మాల్యా అప్పులు తీర్చేందుకు అందుకే అంగీకరించేరేమో?

కింగ్ ఫిషర్ అధినేత విజయ్ మాల్యా బ్యాంకులకు చెల్లించాల్సిన రూ.9,000 కోట్ల బాకీలో రూ.4,000 కోట్లు చెల్లించేందుకు అంగీకరించారు. ఈ విషయాన్ని కింగ్ ఫిషర్ మరియు ఆయన తరపున వాదిస్తున్న సీనియర్ న్యాయవాది వైద్యనాథన్ సుప్రీం కోర్టు ద్విసభ్య ధర్మాసనానికి ఈరోజు తెలిపారు. గత వారం రోజులుగా బ్యాంకర్ల తరపు న్యాయవాదులు విజయ్ మాల్యాతో వీడియో కాన్ఫరెన్సింగ్ ద్వారా చర్చలు జరిపిన తరువాత ఆయన ఒక మెట్టు దిగి బాకీలో రూ.4,000 కోట్లు ఈ ఏడాది సెప్టెంబర్ నెలాఖరులోగా రెండు వాయిదాలలో చెల్లించేందుకు అంగీకరించారు. జస్టిస్ కురియన్ జోసఫ్ మరియు జస్టిస్ రోహిన్ తన్ నారిమన్ లతో కూడిన సుప్రీం కోర్టు ద్విసభ్య ధర్మాసనం ఈ కేసుపై నేడు విచారణ జరిపింది. విజయ్ మాల్యా చేస్తున్న ప్రతిపాదన సమ్మతో కాదో వారం రోజులలోగా తెలపాలని జస్టిస్ నారిమన్ బ్యాంకర్లను కోరారు. “విజయ్ మాల్యా భారత్ తిరిగి వచ్చేరా లేదా? రాకపోతే ఇంకా ఎప్పుడు తిరిగి వస్తారు? అని జస్టిస్ కురియన్ ప్రశ్నించినప్పుడు, తన క్లైంట్ మాల్యాకి వ్యతిరేకంగా భారత్ మీడియా చాలా విషం కక్కిందని ఆకారణంగా దేశంలో ఆయనకు తీవ్ర వ్యతిరేక వాతావరణం నెలకొని ఉందని, ఒకవేళ ఇప్పుడు భారత్ వచ్చినట్లయితే ఆయనపై దాడులు జరిగే ప్రమాదం ఉందని కనుక ఇప్పుడప్పుడే ఆయన తిరిగి వచ్చే అవకాశం లేదని మాల్యా లాయర్ వైద్యనాధ్ స్పష్టం చేసారు.

