ఆర్టీసీ, విద్యుత్ చార్జీలు పెంచి ప్రజా వ్యతిరేకతను కేసీఆర్ తట్టుకుంటారా!?

తెలంగాణలో ఆర్టీసీ, విద్యుత్ చార్జీలను పెంచాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించింది. త్వరలోనే ఈ పెంపు అమల్లోకి రానుంది. ఈ అంశంపై ఇప్పటికే స్పష్టత వచ్చింది. ఆర్టీసీ ఉద్యోగులకు జీతాలు సక్రమంగా చెల్లించడం లేదు. పెద్ద ఎత్తున నష్టాలు వస్తున్నాయని చెబుతున్నారు. ఇటీవల ఆర్టీసీ ఎండీగా చేరిన సజ్జనార్ మొదటి టాస్క్ ప్రయాణికులపైనే గురి పెట్టారు. చార్జీలు పెంచాలనే ప్రతిపాదనలను సీఎం దగ్గరకు తీసుకుపోయారు. ఆయన కూడా అంగీకరించారు. ఎంత మేర పెంచాలి అనేది కూడా డిసైడయింది. అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.

ఇక విద్యుత్ చార్జీలను కూడా పెంచాలని డిస్కంలు చాలా కాలంగా పట్టుబడుతున్నాయి. నష్టాలు పేరుకుపోతున్నాయని వారు చెబుతున్నారు. ఎంత మేర పెంచుతారనేదానిపై స్పష్టత లేదు కానీ ఈ సారి భారం ఎక్కువే ఉండే అవకాశాలు ఉన్నాయని ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. ఆర్టీసీకి కానీ … విద్యుత్ సంస్థలకు కానీ ప్రభుత్వ పరంగా ఎలాంటి ఆర్థిక సాయం చేసే పరిస్థితి లేదు. అందుకే ఆ భారాన్ని ప్రజల నుంచే వసూలు చేయాలని భావిస్తున్నట్లుగా తెలుస్తోంది.

అయితే సీఎం కేసీఆర్ ఇప్పుడు ఎన్నికల మూడ్‌లో ఉన్నారు. ప్రజలకు కష్టం వచ్చే ఏ నిర్ణయం తీసుకోవాలన్నా ఆచితూచి అడుగేసే పరిస్థితి ఉంది. పైగా హుజురాబాద్ ఉపఎన్నికలు కళ్లముందు ఉన్నాయి. ఇలాంటి సమయంలో ప్రజలపై భారం వేసే నిర్ణయాలు కేసీఆర్ తీసుకుంటారా అన్నదానిపై సందేహం ఉంది. నిజానికి ఇప్పటికే ప్రభుత్వంపై ప్రజల్లో అసంతృప్తి ఉందన్న ప్రచారం జరుగుతోంది.ఈ సమయంలో నేరుగా సామాన్యుడిపై భారం వేసే నిర్ణయాలు తీసుకుంటే మరింతగా వ్యతిరేకత పెరిగే అవకాశం ఉంటుంది. మరి కేసీఆర్ ఈ నిర్ణయాలు తీసుకుంటారా ? లేక చివరికి ప్రజల కోసం ఎంత కష్టమైన భరిస్తానని ప్రతిపాదనలు తోసి పుచ్చుతారా అన్నది త్వరలో తేలనుంది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

గంజాయి కట్టడికి కేసీఆర్ స్పెషల్ ఆపరేషన్ !

ఆంధ్రప్రదేశ్‌లో గంజాయి వ్యవహారం రాజకీయ ప్రకంపనలకు కారణం అవుతోంది. ఏపీలోని విశాఖ మన్యం నుంచే గంజాయి దేశం మొత్తం రవాణా అవుతోందని ఐదారు రాష్ట్రాల పోలీసులు వస్తున్నారని స్వయంగా పోలీసు ఉన్నతాధికారులే చెబుతున్నారు....

చేతకాని దద్దమ్మలే తిడతారన్న సజ్జల !

ఏదైనా తమ దాకా వస్తే కానీ దెబ్బ రుచి తెలియదన్నట్లుగా ఉంది వైసీపీ నేతల పరిస్థితి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు ఇంత కాలం ఇష్టం వచ్చినట్లుగా టీడీపీ నేతల్ని అమ్మనా బూతులు...

బ్రేకింగ్ : కోర్టు మెట్లెక్కిన సమంత

సమంత కోర్టుని ఆశ్రయించింది. తన పరువుకి భంగంవాటిల్లిందని పలు యూట్యూబ్‌ ఛానళ్లపై సమంత పరువు నష్టం దావా వేసింది. సుమన్‌ టీవీ, తెలుగు పాపులర్‌ టీవీతోపాటు సీఎల్‌ వెంకట్రావుపై కూకట్‌పల్లి కోర్టులో పిటిషన్‌...

‘ఆర్య’ని మారిస్తే ‘అల్లు’ ఫ్యాన్స్ ఒప్పుకుంటారా ?

'ఆర్య'.. తెలుగు ప్రేక్షకులకు సుకుమార్ పరిచయం చేసిన హీరోయిక్ పాత్ర. ఆర్య సినిమాతోనే అల్లు అర్జున్ తొలి కమర్షియల్ విజయం దక్కింది. ఆర్యతోనే సుకుమార్ అనే దర్శకుడు ఒక బ్రాండ్ క్రియేట్ చేసుకున్నాడు....

HOT NEWS

[X] Close
[X] Close