ప‌వ‌న్ కోసం విజ‌యేంద్ర ప్రసాద్ క‌థ‌

రాజ‌మౌళి బ‌లం.. బ‌లగం… విజ‌యేంద్ర ప్ర‌సాద్‌. ఆయ‌న క‌థ‌లే.. రాజ‌మౌళి సినిమాలుగా తీస్తూ వ‌చ్చారు. విజ‌యేంద్ర ప్ర‌సాద్ విజ‌న్ ఏమిట‌న్న‌ది బాహుబ‌లి, భ‌జ‌రంగీ భాయ్ జాన్ క‌థ‌లు చూస్తే అర్థం అవుతుంది. క‌థా ర‌చ‌యిత‌గా… ఆయ‌న డిమాండ్ ఎలాంటిదో ప్ర‌త్యేకంగా చెప్పాల్సిన ప‌నిలేదు.

ఇప్పుడాయ‌న ప‌వ‌న్ క‌ల్యాణ్ కోసం ఓ క‌థ రెడీ చేస్తున్నార‌న్న‌ది టాలీవుడ్ టాక్‌. విజ‌యేంద్ర ప్ర‌సాద్ కి ప‌వ‌న్ అంటే చాలా ఇష్టం. ఇది వ‌ర‌కు కొన్ని ఇంట‌ర్వ్యూల‌లో ఆ విష‌యాన్ని ఆయ‌నే స్వ‌యంగా చెప్పారు. బాహుబ‌లి ఇంట్ర‌వెల్ సీన్‌కి.. ప‌వ‌న్ క‌ల్యాణ్‌నే స్ఫూర్తి అని మీడియా ముఖంగా వివ‌రించారు. ఇప్పుడు ప‌వ‌న్ కోసం ఓ క‌థ రాయడం మొద‌లెట్టార్ట‌. రాజ‌మౌళి చేసే సినిమాల‌కు విజ‌యేంద్ర ప్రసాదే క‌థ‌కుడు. కానీ… విజ‌యేంద్ర ప్ర‌సాద్ రాసిన ప్ర‌తీ క‌థ‌కూ రాజ‌మౌళి ద‌ర్శ‌కుడు కాదు. కొన్ని క‌థ‌ల్ని ఆయ‌న బ‌య‌ట‌కు ఇచ్చేశారు కూడా. మ‌రి ఈ క‌థ‌నీ మ‌రో ద‌ర్శ‌కుడికి ఇచ్చేస్తారా? లేదంటే.. రాజ‌మౌళి కూడా అట్టిపెడ‌తారా? అనేది మాత్రం ఇంకా తెలీదు. రాజ‌మౌళి చేసినా చేయ‌క‌పోయినా, విజ‌యేంద్ర ప్ర‌సాద్ క‌థ‌లో ప‌వ‌న్ హీరో అంటే.. ఆ మైలేజే వేరుగా ఉంటుంది. మ‌రి.. ప‌వ‌న్ కోసం పెద్దాయ‌న ఎలాంటి క‌థ రెడీ చేస్తున్నారో చూడాలి.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

శ్రీకాళహస్తి రివ్యూ : బొజ్జల వారసుడికి రెడ్ కార్పెట్ వేసిన సిట్టింగ్ ఎమ్మెల్యే !

శ్రీకాళహస్తి రాజకీయం అంటే అందరికీ గుర్తొచ్చే పేరు బొజ్జల గోపాలకృష్ణారెడ్డి, సుదీర్ఘ కాలం సేవలు అందించిన ఆయన నియోజకవర్గ ప్రజలందరికీ ఆత్మీయుడు. శ్రీకాళహస్తికి ఓ ఇమేజ్ తెచ్చి పెట్టారు. కానీ గత...

ధర్మారెడ్డి కోసం ఆలిండియా రూల్స్ మారిపోతాయ్ !

టీటీడీ ఈవో ధర్మారెడ్డికి మరోసారి డిప్యూటేషన్ పొడిగించారు. రిటైరయ్యే వరకూ అంటే జూన్ 30వ తేదీ వరకూ ఆయన డిప్యూటేషన్ లోనే ఉంటారు. ఇప్పటికే రెండు సార్లు...

పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థుల కోసం బీజేపీ, బీఆర్ఎస్ వెదుకులాట!

బీఆర్ఎస్ ను చుట్టుముడుతున్న సమస్యలు అన్నీ ఇన్నీ కావు. లోక్ సభ ఎన్నికలతో కిందా మీదా పడుతున్న సమయంలోనే మూడు ఉమ్మడి జిల్లాల్లో ప్రభావం చూపేలా మరో ఉపఎన్నిక వచ్చి పడింది....

ఎక్స్‌క్లూజీవ్‌: బెల్లంకొండ‌తో అనుప‌మ‌

అనుప‌మ ప‌ర‌మేశ్వ‌ర‌న్ త‌న జోరు చూపిస్తోంది. టిల్లు స్క్వేర్‌తో హిట్టు కొట్టాక‌, ఆ ఉత్సాహం మ‌రింత‌గా పెరిగిపోయింది. వ‌రుస‌గా కొత్త సినిమాల‌పై సంత‌కాలు పెడుతోంది. తాజాగా బెల్లంకొండ శ్రీ‌నివాస్ తో జోడీ క‌ట్ట‌డానికి...

HOT NEWS

css.php
[X] Close
[X] Close