“ఆపరేషన్ రేవంత్ రెడ్డి” అట్టర్ ఫ్లాపయిందా..?

కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి ఇంటిపై జరిగిన దాడుల్లో ఏమి దొరికాయన్న విషయం అధికారంగా ఆదాయపు పన్ను శాఖ అధికారులు వెల్లడించలేదు. పెద్దమొత్తంలో ఆస్తులు దొరికితే.. ఈ పాటికి.. రేవంత్ రెడ్డిని అరెస్ట్ చేసి.. ఆ ఆస్తులకు సంబంధించిన వివరాలతో.. చాలా పెద్ద .. షో ప్రారంభించేసి ఉండేవారే. కానీ ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు. కానీ మీడియాలో మాత్రం అమెరికా, హాంకాంగ్, మలేషియా, సింగపూర్‌లలో అక్రమాస్తులంటూ హోరెత్తించారు. కానీ అసలు విషయం మాత్రం… రేవంత్ రెడ్డి ఇంట్లో… ఒక్క రూపాయి కూడా… అదనపు సొమ్ము దొరకలేదు. రేవంత్ సమీప బంధువు… కేఎల్ శ్రీధర్ రెడ్డి అనే వ్యక్తి ఇంట్లో రూ. కోటి నలభై లక్షలు మాత్రం స్వాధీనం చేసుకున్నారు. రేవంత్ ఇంట్లో రూ. కోటి డిపాజిట్లకు సంబంధించిన బ్యాంక్ డీటైల్స్‌ మాత్రం తెలుసుకున్నారు. రేవంత్ భార్య గీతకు సంబంధించిన బంగారు ఆభరణాలను.. లాకర్‌ను తెప్పించారు. అయితే.. వాటికి సంబంధించిన బిల్లలులన్నింటినీ చూపించారు.

రేవంత్ రెడ్డికి సంబంధించిన విదేశీ బ్యాంక్ అకౌంట్లంటూ.. కొన్నింటినీ.. ఆయన ముందు పెట్టి ప్రశ్నించినా… వాటితో తనకేమీ సంబంధంలేదని కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కుండబద్దలు కొట్టి చెప్పేశారు. తనకు ఒక్క విదేశీ బ్యాంక్ అకౌంట్ కూడా లేదని.. ఐటీ అధికారులు వివరణ అడిగిన సమయాల్లో తాను ఆయాదేశాలకు వెళ్లను కూడా వెళ్లలేదని.. కావాలంటే.. ఇమ్మిగ్రేషన్ దగ్గర్నుంచి సమాచారం తెప్పించుకోవచ్చని రేవంత్ వారికి నేరుగానే సమాధానం చెప్పారు. ఇంట్లో జరిగిన సోదాల్లో కానీ… కంప్యూటర్ల హార్డ్ డిస్క్‌ల నుంచి కానీ.. విదేశీ ఖాతాలకు సంబంధించిన సమాచారం… ఇసుమంత కూడా దొరకలేదు. దాంతో వారు.. రేవంత్ ఖాతాలన్ని చెప్పబడుతున్న విదేశీ బ్యాంకులకు లేఖలు రాసి సమాచారం తెప్పించుకోవాలని నిర్ణయించారు.

రేవంత్ రెడ్డి ఇంట్లో దొరికిన వాటితో.. కనీసం ఓ చిన్న కేసు కూడా పెట్టలేమని.. ఐటీ అధికారులు నిర్ధారణకు వచ్చారు. ఓటుకు నోటు కేసు విషయాన్ని ఐటీ అధికారులు పదే పదే .. రేవంత్ రెడ్డి వద్ద ప్రస్తావించారు. ఎన్ని సార్లు అడిగినా… అదే కుట్ర కేసు అని మాత్రమే రేవంత్ రెడ్డి చెప్పారు. మూడో తేదీన రేవంత్ రెడ్డిని ఆదాయపు పన్ను శాఖ కార్యాలయంలో హాజరు కావాలని ఆదేశించింది.. కేవలం భార్య పేరు మీద ఉన్న రూ. కోటి వరకూ డిపాజిట్లు.. బంధువు కేఎల్ శ్రీధర్ రెడ్డి ఇంట్లో దొరికిన రూ. కోటి నలభై లక్షల గురించి వివరాలు తెలుసుకోవడానికే. నోటీసుల్లో కూడా.. ఇదే విషయాన్ని పేర్కొన్నారు. నిజానికి వీటికి సంబంధించి.. మూడు రోజుల పాటు.. వివిధ కోణాల్లో ఇంట్లోనే ఐటీ అధికారులు ప్రశ్నించారు కూడా. ఓ రాష్ట్రానికి కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ స్థాయిలో ఉన్న వ్యక్తికి సంబంధించిన ఆస్తులపై మూడు రోజుల పాటు… 14 చోట్ల సోదాలు చేసి.. ఏమీ లేవని చెబితే.. రాజకీయ ఆటలో భాగమయ్యామనే నింద వస్తుందనే ఆలోచనతోనే… ఐటీ అధికారులు ఎలాంటి ప్రకటన చేయలేదని తెలుస్తోంది. వారు మాత్రం ఏం చేయగలరు.. రావాల్సిన చోట నుంచి ఒత్తిడి వస్తే…!

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

ఆ విషయంలో కేసీఆర్‌కే క్లారిటీ ఉంటే ఇన్ని కష్టాలు వచ్చేవి కావేమో ?

కేసీఆర్ ఇప్పుడు తెలంగాణ ప్రజల నమ్మకాన్ని మళ్లీ పొందేందుకు ప్రయత్నిస్తున్నారు. ఈ క్రమంలో బస్సు యాత్ర చేస్తున్నారు. అందులో ఆయన ఒకటే ప్రధానంగా చెబుతున్నారు. అదేమిటంటే దేవుడు తనను తెలంగాణ కోసమే పుట్టించారని...

అవన్నీ వైసీపీ దింపుడు కళ్లెం ప్రయత్నాలే !

ఓటమి తప్పదని తెలిశాకా గెలవడానికి సిల్లీ ఆలోచనలు చేస్తూంటారు రాజకీయ నేతలు. వైసీపీ నేతలకు ఇలాంటివి కొన్ని ఎక్కువే వస్తూంటాయి. వాటిని అమలు చేసేందుకు చేసిన ప్రయత్నాలు కూడా అంతే...

ఆఖరి రాగం పాడేసిన వల్లభనేని వంశీ !

వల్లభనేని వంశీ ఆఖరి రాగం పాడేశారు. ఇవే తనకు చివరి ఎన్నికలని అనేశారు. అయితే అది గన్నవరంలో . మరో చోట పోటీ చేస్తారా లేదా అన్నది చెప్పలేదు కానీ.....

ప్రారంభమైన రెండో దశ పోలింగ్.. పోటీలో ప్రముఖులు వీరే

సార్వత్రిక ఎన్నికల రెండో దశ పోలింగ్ ప్రారంభమైంది. దేశవ్యాప్తంగా శుక్రవారం 13 రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లో ఎన్నికలు జరగుతున్నాయి. 89లోక్ సభ స్థానాలకు పోలింగ్ జరగాల్సి ఉండగా...మధ్యప్రదేశ్ బైతూల్ లో బీఎస్పీ...

HOT NEWS

css.php
[X] Close
[X] Close