సినిమాలు మానేద్దామ‌నుకున్నా: విజ‌య్ దేవ‌ర‌కొండ షాకింగ్ కామెంట్స్‌

ఈత‌రం హీరోల్లో.. స్టార్ డ‌మ్ సొంతం చేసుకున్న అతి కొద్దిమందిలో విజ‌య్ దేవ‌ర‌కొండ ఒకడు. చేసింది త‌క్కువ సినిమాలే అయినా – త‌న‌దంటూ ఓ ముద్ర వేసుకున్నాడు. అన‌తి కాలంలోనే అభిమానుల్ని సంపాదించుకోగ‌లిగాడు. అలాంటి విజ‌య్‌దేవ‌రకొండ సినిమాలు మానేద్దామ‌ని నిర్ణ‌యించుకున్నాడ‌ట‌. అదెప్పుడో.. అవ‌కాశాల కోసం తిరిగి తిరిగి – అలిసిపోయిన‌ప్పుడు కాదు. ఈమ‌ధ్యే. అవును… ‘అర్జున్ రెడ్డి’, ‘గీతా గోవిందం’ సినిమాల హిట్‌తో హీట్‌లో ఉన్న‌ప్పుడు సినిమాల‌కు గుడ్ బై చెబుదామ‌నుకున్నాడ‌ట‌. ఎందుకు?? ఏమైంది? అని అడిగితే…

”ఓరోజు మా అమ్మ‌కి ఒంట్లో బాలేదు. కార్లో ఆసుప‌త్రికి తీసుకెళ్తున్నా. అమ్మ ప‌రిస్థితి చూసి భ‌య‌మేసింది. ఎందుకో ఆ క్ష‌ణం ఈ సినిమాల‌న్నీ వ‌దిలేయాలి అనిపించింది. నిర్మాత‌ల‌కు ఫోన్ చేసి ఈ విష‌యం చెప్పేద్దామ‌నుకున్నా. అడ్వాన్సులు కూడా తిరిగి ఇచ్చేయాల‌నిపించింది. కానీ.. ఆ మూమెంట్ లోంచి తొంద‌ర‌గానే బ‌య‌ట‌ప‌డ్డా” అని చెప్పుకొచ్చాడు విజ‌య్‌. ఈమ‌ధ్య వ‌రుస సినిమాల‌తో క్ష‌ణం కూడా తీరిక లేకుండా గ‌డుతుపుతున్నాడు. ఆ సంగ‌తి గుర్తు చేసుకుంటూ..”ఇక ముందు సినిమా త‌ర‌వాత సినిమా అనే ప‌ద్ధ‌తితోనే వెళ్తా. అప్పుడు నాకోసం నేను కాస్త స‌మ‌యం కేటాయించుకునే అవ‌కాశం ద‌క్కుతుంది” అంటున్నాడు. త‌ను క‌థానాయ‌కుడిగా న‌టించిన ‘టాక్సీవాలా’ ఈ శ‌నివారం ప్రేక్ష‌కుల ముందుకు వ‌స్తోంది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

ఫిరాయించిన ఆ ఇద్దరు టీడీపీ ఎమ్మెల్సీలపై అనర్హతా వేటు..!?

మూడు రాజధానులు, సీఆర్డీఏ బిల్లు విషయంలో మండలిలో టీడీపీకి అనుకూలంగా ఓటు వేయకుండా.. వైసీపీ గూటికి చేరిపోయిన ఎమ్మెల్సీలు పోతుల సునీత, శివనాథరెడ్డిలపై అనర్హతా వేటు వేయడానికి టీడీపీ రంగం సిద్ధం చేసుకుంది....

ఏడాది యాత్ర 11 : అంచనాలు ఎక్కువ… ఆచరణ తక్కువ..!

ఇంత ఓవర్ ఎక్స్‌పెక్టేషన్స్ తట్టులేకపోతున్నాను భయ్యా..! .. అంటాడు ఓ సినిమాలో హీరో. నిజంగానే ఆ సినిమాకు హైప్ ఓ రేంజ్‌లో వచ్చింది. ఎంతగా అంటే.. సినిమా ఎంత అద్భుతంగా తీసినా .....

జగన్ సలహాదారులు కి కనీస అవగాహన లేదా ?

ఎస్‌ఈసీగా రమేష్‌కుమార్ తొలగింపు వ్యవహారంలో హైకోర్టు ఇచ్చిన తీర్పు నేపధ్యలో ప్రతిపక్షపార్టీల నేతలు..జగన్మోహన్ రెడ్డి రాజీనామాకు డిమాండ్ చేస్తున్నారు. రాజ్యాంగ విరుద్దంగా ఆర్డినెన్స్ ఇచ్చి... రాజ్యాంగ ఉల్లంఘనకు పాల్పడ్డారని.. పదవిలో ఉండే అర్హత...

దేశం ఆశ్చర్యపోయేలా తెలంగాణ ప్రజలకు తీపి కబురు: కేసీఆర్

తెలంగాణ సీఎం కేసీఆర్.. తెలంగాణ ప్రజలకు త్వరలో ఓ తీపి కబురు చెబుతానని ప్రకటించారు. ఈ మాట ఆయన మామూలుగా చెప్పలేదు. దానికో విశేషణం జోడించారు. అదేమిటంటే.. తాను చెప్పబోయే తీపి కబురు...

HOT NEWS

[X] Close
[X] Close