చంద్ర‌బాబు మీద ఫిర్యాదు చేసిన విజ‌యసాయి రెడ్డి!

ఎన్నిక‌ల సంఘానికి అత్య‌ధిక ఫిర్యాదులు అందించిన నాయ‌కుడిగా ఒక రికార్డు స్థాపించాల‌న్న కృతనిశ్చ‌యంతో ఉన్న‌ట్టున్నారు వైకాపా రాజ్య‌స‌భ స‌భ్యుడు విజ‌య‌సాయి రెడ్డి! ఎన్నిక‌ల నోటిఫికేష‌న్ వ‌చ్చింది మొద‌లు, ఇప్ప‌టివ‌ర‌కూ ఆయ‌న ఫిర్యాదులు ఇస్తూనే ఉన్నారు. సీఎం చంద్ర‌బాబు నాయుడుపై రాష్ట్ర ఎన్నిక‌ల ప్ర‌ధాన అధికారి గోపాల‌కృష్ణ ద్వివేదీకి విజ‌యసాయి తాజాగా ఒక ఫిర్యాదు చేశారు. రాష్ట్రంలో ఎన్నిక‌ల కోడ్ అమ‌ల్లో ఉంద‌నీ, దాన్ని ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు నాయుడు ఉల్లంఘించార‌నీ, వెంట‌నే చ‌ర్య‌లు తీసుకోవాలంటూ ఆ ఫిర్యాదులో కోరారు.

ప్ర‌భుత్వ స‌దుపాయాల‌తో ఎమ్మెల్యేల‌తో క‌లిసి ప్ర‌జావేదిక‌లో స‌మావేశాలు సీఎం నిర్వ‌హిస్తున్నార‌ని విజ‌యసాయి ఫిర్యాదులో పేర్కొన్నారు. పార్టీ అవ‌స‌రాల కోసం ప్ర‌జా వేదిక‌ను సీఎంతోపాటు మంత్రులు కూడా వాడుకుంటున్నార‌న్నారు. ఎన్నిక‌ల కోడ్ అమ‌ల్లో ఉన్న‌ప్పుడు, ఒక పార్టీకి చెందిన‌వారే ప్ర‌భుత్వ ఆస్తులైన వీడియో కాన్ఫ‌ర‌రెన్స్ హాళ్లు, స‌దుపాయాల‌ను వాడుకోవ‌డం స‌రికాద‌ని ఆయ‌న ఫిర్యాదులో పేర్కొన్నారు. అంతేకాదు, ప్ర‌భుత్వ గెస్ట్ హౌస్ లు, మీటింగ్ హాళ్లు, వీడియో కాన్ఫ‌రెన్స్ సౌక‌ర్యం… ఇలాంటివ‌న్నీ అన్ని పార్టీల‌కూ స‌మానంగా వాడుకునే అవ‌కాశం క‌ల్పించాల‌ని విజ‌యసాయి కోర‌డం విశేషం! ప్ర‌స్తుతం చంద్ర‌బాబు నాయుడు నిర్వ‌హిస్తున్న కార్య‌క్ర‌మాల‌న్నీ ఎన్నిక‌ల సంఘం నుంచి ముంద‌స్తు అనుమ‌తులు తీసుకుని చేస్తున్న‌వా కాదా అనేది కూడా త‌మ‌కు తెలియ‌జేయాల‌ని విజ‌యసాయి రెడ్డి ఎన్నిక‌ల ప్ర‌ధాన అధికారిని కోర‌డం జ‌రిగింది! ఇక‌, వారు స్పందించ‌డ‌మే త‌రువాయి అనుకోవ‌చ్చు.