విజయ్ మాల్యాకి ఇచ్చిన రూ. 9000 కోట్లపై ఆశలు వదిలేసుకొన్న బ్యాంకర్లకు మాల్యా చేస్తున్న ఈ ప్రతిపాదనను తిరస్కరించబోరని చెప్పవచ్చును. ముందు సగం మొత్తమయినా వసూలు చేసుకొంటే మిగిలిన సగం ఆయన ఇవ్వకపోయినా, ఆయన ఆస్తులను వేలం వేసుకొనయినా తిరిగి వసూలు చేసుకొనే అవకాశం ఉంటుంది. కనుక మాల్యా ప్రతిపాదనకు బ్యాంకర్లు సంతోషంతో ఎగిరి గెంతేయవచ్చును. ఇన్ని రోజులు తన వద్ద అప్పులు తీర్చేందుకు డబ్బు లేదని చెపుతూ తప్పించుకొని తిరుగుతున్న విజయ్ మాల్యా ఇప్పుడు హటాత్తుగా రూ. 4,000 కోట్లు చెల్లించడానికి సిద్దపడుతున్నారంటే దానర్ధం ఆయన వద్ద డబ్బు ఉంచుకొనే ఉద్దేశ్యపూర్వకంగానే బ్యాంకుల దగ్గర తీసుకొన్న బాకీలను ఎగ్గొట్టాలని ప్రయత్నిస్తున్నట్లు అర్ధమవుతోంది. అంటే అతను ఒక ఆర్ధిక నేరస్తుడని శివసేన చెప్పిన మాట వాస్తవమని భావించవచ్చును. “బ్యాంకులకు చెల్లించాల్సిన బాకీలను మర్యాదగా చెల్లించి, గౌరవం నిలబెట్టుకొంటారో లేకపోతే చట్టపరంగా చర్యలు ఎదుర్కొంటారో తేల్చుకోమని,” కేంద్ర ఆర్ధిక మంత్రి అరుణ్ జైట్లీ హెచ్చరించారు. ఆ తరువాతనే విజయ్ మాల్యా ఒక మెట్టు దిగివచ్చి డబ్బు చెల్లించడానికి అంగీకరించి ఉంటారు. అయితే ఆయన పూర్తిగా అప్పులు తీర్చినా, ఉద్దేశ్యపూర్వకంగా బ్యాంకులను మోసం చేయడానికి ప్రయత్నించినందుకు చట్టపరంగా అతనిని శిక్షించినప్పుడే అతని వంటి ఆర్ధిక నేరస్తులకి తగిన హెచ్చరిక పంపినట్లవుతుంది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

బీఆర్ఎస్ఎల్పీ విలీనం లేనట్లే – రేవంత్ ఆకర్ష్ ఫెయిల్ !

బీఆర్ఎస్ఎల్పీని విలీనం చేసుకుంటామని ఇరవై ఐదు మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కాంగ్రెస్ లో చేరుతారని చేస్తున్న ప్రచారం అంతా డొల్గా తేలుతోంది. ముందుకు వచ్చిన ఒక్కో ఎమ్మెల్యేకు కండువా కప్పుతున్నారు...

రోజా దాచిన మద్యం డంప్ పట్టించిన సొంత పార్టీ నేతలు

ఏపీలో మద్యం దుకాణాలను గుప్పిట్లో పెట్టుకుని వైసీపీ నేతలు చాలా మందుగానే అన్ని నియోజకవర్గాలకు మద్యాన్ని సరఫరా చేసి పెట్టుకున్నారు. అది అధికారిక మధ్యమా.. పన్ను కట్టని మద్యమా అన్నదానిపై ఇంకా క్లారిటీ...
video

‘మ‌న‌మే’ టీజ‌ర్‌: క్యారెక్ట‌ర్ల మ‌ధ్య క్లాషు!

https://www.youtube.com/watch?v=_4Ff1zVtKkw శర్వానంద్ - శ్రీ‌రామ్ ఆదిత్య కాంబినేష‌న్‌లో 'మ‌న‌మే' రూపుదిద్దుకొంటున్న సంగ‌తి తెలిసిందే. కృతి శెట్టి క‌థానాయిక‌గా న‌టిస్తున్న ఈ చిత్రాన్ని పీపుల్ మీడియా ఫ్యాక్ట‌రీ రూపొందిస్తోంది. శ్రీ‌రామ్ ఆదిత్య త‌న‌యుడు ఈ చిత్రంలో...

‘కాంతార 2’లో మోహ‌న్ లాల్‌?

దేశాన్ని కుదిపేసిన క‌న్న‌డ చిత్రం 'కాంతార‌'. ఏమాత్రం అంచ‌నాలు లేకుండా, ఏమాత్రం ప్ర‌మోష‌న్లు చేయ‌కుండానే పాన్ ఇండియా స్థాయిలో విజ‌య ఢంకా మోగించింది. క‌న్న‌డ చిత్ర‌సీమ స్థాయిని ప్ర‌పంచానికి ప‌రిచ‌యం చేసింది. ఇప్పుడు...

HOT NEWS

css.php
[X] Close
[X] Close