వెంకీ + రానా = ‘రానానాయుడు’

ద‌గ్గుబాటి వారి మ‌రో మ‌ల్టీస్టార‌ర్ రెడీ అయ్యింది. ఈసారి వెంక‌టేష్‌, రానా క‌లిసి న‌టించారు. కాక‌పోతే.. వెండి తెర కోసం కాదు. ఓటీటీ కోసం. నెట్ ఫ్లిక్స్ కోసం వెంకీ, రానా ఇద్ద‌రూ జ‌ట్టు క‌ట్టారు. వీరిద్ద‌రూ క‌లిసి ఓ వెబ్ సిరీస్ లో న‌టించారు. దీనికి `రానా నాయుడు` అనే టైటిల్ ఖరారు చేశారు. సుప‌ర్ణ్ ద‌ర్శ‌కుడు. అమెరిక‌న్ క్రైమ్ డ్రామా రాయ్ దొనోవ‌న్ స్ఫూర్తితో ఈ సిరీస్ ని తెర‌కెక్కించారు. ఈ థ్రిల్ల‌ర్‌లో వెంకీ గెట‌ప్ కొత్త‌గా ఉండ‌బోతోంది. ఈ వెబ్ సిరీస్‌లో ఎన్ని ఎపిసోడ్లు ఉన్నాయి? ఎప్పుడు టెలికాస్ట్ అవుతుంది? అనే విష‌యాల్ని నెట్ ఫ్లిక్స్ త్వ‌ర‌లోనే వెల్ల‌డి చేయ‌బోతోంది. ఈ సీజ‌న్ హిట్ట‌యితే… త‌దుప‌రి సీజ‌న్ల కోసం కూడా స్క్రిప్టు రెడీగా ఉంద‌ట‌. అన్ని ద‌క్షిణాది భాష‌ల్లోనూ ఈ సిరీస్ ని డ‌బ్ చేసి వ‌ద‌ల‌బోతున్నారు. నెట్ ఫ్లిక్స్ లో ద‌క్షిణాది నుంచి చాలా వెబ్ సిరీస్ లు వెళ్లాయి. అయితే.. దేనికీ గొప్ప స్పంద‌న రాలేదు. కంటెంట్‌, టేకింగ్ ప‌రంగా.. అవ‌న్నీ ఫెయిల్ అయ్యాయి. అయితే తెలుగులోని అగ్ర క‌థానాయ‌కుల్లో ఒక‌రిగా చ‌లామ‌ణీ అవుతున్న వెంకీ ఓ వెబ్ సిరీస్ చేయ‌డం, అందులో రానా ఉండ‌డంతో – `రానా నాయుడు`పై ఫోక‌స్ పెరిగే అవ‌కాశం ఉంది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

గంజాయి కట్టడికి కేసీఆర్ స్పెషల్ ఆపరేషన్ !

ఆంధ్రప్రదేశ్‌లో గంజాయి వ్యవహారం రాజకీయ ప్రకంపనలకు కారణం అవుతోంది. ఏపీలోని విశాఖ మన్యం నుంచే గంజాయి దేశం మొత్తం రవాణా అవుతోందని ఐదారు రాష్ట్రాల పోలీసులు వస్తున్నారని స్వయంగా పోలీసు ఉన్నతాధికారులే చెబుతున్నారు....

చేతకాని దద్దమ్మలే తిడతారన్న సజ్జల !

ఏదైనా తమ దాకా వస్తే కానీ దెబ్బ రుచి తెలియదన్నట్లుగా ఉంది వైసీపీ నేతల పరిస్థితి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు ఇంత కాలం ఇష్టం వచ్చినట్లుగా టీడీపీ నేతల్ని అమ్మనా బూతులు...

బ్రేకింగ్ : కోర్టు మెట్లెక్కిన సమంత

సమంత కోర్టుని ఆశ్రయించింది. తన పరువుకి భంగంవాటిల్లిందని పలు యూట్యూబ్‌ ఛానళ్లపై సమంత పరువు నష్టం దావా వేసింది. సుమన్‌ టీవీ, తెలుగు పాపులర్‌ టీవీతోపాటు సీఎల్‌ వెంకట్రావుపై కూకట్‌పల్లి కోర్టులో పిటిషన్‌...

‘ఆర్య’ని మారిస్తే ‘అల్లు’ ఫ్యాన్స్ ఒప్పుకుంటారా ?

'ఆర్య'.. తెలుగు ప్రేక్షకులకు సుకుమార్ పరిచయం చేసిన హీరోయిక్ పాత్ర. ఆర్య సినిమాతోనే అల్లు అర్జున్ తొలి కమర్షియల్ విజయం దక్కింది. ఆర్యతోనే సుకుమార్ అనే దర్శకుడు ఒక బ్రాండ్ క్రియేట్ చేసుకున్నాడు....

HOT NEWS

[X] Close
[X] Close