ఇంద్రసేన రివ్యూ : ఓ తాగుబోతు బయోపిక్

indrasena review, Vijay Antony Indrasena Rating

తెలుగు360.కామ్ రేటింగ్ : 1.75/5

గుడి దగ్గర పూలే అమ్మాలి. బ్రాందీ షాపు దగ్గర చీకులే అమ్మాలి. అలా కాకుడా మనకు నచ్చాయి కదా అని ఇక్కడివి అక్కడ, అక్కడివి ఇక్కడ అమ్మడానికి ప్రయత్నిస్తే, ఫలితం తేడా కొట్టేస్తుంది. జీవితం అంటే సినిమాటిక్ గా వుండదు. సినిమా టిక్ సొగసలు అద్దక పోతే జీవితాలు సినిమా కథలుగా పనికి రావు. నాయకుడి లాంటి మాఫీయా డాన్ కథ అయినా, వీలయినన్ని గ్లామర్ సొగసులు అద్దాల్సిందే. కానీ ఆ విషయం విస్మరించి, తనకు నచ్చినట్లు తను తీసుకుంటూ పోయిన సినిమానే ఇంద్రసేన. విఫలమైన ప్రేమ, ఆపై మందుకు బానిస కావడం, దానికి తోడు ఓ అనుకోని మర్డర్, ఇలా జీవితం ఎలా వెళితే అలా వెళ్లి చివరకు అంతమైపోయిన వాడి కథ ఇది. తమిళంలో అన్నాదురై తెలుగులో ఇంద్రసేనగా వచ్చిన ఈ సినిమాలో విజయ్ ఆంటోనీ రెండుపాత్రలు పోషించాడు.

కథ

ఇంద్రసేన (విజయ్ ఆంటోనీ) సదా మందు మత్తులో మునిగి తేలుతుంటే వ్యక్తి. తను చేసుకోవాలి అనుకున్న అమ్మాయి అకాల మరణం చెందడమే అందుకు కారణం. ఈ తాగుడు కారణంగా ఇంట్లో తల్లి, తండ్రి, అచ్చం తనలాగే వుండే రుద్రసేన(విజయ్ ఆంటోనీ) లకు ఇబ్బందిగా మారతాడు. తాగిన మైకంలో ఇంద్రసేన కారణంగా ఓ వ్యక్తి మరణిస్తాడు. దాంతో అతగాడు జైలుకు వెళ్తాడు. ఆ సంఘటన పర్యవసానంగా రుద్రసేన ఉద్యోగం పోతుంది. పెళ్లి ఆగిపోతుంది. తండ్రి దుకాణం పరాయి పాలైపోతుంది. ఆఖరికి రుద్రసేన కిరాయి రౌడీగా బతకాల్సి వస్తుంది. ఇలాంటి నేపథ్యంలో మళ్లీ జైలునుంచి బయటకు వస్తాడు. అప్పుడేం జరిగింది అన్నది మిగిలిన సినిమా.
విశ్లేషణ

విజయ్ ఆంటోనీది ఓ టిపికల్ ఫేస్. అతగాడు ఆ సంగతి తెలిసే అందుకు సూటయ్యే పాత్రలు ఎంచుకుంటాడు. కానీ ఆ పాత్రలకు తగినట్లు తన హావభావాలు మార్చుకునే ప్రయత్నం చేయడు. ఏ సినిమా అయినా, ఏ పాత్ర అయినా అదే ఫేస్ ఎక్స్ ప్రెషన్లు, అదే డైలాగ్ మాడ్యులేషన్. కొత్తదనం కలికంలోకి కూడా కనిపించదు. పైగా అన్నదమ్ములుగా రెండు పాత్రలు ఒకే సినిమాలో పోషిస్తున్నపుడు కూడా వైవిధ్యం కాస్తయినా కనబర్చాలని అనుకోకపోవడం పెద్ద మైనస్. దీనికి తోడు ఓ తాగుబోతు సుదీర్ఘ బయోపిక్ మాదిరిగా సినిమాను తీయాలని స్క్రిప్ట్ రెడీ చేసుకోవడం అంటే ఏమనుకోవాలి? కథ దాని మానాన అది అలా వెళ్తూ వుంటుంది. దర్శకుడు దాని వెంట ప్రేక్షకులను రమ్మంటాడు. ఎలా వుంటుంది ఆ ప్రయాణం. పరమ నీరసంగా వుంటుంది.

అసలు ప్రథమార్థం అయ్యేసరికే కాస్త నీరసం అనిపిస్తుంది. అలాంటిది ద్వితీయార్థం అయ్యేసరికి ప్రేక్షకుడు పూర్తిగా అలసట చెందక తప్పదు. వీటన్నింటికి తోడు ఆ క్లయిమాక్స్ ఏమిటో? తమ్ముడు కోసం అన్న త్యాగం చేయడం వరకు ఓకె. కానీ తను పోయిన తరువాత తమ్ముడు తన అయిడెంటిటీ లేకుండా ఎలా బతుకుతాడు? లేదా తమ్ముడు తమ్ముడే కానీ, తను కాదు అని తెలిస్తే పరిస్థితులు ఎలా వుంటాయి అన్నది అస్సలు ఆలోచించినట్లు కనిపించలేదు.

