచ్చి ప్రభుత్వానికి.. పోలీసులకు హెచ్చరికలు చేస్తున్నారు. ఇలాంటి వారిని సర్వీస్ నుంచి తొలగిస్తే వైసీపీ నేతగా హెచ్చరికలు చేసుకుంటారని.. ఉద్యోగిగా ఎందుకు ఉంచాలన్న ప్రశ్నలు ఎక్కువగా వినిపిస్తున్నాయి. కానీ ప్రభుత్వం ఎందుకు సైలెంటుగా గా ఉంటోంది. వైసీపీ హయాంలో ఓ కానిస్టేబుల్.. తమకు రావాల్సిన బకాయిల గురించి ప్రశ్నిస్తే అప్పటికప్పుడు డిస్మిస్ చేశారు. మరి ఈ వెంకట్రామిరెడ్డికి ఎందుకు మినహాయింపులు ?