రెండు తెలుగు రాష్ట్రాలేంటి? నాకు ఒక్కటే!: విజయ్‌ దేవరకొండ

తెలుగు రాష్ట్రాలు రెండు అనే సంగతి తనకు గుర్తులేదంటున్నాడు విజయ్‌ దేవరకొండ. ‘గీత గోవిందం’ విజయం తర్వాత ఈ హీరో నటించిన సినిమా ‘నోటా’. తెలుగు, తమిళ భాషల్లో రూపొందిన ఈ సినిమా అక్టోబర్‌ 5న ప్రేక్షకుల ముందుకొస్తుంది. పబ్లిసిటీలో భాగంగా ఆదివారం రాత్రి విజయవాడలో ఫంక్షన్‌ నిర్వహించారు. అందులో పైన చెప్పినట్టు తెలుగు రాష్ట్రాలు రెండనే సంగతి తనకు గుర్తులేదన్నాడు. ఎవరికైనా గుర్తుంటుందా? అని ప్రశ్నించాడు. ‘‘మొన్న ‘రెండు రాష్ట్రాలకు ఒకే రౌడీ. ఒకే లీడర్‌. ఒకే ముఖ్యమంత్రి’ అని ట్వీట్‌ చేశా. దానికి బదులుగా చాలామంది ‘రెండు రాష్ట్రాలేంటి? తమిళనాడు, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌.. మొత్తం మూడు రాష్ట్రాలు కదా?’ అన్నారు. అప్పుడు ‘అయ్య బాబోయ్‌! మనకు రెండు రాష్ట్రాలున్నాయి కదా!’ అని గుర్తు వచ్చింది’’ అని విజయ్‌ దేవరకొండ వ్యాఖ్యానించాడు. ఈతరం ప్రజలకు రెండు రాష్ట్రాలని గుర్తు వుంటుందేమో గానీ, తన వయసు వారికి ఒక్కటేనని అన్నాడు.

‘ఎవడే సుబ్రమణ్యం’ టైమ్‌లో, మూడేళ్ళ కిత్రం తొలిసారి విజయవాడకు వెళ్ళానని… ఈ మూడేళ్ళల్లో నాలుగు సినిమాలు చేయగా, ఒకటి దొబ్బిందనీ, మూడు హిట్టయ్యాయని విజయ్‌ దేవరకొండ అన్నాడు. ఇంకా మాట్లాడుతూ ‘‘మా ‘ఎవడే సుబ్రమణ్యం’ నిర్మాతలు అశ్వినీదత్‌, సప్నాదత్‌ వాళ్ళది విజయవాడ. ఆ సినిమా టైమ్‌లో ఇక్కడికి వస్తుంటే… సూర్యాపేట దాటాక సప్న అక్క ‘ఇక్కడవరకూ నిన్ను గుర్తుపట్టారు. ఇక్కడి నుంచి గుర్తుపడితే.. నువ్వు స్టార్‌రా! నిన్ను ఎవరూ ఆపలేరు’ అంది. స్వప్నఅక్కా.. చూడు. మీ ఊరిలో నా వాళ్ళు చాలామంది ఉన్నారు’’ అన్నాడు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

రాజారెడ్డి రాజ్యాంగంలో అది హత్యాయత్నమే!

సాక్షి పేపర్ రాతల్ని పోలీసులు యథావిథిగా రిమాండ్ రిపోర్టుగా రాసి.. ఓ బీసీ మైనల్ బాలుడ్ని మరో కోడికత్తి కేసు శీనులా బలి చేయడానికి రెడీ అయిపోయారు. రాయితో దాడి చేశారో లేదో...

క‌విత అరెస్ట్… కేసీఆర్ చెప్పిన స్టోరీ బానే ఉందా?

త‌న కూతురు, ఎమ్మెల్సీ క‌విత అరెస్ట్ పై ఇంత‌వ‌ర‌కు కేసీఆర్ ఎక్క‌డా స్పందించ‌లేదు. ఈడీ కేసులో అరెస్ట్ అయి తీహార్ జైల్లో ఉన్న క‌విత‌ను చూసేందుకూ వెళ్లలేదు. ఫైన‌ల్ గా బీఆర్ఎస్ నేత‌ల...

రానాతోనే ‘లీడ‌ర్ 2’: శేఖ‌ర్ క‌మ్ముల‌

శేఖ‌ర్ క‌మ్ముల సినిమాలో హిట్లూ, సూప‌ర్ హిట్లూ ఉన్నాయి. అయితే సీక్వెల్ చేయ‌ద‌గిన స‌బ్జెక్ట్ మాత్రం 'లీడ‌ర్‌' మాత్ర‌మే. ఈ సినిమాని కొన‌సాగిస్తే బాగుంటుంద‌ని రానా చాలాసార్లు చెప్పాడు. ఇప్పుడు శేఖ‌ర్ క‌మ్ముల...

విజ‌య్ దేవ‌ర‌కొండ.. త్రివిక్ర‌మ్‌.. అలా మిస్స‌య్యారు!

'గుంటూరు కారం' త‌ర‌వాత త్రివిక్ర‌మ్ త‌దుప‌రి సినిమా విష‌యంలో క్లారిటీ రాలేదు. ఆయ‌న అల్లు అర్జున్ కోసం ఎదురు చూస్తున్నారు. బ‌న్నీ ఏమో.. అట్లీ వైపు చూస్తున్నాడు. బ‌న్నీతో సినిమా ఆల‌స్య‌మైతే ఏం...

HOT NEWS

css.php
[X] Close
[X] Close