ఇప్పుడూ… ఏపీలో ప్ర‌భుత్వాన్ని ర‌ద్దు చేసి, ముఖ్య‌మంత్రి త‌న ప‌ద‌వికి రాజీనామా చేసి, ఆ లేఖ‌ను గ‌వ‌ర్న‌ర్ కి అందించి, ఎన్నిక‌ల‌కు వెళ్ల‌లేదు క‌దా? అలాంట‌ప్పుడు, ఎన్నిక‌లు పూర్త‌యినా కూడా, ఫ‌లితాలు విడుద‌లైన త‌రువాత కొత్త ప్ర‌భుత్వం కొలువుదీరే వ‌ర‌కూ కూడా ముఖ్య‌మంత్రి కొన‌సాగుతారు క‌దా! ప్ర‌భుత్వం ఉంటుంది క‌దా. ఇంకోటి… సాంకేతికంగా చూసుకున్నా, గ‌త అసెంబ్లీ కాల‌ప‌రిమితి మ‌రికొన్నాళ్లు ఉండ‌గానే ఎన్నిక‌లు జ‌రిగాయి. ఎన్నిక‌లకీ ఫ‌లితాల‌కూ మ‌ధ్య‌ న‌ల‌భై రోజుల‌కుపైగా గ్యాప్ ఉంది. ఈలోగా ప్ర‌భుత్వం ఉంటుంది క‌దా! ఎన్నిక‌లు కోడ్ ఉన్నా కూడా… వాటిని ప్ర‌భావితం చేసే విధ‌మైన నిర్ణ‌యాలు మాత్ర‌మే ప్ర‌భుత్వాలు తీసుకోకూడ‌దు. అంతేగానీ, స‌మావేశ మందిరాల‌ను వాడ‌కూడ‌దు, కుర్చీల్లో కూర్చోకూడ‌దు ఇలాంటివి ఉంటాయా..? విజ‌య‌సాయి ఫిర్యాదుపై ద్వివేదీ నుంచి ఎలాంటి స‌మాధానం వ‌స్తుందో చూద్దాం!

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

అమెరికాలో విస్తరిస్తున్న  “రేసిజం వైరస్..!”

కరోనా దెబ్బకు అమెరికా వణికిపోతూంటే.. తాజాగా... పోలీసుల ఆకృత్యం వల్ల ఆఫ్రికన్ అమెరికన్ మరణించడం.. మరింతగా ఇబ్బంది పెడుతోంది. నల్ల జాతీయుడిని పోలీసుల అకారణంగా చంపడంపై నిరసనలు హింసకు దారి తీసేలా జరుగుతున్నాయి....

మీడియా వాచ్ :  సాక్షికి ఫుల్ పేజీ యాడ్స్ కిక్..!

వైరస్ దెబ్బకు ఆదాయం లేక మనుగడ సమస్య ఎదుర్కొంటున్న న్యూస్ పేపర్ ఇండస్ట్రీలో సాక్షి సంచలనాలు సృష్టించడం ఖాయంగా కనిపిస్తోంది. ఆ పత్రికకు దేశంలో ఇతర ఏ పత్రికకు లేనంత ఆదాయం కనిపించనుంది....

హైకోర్టు తీర్పుకే వక్రభాష్యం..! ప్రభుత్వం తప్పు మీద తప్పు చేస్తోందా..?

నిమ్మగడ్డ రమేష్‌కుమార్ విషయంలో ప్రభుత్వం తప్పు మీద తప్పు చేస్తోందా.. అన్న అభిప్రాయం న్యాయనిపుణుల్లో వినిపిస్తోంది. ఇప్పటి వరకూ వివిధ కేసుల్లో హైకోర్టు తీర్పును అమలు చేయకుండా.. దొడ్డిదారి ప్రయత్నాలు చేశారు... కానీ...

ప్రభుత్వం సుప్రీంకోర్టుకు వెళ్లే వరకూ రమేష్‌కుమార్ బాధ్యతలు తీసుకోకూడదట..!

స్టేట్ ఎలక్షన్ కమిషనర్‌గా నిమ్మగడ్డ రమేష్‌కుమార్ బాధ్యతలు తీసుకున్నట్లుగా ప్రకటించుకుని.. సిబ్బందికి ఆదేశాలు జారీ చేయడం చట్ట విరుద్ధమని తాజాగా ఏపీ ప్రభుత్వం వాదన వినిపించడం ప్రారంభించింది. సోమవారం.. ఎస్‌ఈసీగా రమేష్...

HOT NEWS

[X] Close
[X] Close