మోదీ కంటే జగన్ పాలన బెటరంటున్న విజయసాయిరెడ్డి !

రాజకీయం కోసం ఎన్ని విమర్శలు చేసినా బీజేపీ నేతలు… ఆ పార్టీ హైకమాండ్ నవ్వుతూ భరిస్తున్నారని అనుకుంటున్నారేమో కానీ వైసీపీ నేతలు రెచ్చిపోతున్నారు. సీఎం జగన్ స్వయంగా వరద బాధితుల దగ్గర్కు వెళ్లి .. మోదీని మీరు తిట్టుకుంటున్నారని ఆయనకే చెబుతానని ప్రకటించేశారు. ఇప్పుడు విజయసాయిరెడ్డి కూడా అదే పని చేస్తున్నారు. ఏపీ అప్పుల కుప్ప అయిందని …మరో శ్రీలంక అవకుండా జాగ్రత్త పడాలని కేంద్రం చెబుతూంటే.. విజయసాయిరెడ్డి మండి పడుతున్నారు.

ఆంధ్రప్రదేశ్ సమర్థ నాయకత్వం చేతుల్లో ఉందని ..కేంద్రం కంటే మెరుగైన ఆర్థిక పరిస్థితి ఉందని ఆయన చెబుతున్నారు. బీజేపీయేతర రాష్ట్రాల విషయంలో కేంద్రం తీరు సరిగా లేదని ఆయన అంటున్నారు. ఒకర కంగా కేంద్రం కంటే ఏపీ పరిస్థితినే ఆర్థికంగా మెరుగ్గా ఉంది. 2021-22 సంవత్సరంలో కేంద్రం జీడీపీ 57 శాతంగా ఉంది. ఏపీ జీడీపీ ఐదో స్థానంలో ఉంది. ఎగుమతుల్లోనూ ఏపీ ఎంతో అభివృద్ధి సాధించింది. కానీ, కేంద్రం నుంచి రాష్ట్రానికి వచ్చే పన్నుల ఆదాయం తగ్గిందంటున్నారు.

కేంద్రానికి పన్నుల ఆదాయం పెరిగినా రాష్ట్రాలకు మాత్రం సరైన వాటా ఇవ్వడం లేదని విజయసాయిరెడ్డి విమర్శించారు. 41 శాతం పన్నుల వాటా కేంద్రం ఇస్తున్న దాంట్లో ఎలాంటి వాస్తవం లేదన్నారు. సెస్‌, సర్‌ఛార్జీలు కేంద్రం ఏటా పెంచుతోంది. కానీ, ఆ ఆదాయం మాత్రం కేంద్రం పంచడం లేదన్నారు. ఈ విషయంలో ఆత్మపరిశీలన చేసుకోవాలని విజయసాయిరెడ్డి ప్రధానమంత్రికి సూచించారు. రాష్ట్రాల అప్పుల గురించి మాట్లాడుతున్న కేంద్రం.. తన అప్పుల సంగతిపై ఏం చెబుతుందని ప్రశ్నించారు.

గతంలో ఎప్పుడూ ఏపీని కించ పరిచినా.. లేకపోతే.. ఏపీకి నష్టపరిచే వ్యాఖ్యానాలు ఢిల్లీలో వినిపించినా వైసీపీ నేతలు పెద్దగా స్పందించేవారు కాదు. కానీ ఇప్పుడు మాత్రం విజయసాయిరెడ్డి పార్టీ ఎంపీలంద్రనీ వెంట బెట్టుకుని కూర్చుని విమర్శలుచేశారు. ఏ వ్యూహమో కానీ.. ఇది రివర్స్ అయితే కష్టమేనని వైసీపీ వర్గాలు చెబుతున్నాయి.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

అయితే “ఆదిపురుష్” బీజేపీ ప్రచార చిత్రం కాదన్న మాట !

ఆదిపురుష్ అనే సినిమాలో నటించడానికి ప్రభాస్ అంగీకరించినప్పటి నుండి చాలా మందికి ఆ సినిమాపై డౌట్స్ ఉన్నాయి. ఇటీవల కేటీఆర్ అది బీజేపీ ప్రచార చిత్రమని.. వచ్చే ఎన్నికలకు ముందు అయోధ్య...

మునుగోడుకు 86 మంది ఎమ్మెల్యేల్ని పంపుతున్న కేసీఆర్ !

మునుగోడులో టీఆర్ఎస్ తరపున ప్రచారం చేయడానికి తమ పార్టీకి ఉన్న 86 మంది ఎమ్మెల్యేల్ని పంపుతున్నారు. నియోజకవర్గాన్ని 86 యూనిట్లుగా విభజించారు. ఒక్కో యూనిట్కి ఒక్కో ఎమ్మెల్యే ఇంచార్జ్గా ఉంటారని టీఆర్ఎస్...

డిజిట‌ల్‌లో ‘శివ‌’

ఈమ‌ధ్య రీ రిలీజ్‌ల హంగామా ఎక్కువ‌గా క‌నిపిస్తోంది. పోకిరి, జ‌ల్సా, చెన్న‌కేశ‌రెడ్డి సినిమాలు రీ రిలీజ్ అయి భారీ వ‌సూళ్లు మూట‌గ‌ట్టుకొన్నాయి. త్వ‌ర‌లోనే ప్ర‌భాస్ - బిల్లా కూడా రీ రీలీజ్ అవ్వ‌బోతోంది....

రీమేకుల‌పై మెగాస్టార్ మాట‌

చిరంజీవిపై ఓ విమ‌ర్శ బ‌లంగా వినిపిస్తుంటుంది. ఆయ‌న ఎక్కువ‌గా రీమేకుల‌పై ఆధార‌ప‌డ‌తాడ‌ని. రీ ఎంట్రీ గా వ‌చ్చిన ఖైదీ నెం.150 రీమేకే. రేపు విడుద‌ల‌య్యే గాడ్ ఫాద‌ర్ కూడా రీమేకే. ఇప్పుడు చేతిలో...

HOT NEWS

css.php
[X] Close
[X] Close