75శాతం కోటా చిచ్చు..! కర్ణాటకలో తెలుగువారిపై దాడులు..!

ఆంధ్రప్రదేశ్‌లో 75శాతం ఉద్యోగాలు స్థానికులకేనంటూ.. ఏపీ సర్కార్ చేసిన చట్టం.. కర్ణాటకలో సెగలు రేపుతోంది. కర్ణాటకలనూ అలాంటి నిర్ణయాలే అమలు చేయాలంటూ..కన్నడ సంఘాలన్నీ బంద్‌కు పిలుపునిచ్చాయి. ఈ బంద్ పలు చోట్ల ఉద్రిక్తంగా మారింది. ముఖ్యంగా.. ఆంధ్రాకు చెందిన బస్సులు.. ఇతర వాహనాలు కనిపించిన చోట.. కన్నడ ఉద్యమకారులు రాళ్లు రువ్వారు. మంగళూరు సమీపంలో ఆంధ్రప్రదేశ్ టూరిజం కార్పొరే్షన్ కు చెందిన బస్సుపై దుండగులు రాళ్లు రువ్వారు. ఇందులో.. ఏపీ నుంచి విహారయాత్రకు వెళ్లిన పర్యాటకులు ఉన్నారు. ఈ ఘటనతో వారంతా భయాందోళనలకు గురయ్యారు. కర్ణాటక నుంచి తిరుపతికి వస్తున్న మరో బస్సుపైనా… ఈ తరహా దాడులు జరిగినట్లుగా తెలుస్తోంది.

దాదాపు వందకుపైగా ఉన్న కన్నడ సంఘాలు, విద్యార్థి సంఘాలు ఈ బంద్‌కు పిలుపునిచ్చాయి. కర్ణాటకలో… 75 శాతం ఉద్యోగాలు స్థానికులకే ఇస్తూ తక్షణం చట్టం చేయాలని వారి డిమాండ్. ఏపీలో ఈ తరహా చట్టం చేసిన తర్వాత కర్ణాటకలోనూ.. చర్చనీయాంశం అయింది. పొరుగు రాష్ట్రం వాళ్ల వాళ్లకే ఉద్యోగాలని చట్టం చేస్తే.. కర్ణాటకలో మాత్రం.. ఇతర రాష్ట్రాల వారికి ఉద్యోగాలు ఎందుకు ఇవ్వాలని ప్రశ్నిస్తున్నారు. ప్రస్తుతం ప్రైవేటు రంగంలో.. లోకల్స్‌కే ఉద్యోగాలివ్వాలన్న నిబంధన లేదు. జగన్మోహన్ రెడ్డి చట్టం చేసిన తర్వాత ఏపీలోనూ.. అది ఎన్నికల అస్త్రం అయింది. బీజేపీ, కాంగ్రెస్ నేతలు.. ఈ చట్టం తీసుకొస్తామని స్థానికులకే ఉద్యోగాలిస్తామని ఎన్నికల హామీలు ఇచ్చారు.

కన్నడ సంఘాల ఆక్రోశం.. ప్రధానంగా తెలుగువారిపైనే కనిపిస్తోంది. ఆంధ్రకు చెందిన బస్సులు, వాహనాలు కనిపిస్తే దాడులు చేయడమే దీనికి నిదర్శనం. కర్ణాటక సరిహద్దున ఉన్న ఏపీ జిల్లాలల్లో ముఖ్యంగా అనంతపురం జిల్లాలో పెద్ద ఎత్తున కర్ణాటక యువత ఉపాధి కోసం వస్తున్నారు. కియా పరిశ్రమతో పాటు.. వివిధ రకాల పరిశ్రమలు రావడంతో.. వారి వలస ఎక్కువగా ఉంది. తమకు అవకాశాలు లేకుండా చేస్తున్నారని.. తమ దగ్గర మాత్రం వారికి అవకాశాలు ఎందుకివ్వాలన్న భావన పెరుగుతోదంది. ఆ ఫలితమే.. ఆంధ్రులపై.. దాడులని అంటున్నారు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

రాజారెడ్డి రాజ్యాంగంలో అది హత్యాయత్నమే!

సాక్షి పేపర్ రాతల్ని పోలీసులు యథావిథిగా రిమాండ్ రిపోర్టుగా రాసి.. ఓ బీసీ మైనల్ బాలుడ్ని మరో కోడికత్తి కేసు శీనులా బలి చేయడానికి రెడీ అయిపోయారు. రాయితో దాడి చేశారో లేదో...

క‌విత అరెస్ట్… కేసీఆర్ చెప్పిన స్టోరీ బానే ఉందా?

త‌న కూతురు, ఎమ్మెల్సీ క‌విత అరెస్ట్ పై ఇంత‌వ‌ర‌కు కేసీఆర్ ఎక్క‌డా స్పందించ‌లేదు. ఈడీ కేసులో అరెస్ట్ అయి తీహార్ జైల్లో ఉన్న క‌విత‌ను చూసేందుకూ వెళ్లలేదు. ఫైన‌ల్ గా బీఆర్ఎస్ నేత‌ల...

రానాతోనే ‘లీడ‌ర్ 2’: శేఖ‌ర్ క‌మ్ముల‌

శేఖ‌ర్ క‌మ్ముల సినిమాలో హిట్లూ, సూప‌ర్ హిట్లూ ఉన్నాయి. అయితే సీక్వెల్ చేయ‌ద‌గిన స‌బ్జెక్ట్ మాత్రం 'లీడ‌ర్‌' మాత్ర‌మే. ఈ సినిమాని కొన‌సాగిస్తే బాగుంటుంద‌ని రానా చాలాసార్లు చెప్పాడు. ఇప్పుడు శేఖ‌ర్ క‌మ్ముల...

విజ‌య్ దేవ‌ర‌కొండ.. త్రివిక్ర‌మ్‌.. అలా మిస్స‌య్యారు!

'గుంటూరు కారం' త‌ర‌వాత త్రివిక్ర‌మ్ త‌దుప‌రి సినిమా విష‌యంలో క్లారిటీ రాలేదు. ఆయ‌న అల్లు అర్జున్ కోసం ఎదురు చూస్తున్నారు. బ‌న్నీ ఏమో.. అట్లీ వైపు చూస్తున్నాడు. బ‌న్నీతో సినిమా ఆల‌స్య‌మైతే ఏం...

HOT NEWS

css.php
[X] Close
[X] Close