వేణు శ్రీ‌రామ్ కి దారి వ‌దిలిన కొర‌టాల‌

దిల్ రాజు సినిమాల‌కు బ్యాక్ బోన్‌గా ఉన్న వ్య‌క్తి.. వేణు శ్రీ‌రామ్. దిల్ రాజు స్క్రిప్టుల విష‌యంలో స్ట్రాంగ్ గా ఉండ‌డానికి వెనుక‌… వేణు శ్రీ‌రామ్ లాంటి వ్య‌క్తులే.. కార‌ణం. దిల్ రాజు బ్యాన‌ర్‌లో మూడు సినిమాలు చేశాడు వేణు శ్రీ‌రామ్. కానీ తెర వెనుక చాలా సినిమాల‌కు ప‌నిచేశాడు. చాలా క‌థ‌ల్లో త‌న సాయం ఉంది. ఇప్పుడు వ‌కీల్ సాబ్ తో క‌మ‌ర్షియ‌ల్ హిట్ కొట్టి, దిల్ రాజు త‌న‌పై పెట్టుకున్న న‌మ్మకాన్ని మ‌రోసారి నిల‌బెట్టుకున్నాడు.

అయితే.. వేణులో ఓ అసంతృప్తి ఉంది. ఎంతో ఇష్ట‌ప‌డి రాసుకున్న `ఐకాన్‌` క‌థ‌.. ప‌ట్టాలెక్కిన‌ట్టే ఎక్కి ఆగిపోయింది. `వ‌కీల్ సాబ్` హిట్టుతో.. ఆ సినిమాపై ఆశ‌లు రేగాయి. కానీ ఏం లాభం..? అల్లు అర్జున్‌.. డేట్లు కావాలంటే క‌నీసం రెండేళ్ల‌యినా ఆగాలి. ప్ర‌స్తుతం బ‌న్నీ అంత బిజీ. అంత టైట్ షెడ్యూల్‌లో ఉన్నాడు. బ‌న్నీ ఓకే చెప్పిన క‌థ‌లు అన్ని ఉన్నాయి. `పుష్ష‌` త‌ర‌వాత కొర‌టాల శివ సినిమా ప‌ట్టాలెక్కాలి. ఆ త‌ర‌వాత‌.. విక్ర‌మ్ కె.కుమార్, ప్ర‌శాంత్ నీల్ లాంటి వాళ్లు లైన్ లో ఉన్నారు. కాబ‌ట్టి… వేణు శ్రీ‌రామ్ వంతు వ‌చ్చేట‌ప్ప‌టికి చాలా కాలం ప‌డుతుంది. అయితే ఇప్పుడు స‌డ‌న్ గా.. ట్విస్టొచ్చింది. కొర‌టాల శివ – ఎన్టీఆర్ కాంబో ఓకే అయ్యింది. బ‌న్నీ – కొర‌టాల సినిమా 2022కి వాయిదా ప‌డింది. ఈ గ్యాప్.. వేణుశ్రీ‌రామ్ కి నిజంగా వ‌ర‌మే. `పుష్ష‌` త‌ర‌వాత‌.. అనుకున్న షెడ్యూల్ లోనే బ‌న్నీ సినిమా మొద‌ల‌వ్వాలంటే.. `ఐకాన్‌` మంచి ఆప్ష‌న్‌. కాబ‌ట్టి ఓ ర‌కంగా.. కొర‌టాల శివ‌, వేణుకి దారి వ‌దిలిన‌ట్టే. దిల్ రాజు లాంటి మాస్ట‌ర్ మైండ్ ఉంటే.. ఎలాంటి ప్రాజెక్ట్ అయినా చిటికెలో సెట్ అయిపోతుంది. `ఈ సినిమా బన్నీతోనే ఉంటుంది. త్వ‌ర‌లోనే ప్ర‌క‌ట‌న వ‌స్తుంది` అని దిల్ రాజు మాట ఇచ్చేశాడు. సో.. వేణు శ్రీ‌రామ్ క‌ల‌.. ఇప్పుడు తీర‌బోతోందన్న‌మాట‌.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

రమేష్ ఆస్పత్రికి రఘురామ..! హైకోర్టు ఆదేశాలనైనా పాటిస్తారా..?

కోర్టు ఆదేశాలను ఉల్లంఘించి అయినా రమేష్ ఆస్పత్రికి రఘురామకృష్ణరాజును తరలించకూడదనుకున్న సీఐడీ అధికారులు.. ప్రభుత్వానికి షాక్ తగిలింది. సీఐడీ కోర్టు ఆదేశించించినట్లుగానే.. రమేష్ ఆస్పత్రికి రఘురామకృష్ణరాజును తరలించాలని స్పష్టం చేసింది. గుంంటూరు ప్రభుత్వాసుపత్రిలో...

జైలుకు ఆర్ఆర్ఆర్.. కోర్టును లైట్ తీసుకున్న సీఐడీ..!

ఆంధ్రప్రదేశ్ సీఐడీ అధికారులు కోర్టులను లెక్క చేయలేదు. ఎంపీ రఘురామకృష్ణరాజుకు వైద్యం అందించాలని ఇచ్చిన ఆదేశాలను పక్కన పెట్టేసి.. జిల్లా జైలుకు తరలించేశారు. ఆయనకు వైద్యం అందించే విషయంలోనే కాదు.. వైద్య నివేదిక...

టీవీ9 ప్రాథమిక నివేదిక.. ఆర్ఆర్ఆర్‌కి సొరియాసిస్..!

రఘురామకృష్ణరాజు కాళ్లకు ఉన్న దెబ్బల గురించి టెస్టులు చేసి నివేదిక ఇవ్వాలని సీఐడీ కోర్టు.. హైకోర్టులు ఆదేశించాయి. వైద్యులు నివేదికల కోసం.. కోర్టు ఇచ్చిన సమయం దాటి మరీ టెస్టులు చేస్తున్నారు. నివేదికలు...

రేవంత్‌కు పోలీసులే అలా ప్రచారం చేసి పెడతారు..!

హైదరాబాద్‌లో రూ. ఐదు రూపాయల భోజన కేంద్రాలయిన అన్నపూర్ణ క్యాంటీన్లు కొనసాగుతాయని మీడియాకు సమాచారం ఇచ్చిన తెలంగాణ సర్కార్.. నిజానికి ఆపేసింది. దాంతో పేదలు తీవ్ర ఇక్కట్లు పడుతున్నారు. చాలా చోట్ల టీఆర్ఎస్...

HOT NEWS

[X] Close
[X] Close