చిరంజీవి జ‌డ్జిమెంట్ ఏమ‌యింది?

క‌థల ఎంపిక‌లో చిరంజీవి జ‌డ్జిమెంట్‌కు తిరుగుండ‌ద‌ని చెబుతారు. సినిమా క‌థ‌కు సంబంధించిన క‌మ‌ర్షియ‌ల్ అవుట్‌క‌మ్‌ను ఆయ‌న బాగా అంచ‌నా వేస్తార‌ని అంటారు. మెగాహీరోల సినిమాల క‌థ‌ల‌న్నింటిని చిరంజీవికి చెప్పాకే ఫైన‌ల్ చేస్తారు. రంగ‌స్థ‌లం సినిమా విష‌యంలో రామ్‌చ‌ర‌ణ్‌ను చిరంజీవి ఎంత‌గానో ప్రోత్స‌హించార‌ని, ఆ సినిమా చ‌ర‌ణ్ కెరీర్‌లో లాండ్‌మార్క్‌ఫిల్మ్స్ అవుతుంద‌ని చిరు ముందుగానే ఊహించార‌ని చెబుతారు. అయితే విన‌య విధేయ రామ చిత్రంలో చిరంజీవి అంచ‌నాల‌న్ని తప్పాయి. ఈ సినిమా సెట్స్‌పైకి వెళ్లే ముందు బోయ‌పాటి శ్రీ‌ను చెప్పిన‌ స‌బ్జెక్ట్‌లో సింగిల్ లైన్ కూడా మార్చాల్సిన అవ‌స‌రం లేద‌ని చిరంజీవి చెప్పార‌ట‌. అయ‌న ఆదేశించిన‌ట్లుగానే య‌థాత‌థంగా సినిమాను తీశారు. ప్ర‌స్తుతం ఈ సినిమా బాక్సాఫీస్ రేసులో చ‌తికిల‌ప‌డింది. సినిమాలోని కొన్నిసన్నివేశాల్ని చూసి ప్రేక్ష‌కులు న‌వ్వుకునే ప‌రిస్థితి ఉంది.ఎంత క్రియేటివ్ లిబ‌ర్టీస్ తీసుకున్నా లాజిక్‌లెస్‌గా వున్న కొన్ని సీన్స్ చూసి ప్రేక్ష‌కులు అస‌హ‌నం వ్య‌క్తం చేస్తున్నారు. అస‌లు రంగ‌స్థ‌లం వంటి చిర‌స్మ‌ర‌ణీయ విజ‌యం త‌ర్వాత రామ్‌చ‌ర‌ణ్‌తో ఈ సినిమా ఎందుకు చేయించార‌ని అభిమానులు మ‌ద‌న‌ప‌డుతున్నారు. విన‌య విధేయ రామ విష‌యంలో చిరంజీవి జ‌డ్జిమెంట్ పూర్తిగా తప్పింద‌ని మెగాభిమానులు బాధ‌ప‌డుతున్నార‌ట‌.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com