ఇదేం స్టైల్‌రా బాబూ…

యంగ్ హీరోలంతా స్టైల్‌కీ, ఫ్యాష‌న్‌కి పెద్ద `పీట` వేస్తున్నారు. విజ‌య్ దేవ‌ర‌కొండ అయితే… ఏకంగా `సోఫా`నే వేసేసి… దాని మీద డ‌బుల్ కాట్ పేర్చి, డైనింగ్ టేబుల్ మీద కూర్చుంటున్నాడు. విజ‌య్ డ్ర‌స్సింగ్ స్టైల్ ఎప్పుడూ ట్రెండీగానే ఉంటుంది. దాంతో పాటు విచిత్రంగానూ కనిపిస్తుంది. ఎవ‌రికీ త‌ట్టిని వెరైటీ క‌ల‌ర్ కాంబినేష‌న్లతో విజ‌య్ హ‌ల్ చ‌ల్ చేస్తుంటాడు. ఆడియో, ప్రీ రిలీజ్ ఫంక్ష‌న్ల‌కు విజ‌య్ వేసుకొచ్చే డ్ర‌స్సింగ్ ఎప్పుడూ టాక్ ఆఫ్ ది టౌన్‌గానే నిలుస్తుంటుంది.

ఈసారీ అంతే. విశాఖ‌ప‌ట్నంలో జ‌రిగిన `వ‌ర‌ల్డ్ ఫేమ‌స్ ల‌వ‌ర్‌` ప్ర‌మోష‌న‌ల్ ఈవెంట్‌కి మ‌రోసారి వెరైటీ డ్ర‌స్ వేసుకొచ్చాడు విజ‌య్‌. త‌ల‌పాగా, లుంగీతో ఝ‌లక్ ఇచ్చాడు. త‌ల‌పాగా, లుంగీ క‌ట్టుకోవ‌డం మ‌న హీరోల‌కు కొత్త కాదు. కానీ.. ఈసారి విజ‌య్ క‌ట్టు.. మ‌రింత వెరైటీగా క‌నిపించింది. క‌ల‌ర్ కాంబినేష‌న్ ఆర్డ్‌గా ఉంది. పైగా ఓ ప‌బ్లిక్ ఈవెంట్ కి ఎప్పుడూ హీరోలు ఈ స్థాయిలో ముస్తాబై రాలేదు. విజ‌య్ డ్ర‌స్సింగ్ చూసి అంతా ఆశ్చ‌ర్య‌పోయారు. ఇదేదో వెరైటీగా ఉంద‌ని కొంత‌మంది అంటుంటే… ఇదేం స్టైల్ రా బాబూ.. అని ఇంకొంత‌మంది ముక్కున వేలేసుకుంటున్నారు. ఇక ట్రోల్స్ హ‌డావుడి కూడా మొద‌లైపోయింది. ఇంకొన్ని రోజుల పాటు ఈ డ్ర‌స్సింగ్‌మీదే ట్రోల్స్ న‌డుస్తాయ‌న‌డంలో ఎలాంటి సందేహం లేదు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com