బాల‌రాజు.. శ‌వాల స్పెష‌లిస్టు

ఆర్‌.ఎక్స్ 100తో ఒక్క‌సారిగా రేసులోకి వ‌చ్చాడు కార్తికేయ‌. ఆ త‌ర‌వాత ఊపిరిస‌ల‌ప‌న‌న్ని ఛాన్సులొచ్చాయి. అయితే ఒక్క‌టీ హిట్ అవ్వ‌లేదు. వ‌రుస‌గా ఫ్లాపుల మీద ఫ్లాపులువ‌చ్చాయి. అయినా స‌రే.. అవ‌కాశాల‌కు కొద‌వ లేకుండా పోయింది. ఇప్పుడు గీతా ఆర్ట్స్ 2 సంస్థ‌లో ఓ సినిమా చేస్తున్నాడు. కౌశిక్ ద‌ర్శ‌కుడు. ఈ సినిమాకి `చావు క‌బురు చ‌ల్ల‌గా` అనే టైటిల్ పెట్టారు. ఇందులో హీరో… బ‌స్తీ బాల‌రాజు పాత్ర‌లో క‌నిపించ‌నున్నాడు. త‌నేమో శ‌వాల్ని స్మ‌శానానికి తీసుకెళ్లే వాహ‌నానికి డ్రైవ‌రు. ఈ వాహ‌నం చుట్టే క‌థ న‌డుస్తుంది. కార్తికేయ గెట‌ప్పు, సెట‌ప్పు కూడా కొత్త‌గానే అనిపిస్తోంది. ఊర మాస్ సినిమా ఇది. కాక‌పోతే.. కాన్సెప్ట్ ఈత‌రానికి త‌గ్గ‌ట్టుగా ఉంటుంద‌ని తెలుస్తోంది. ఈరోజే హైద‌రాబాద్‌లా ఈ చిత్రం షూటింగ్ ప్రారంభించుకుంది. కార్తికేయ స‌ర‌స‌న లావ‌ణ్య త్రిపాఠిని క‌థానాయిక‌గా ఎంచుకున్నారు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com