బీజేపీ వర్సెస్ వైసీపీ..! మంట రాజేసిన విజయసాయి..!

ఆంధ్రప్రదేశ్‌లో రాజకీయాన్ని విజయసాయిరెడ్డి మార్చేశారు. వివాదాస్పద నిర్ణయాలన్నింటినీ… ప్రధాని మోడీ, హోంమంత్రి అమిత్ షాల మీదను నెట్టేసేలా.. ఆయన వ్యాఖ్యలు చేయడంతో… బీజేపీ నేతలు భగ్గుమన్నారు. నిన్నామొన్న.. టీడీపీ నుంచి బీజేపీలో చేరిన సుజనా చౌదరి నుంచి ప్రారంభించి.. ఏపీ బీజేపీ అధ్యక్షుడు కన్నా లక్ష్మినారాయణ వరకూ.. అందరూ.. వైసీపీ పై తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. నిర్ణయాలు తీసుకోవడం చేత కాక.. తప్పులన్నీ.. మోడీపై నెట్టే ప్రయత్నం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

వైసీపీపై విరుచుకుపడుతున్న బీజేపీ నేతలు..!

పీపీఏల సమీక్ష, పోలవరం రివర్స్ టెండర్లు..మాత్రమే కాదు.. తాము తీసుకుంటున్న ప్రతి నిర్ణయం వెనుక.. మోడీ, షాల అనుమతి ఉందన్నట్లుగా… చివరికి అమరావతి మార్పు అంశంలోనూ… కేంద్రానికి అంతా తెలిసే జరిగిందన్నట్లుగా ప్రకటన చేసిన విజయసాయిరెడ్డిపై.. బీజేపీ నేతలు వరుసగా భగ్గుమంటున్నారు. ఏపీకి సంబంధించిన ప్రతి నేతా.. విజయసాయిరెడ్డిపై విమర్శలు గుప్పిస్తున్నారు. వైసీపీకి అలుసిచ్చి లోకువైపోయామనే… ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు. బీజేపీ ప్రధాన కార్యదర్శి వై.సత్యకుమార్, ఏపీ బీజేపీ అధ్యక్షుడు కన్నా లక్ష్మినారాయణ, అధికార ప్రతినిధి కర్నాటి ఆంజనేయరెడ్డి, సుజనా చౌదరి.. ఇలా చాలా మంది.. వైసీపీపై … తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు.

పరిమాణాలకు సిద్ధపడాలని నేరుగా హెచ్చరికలు..!

విజయసాయిరెడ్డి ఢిల్లీలో చేసిన వ్యాఖ్యల పరమార్థం బీజేపీ నేతలకు చాలా సులువుగానే అర్థం అయింది. టీడీపీ ఎన్డీఏ నుంచి బయటకు వెళ్లడంతో… జగన్‌కు పరోక్షంగా ఇచ్చిన మద్దతును ఆసరాగా చేసుకుని… వైసీపీ నేతలు.. మొత్తానికే బీజేపీ నెత్తిపై చేయి పెట్టాలనుకుంటున్నట్లుగా గుర్తించారు. తమ అక్రమాలకు.. మోడీ, షాల ఆమోద ముద్ర ఉందన్న అభిప్రాయం ప్రజల్లోకి వెళ్లేలా చేయాలనుకుంటున్నారని గుర్తించారు. అందుకే… క్షణం ఆలస్యం చేయకుండా.. బీజేపీ నేతలు.. వైసీపీపై రివర్స్ ఎటాక్ ప్రారంభించారు. మోడీ, షాలకు అత్యంత సన్నిహితులు.. వైసీపీపై ఈ విమర్శల వర్షంలో కీలకపాత్ర పోషిస్తున్నారు. బీజేపీ ప్రధాన కార్యదర్శి వై. సత్యకుమార్.. శిశుపాలుడిలా… విజయసాయి.. వంద తప్పులు చేస్తున్నారని.. పరిణామాలను ఎదుర్కోవడానికి సిద్ధపడాలని… నేరుగానే హెచ్చరికలు జారీ చేశారు.

సమర్థించుకోలేని స్థితిలో వైసీపీ..!

బీజేపీ ఒక్కసారి భగ్గుమనడంతో.. వైసీపీలో కలకలం రేగింది. విజయసాయిరెడ్డి వ్యాఖ్యలను ఎలా సమర్థించుకోవాలో… వైసీపీ నేతలకూ అర్థం కావడం లేదు. బీజేపీ నేతలు… తీవ్రమైన హెచ్చరికలు.. విమర్శలు చేస్తున్నప్పటికీ.. స్పందించడానికి వైసీపీ నేతలు భయపడుతున్నారు. బీజేపీ విమర్శలపై మాట్లాడితే… ఏం జరుగుతుందోనని.. వివరణ కూడా విజయసాయిరెడ్డే ఇవ్వాలన్నట్లుగా పరిస్థితి మారింది. కానీ విజయసాయిరెడ్డి నేరుగా.. మోడీ, షాల పేర్లు పెట్టి మరీ చెప్పారు. ఇప్పుడు ఖండిస్తే.. మొత్తానికే తేడా వస్తుంది. ఖండించకపోతే.. అసలు భయం వేరే ఉంటుంది. అందుకే.. వైసీపీని ఇప్పుడు.. విజయసాయిరెడ్డి… చిక్కుల్లో పడేశారన్న ప్రచారం జరుగుతోంది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

తెలంగాణలో ఛాలెంజింగ్ పాలిటిక్స్

లోక్ సభ ఎన్నికల్లో కాంగ్రెస్, బీజేపీ, బీఆర్ఎస్ హోరాహోరీగా తలపడుతున్నాయి. ప్రజాభిప్రాయం ఎలా ఉన్నా మెజార్టీ సీట్లు మావంటే మావేనని ప్రకటిస్తున్నాయి. ప్రత్యర్ధి పార్టీలపై ఆయా పార్టీల నేతలు విమర్శలు, ప్రతి విమర్శలు...

కొనసాగింపు కథల బాక్సాఫీసు వేట

‘బాహుబలి’ సినిమా సైజ్ ని పెంచింది. ప్రేక్షకులందరికీ థియేటర్స్ లోకి తీసుకురాగలిగితే బాక్సాఫీసు వద్ద ఎలాంటి మాయ చేయొచ్చు నిరూపించింది. సినిమా కథకు కూడా కొత్త ఈక్వేషన్ ఇచ్చింది. బహుబలికి ముందు దాదాపు...

ట్రబుల్ షూటర్… ట్రబుల్ మేకర్ అవుతున్నారా?

14... ఇది లోక్ సభ ఎన్నికల్లో సీఎం రేవంత్ రెడ్డి టార్గెట్. అందుకు తగ్గట్టుగానే ప్రచారం చేపడుతున్నారు. అభ్యర్థుల గెలుపు బాధ్యతను తనే తీసుకొని రాష్ట్రవ్యాప్తంగా సుడిగాలి పర్యటన చేస్తున్నారు.ఇప్పటికే పలు నియోజకవర్గాల్లో...

కేసీఆర్‌కు సమాచారం ఇచ్చింది చెవిరెడ్డేనా ?

తెలంగాణలో 8 నుంచి 12 లోక్ సభ స్థానాల్లో బీఆర్ఎస్ గెలుస్తుదంటూ కేసీఆర్ చేసిన ప్రిడిక్షన్ వైరల్ అవుతోంది. అదే సమయంలో ఏపీలో జగన్ గెలుస్తారని తనకు సమాచారం వచ్చిందని కూడా ఓ...

HOT NEWS

css.php
[X] Close
[X] Close