ఎంతసేపూ, సినిమా ప్రారంభమైన దగ్గర నుంచి చివరి దాకా ఇంద్రసేన పాత్రకు ఎంత సింపతీ సంపాదించి పెట్టాలా? అన్న తాపత్రయం తప్ప మరోటి ఏదీ సినిమాలో కనిపించలేదు. ఇలాంటి పాత్రలు కాస్త చరిష్మా వున్న హీరోలు చేస్తేనే చూడడం కష్టం. అలాంటిది మరీ తమిళ నాటు స్టయిల్ లో విజయ్ ఆంటోనీ లాంటి వాళ్లు చేస్తే తెలుగు ప్రేక్షకులు ఎలా చూస్తారని అనుకున్నారో?

సినిమాలో కాస్త కళ అయిన మొహాలు లేవు. కాస్త కలర్ ఫుల్ అనిపించే చిత్రీకరణ లేదు. ఇలాంటివి లేకుంటే మన జనాలు థియేటర్ కు రావడం కష్టం. కానీ తమిళ జనాలకు ఇవే నచ్చుతాయి కాబట్టి, అక్కడ చల్తా అనుకోవచ్చు. ఇక్కడ మాత్రం జనాలు ‘ఛల్..ఛల్’ అంటూ పక్కకు పంపేస్తారు.
నటీనటులు

విజయ్ ఆంటోనీ సినిమా మొత్తం కనిపిస్తూ, కథ మొత్తాన్ని తన చుట్టూ తిప్పుకుంటాడు. కానీ ఏ సీన్ చూసినా ఎక్కడా కాస్తయినా కొత్త ఎక్స్ ప్రెషన్ కనిపించదు. మిగిలిన నటులు ఎవ్వరూ మన జనాలకు పరిచయమూ కాదు, పరిచయం చేసుకోవాలనిపించేంత నటన కూడా లేదు.

సాంకేతికత

సినిమాలో నేఫథ్య సంగీతం బాగుంది. సినిమా మూడ్ ను బట్టి చేసారు. పాటలు అక్కడ విని మర్చిపోయేవే. సినిమాటోగ్రఫీ జస్ట్ ఓకె.

తీర్పు

మన నేటివిటీకి, మన ప్రేక్షకుల అభిరుచికి సరిపోని సినిమా. ఇంద్రసేన అనగానే ఓ భారీ సినిమా అనే ఫీల్ కలుగుతుంది. కానీ సినిమా చూస్తే, పక్కా తమిళ ఏంబియన్స్ తో వుంటుంది.

ఫైనల్ టచ్

పేరు గొప్ప

తెలుగు360.కామ్ రేటింగ్ : 1.75/5

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

కేకేను తిట్టి పంపించిన కేసీఆర్

రాజ్యసభ ఎంపీ కేకే, ఆయన కుమార్తె హైదరాబాద్ మేయర్ విజయలక్ష్మి శనివారం కాంగ్రెస్ పార్టీలో చేరాలని నిర్ణయించుకున్నారు. తనను పార్టీలో చేర్చుకుని రెండు సార్లు రాజ్యసభ సీటు ఇచ్చిన కేసీఆర్ కు ఓ...

అవినాష్ రెడ్డికి ఎన్నికల ముందే బెయిల్ రద్దు గండం ?

అవినాష్ రెడ్డి బెయిల్ రద్దు చేయాలని అప్రూవర్ గా మారిన దస్తగిరికి పిటిషన్ వేసే హక్కు ఉందని హైకోర్టు స్పష్టం చేసింది. దీంతో ఆయన వేసిన పిటిషన్‌పై విచారణ జరగనుంది. ఏప్రిల్...

‘ఆడు జీవితం’ రివ్యూ: ఎడారి పాలైన బ్రతుకుల వ్యధ

ఫారిన్ చిత్రాలతో పోల్చుకుంటే భారతీయ చిత్రాలలో సర్వైవల్ థ్రిల్లర్స్ తక్కువే. అయితే ఈ మధ్య కాలంలో మలయాళ పరిశ్రమ ఈ జోనర్ పై ప్రత్యేక దృష్టి పెట్టింది. '2018' చిత్రం ఆస్కార్ నామినేషన్స్...

అనపర్తిలో ఆందోళన… నల్లమిల్లి దారెటు..?

అవును ప్రచారమే నిజమైంది. అనపర్తి సీటు టీడీపీ నుంచి బీజేపీ ఖాతాలోకి వెళ్ళిపోయింది. పొత్తులో భాగంగా బీజేపీ నేత ములగపాటి శివ కృష్ణంరాజుకి కేటాయించారు. దీంతో టీడీపీ టికెట్ ఆశించిన మాజీ...

HOT NEWS

css.php
[X] Close
[X] Close