రౌడీ మ‌రో రికార్డ్‌!

వ‌రుస విజ‌యాల‌తో, త‌న ఆటిట్యూడ్ తో లెక్క‌లేనంత మంది అభిమానుల్ని సంపాదించుకున్నాడు విజ‌య్ దేవ‌ర‌కొండ‌. సోష‌ల్ మీడియాలో.. త‌న ఫాలోయింగ్ మామూలుగా ఉండ‌దు. దానికి సాక్ష్యంగా నిలిచింది ఇన్‌స్ట్రా గ్రామ్‌.

ఇన్‌స్ట్రాలో ఏకంగా 8 మిలియన్ల ఫాలోవర్స్ ను సంపాదించుకున్నాడు విజ‌య్ దేవ‌ర‌కొండ‌. సౌత్ ఇండియాలోనే ఇన్‌స్ట్రాలో ఇంత ఫాలోయింగ్ ఎవ్వ‌రికీ లేదు. ఆ లెక్క‌న రౌడీ కొత్త రికార్డు స్థాపించిన‌ట్టే. విజయ్ నటించిన తెలుగు సినిమాలు అర్జున్ రెడ్డి,గీత గోవిందం,డియర్ కామ్రేడ్ హిందీలో డబ్ కావడం తో అక్కడ కూడా ఫ్యాన్స్ అయ్యారు. `నోటా` అయితే తెలుగు, త‌మిళ భాష‌ల్లో ఒకేసారి తెర‌కెక్కింది. `డియ‌ర్ కామ్రేడ్ ` స‌మ‌యంలో సౌత్ ఇండియా మొత్తం భారీ ప్ర‌మోష‌న్లు చేశాడు విజ‌య్‌. ఆ ప్ర‌మోష‌న్ల‌లో విజ‌య్‌కి సౌత్ లో ఉన్న పాపులారిటీ అర్థ‌మైంది. ప్ర‌స్తుతం పూరీ జగన్నాథ్ తో విజయ్ చేస్తున్న సినిమా.. పాన్ ఇండియా ప్రాజెక్టే. ఈ సినిమాతో నేరుగా బాలీవుడ్ లోకి అడుగుపెట్ట‌బోతున్నాడు విజ‌య్‌.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

క‌రోనాని జ‌యించిన జ‌క్క‌న్న కుటుంబం

ప్ర‌ముఖ ద‌ర్శ‌కుడు ఎస్‌.ఎస్.రాజ‌మౌళి, అత‌ని కుటుంబ స‌భ్యుల‌కు క‌రోనా సోకిన విష‌యం తెలిసిందే. రెండు వారాల నుంచి రాజ‌మౌళి, కుటుంబ స‌భ్యులు హోం క్వారెంటైన్‌లోనే ఉంటున్నారు. డాక్ట‌ర్ల ప‌ర్య‌వేక్ష‌ణ‌లో చికిత్స తీసుకుంటున్నారు. ఈరోజు...

ప్చ్…ఇళ్ల పట్టాల పంపిణీ మళ్లీ వాయిదా..!

ఆగస్టు పదిహేనో తేదీన 30 లక్షల మందికి ఇళ్ల స్థలాలిస్తామన్న ఏపీ సర్కార్ మళ్లీ వాయిదా బాట పట్టింది. కోర్టుల్లో కేసులున్నాయంటూ... మరోసారి ముహుర్తం మార్చింది. ఈ సారి గాంధీ జయంతికి...

అనధికార కేబినెట్ భేటీని నిర్వహించేసిన కేటీఆర్..!

తెలంగాణ సర్కార్‌లో నెంబర్ టూగా ఉంటూ.. సీఎం రేంజ్ పవర్స్ తో పాటు విధులు కూడా నిర్వహిస్తున్న అనధికారికంగా కేబినెట్ భేటీ కూడా నిర్వహించేశారు. ప్రాక్టీస్ కోసం అన్నట్లుగా జరిగిన ఈ కేబినెట్...
video

స‌డ‌క్ 2 పై.. సుశాంత్ అభిమానుల సెగ‌

సుశాంత్ సింగ్ రాజ్ పుత్ ఆత్మ‌హ‌త్య వెనుక‌.. ప్ర‌త్య‌క్షంగానూ ప‌రోక్షంగానూ మ‌హేష్ భ‌ట్ ప్ర‌మేయం ఉంద‌ని సుశాంత్ అభిమానులు న‌మ్ముతున్నారు. చాలా రోజులుగా సుశాంత్ వ‌ర్గం మ‌హేష్ భ‌ట్ ని టార్గెట్ చేస్తోంది....

HOT NEWS

[X] Close
[X] Close