తేజ దగ్గర సహాయ దర్శకుడిగా విజయ్ దేవరకొండ

లైఫ్ ఈజ్ బ్యూటీఫుల్ లో చిన్న పాత్రతో పరిచయమై రౌడీగా ప్రేక్షకుల మనసులో చోటు సంపాయించుకున్నాడు విజయ్ దేవరకొండ. ఇపుడు పూరి జగన్నాధ్ లైగర్ సినిమాతో పాన్ ఇండియా సినిమా చేశాడు. ఐతే ఈ సినిమా విడుదల కాకముందే విజయ్ కి పాన్ ఇండియా ఫాలోయింది వచ్చింది. నిజంగా విజయ్ ఊహించని ఇమేజ్ ఇది. ప్రస్తుతం లైగర్ ప్రమోషన్స్ జోరుగా చేస్తున్న విజయ్.. తన గురించి మరో ఆసక్తికరమైన సంగతి చెప్పాడు. విజయ్, తేజ దగ్గర సహాయ దర్శకుడిగా చేశాడట.

” నటుడిగా ఇంకా కెరీర్ ప్రారంభించక ముందు ఇండస్ట్రీలో పరిచయాలు పెరగడం కోసం తేజ గారి దగ్గర సహాయ దర్శకుడిగా చేసేవాడిని. పూరి గారు అయితే సహాయ దర్శకులకు మంచి సాలరీలు ఇస్తారని నాన్న ఒకసారి చెప్పారు. కానీ పూరి గారిని కలవడం కుదరలేదు. డియర్ కామ్రేడ్ తర్వాత కలిశాను. ఆయన చెప్పిన కథ విన్నాను. అదే లైగర్” అని చెప్పుకొచ్చాడు విజయ్. ఈనెల 25న లైగర్ ప్రేక్షకుల ముందుకు వస్తోంది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

రివ్యూ: ది ఘోస్ట్‌

GodFather Movie Telugu Review తెలుగు360 రేటింగ్: 2.25/5 నాగార్జున కెరీర్‌లో 'శివ‌' ఓ మైలురాయి. తెలుగులోనే కాదు.. భార‌తీయ సినీ ప‌రిశ్ర‌మ‌లన్నీ కూడా దాన్నొక ట్రెండ్ సెట్ట‌ర్‌గా ప‌రిగ‌ణిస్తుంటాయి. అలాంటి సినిమాతో పోలుస్తూ `ది...

అవార్డుల్ని చూసి మురిసిపోతున్న కేటీఆర్ – టీడీపీ కూడా అంతే !

సేమ్ టు సేమ్ అని ఏపీలో గత టీడీపీ ప్రభుత్వం.. ప్రస్తుత టీఆర్ఎస్ ప్రభుత్వాలను చూస్తే చాలా సార్లు అనిపిస్తూ ఉంటుంది. రాజకీయంగా బీజేపీతో పోరాటం విషయంలో... కేసీఆర్ సుకుంటున్న నిర్ణయాల...

మునుగోడులో పోటీ చేసేది టీఆర్ఎస్సా ? బీఆర్ఎస్సా ?

తెలంగాణ రాష్ట్ర సమితి భారత రాష్ట్ర సమితిగా మారిపోయింది. టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఇక నుంచి భారత రాష్ట్ర సమితి అధినేతగా వ్యవహరించనున్నారు. ఇప్పుడు బీఆర్ఎస్ మొదటి లక్ష్యం మునుగోడు ఉపఎన్నిక. రెండు...

చరిత్రలో కలిసిన టీఆర్ఎస్.. ఇక నుంచి భారత్ రాష్ట్ర సమితి !

తెలంగాణ రాష్ట్ర సమితి అంతర్థానం అయింది. తమ పార్టీని భార‌త్ రాష్ట్ర స‌మితిగా సీఎం కేసీఆర్ ప్ర‌క‌టించారు. జాతీయ పార్టీగా మారుస్తూ ఏక‌గ్రీవ తీర్మానం చేశారు. తెలంగాణ రాష్ట్ర సమితి (టీఆర్ఎస్)...

HOT NEWS

css.php
[X] Close
[X] Close