క్రిష్‌కు బోన‌స్ ఇస్తున్న బాల‌య్య‌?

ఎన్టీఆర్ బ‌యోపిక్ కు అన్ని ఏరియాల నుంచి సినిమాకు పాజిటివ్‌గా స్పంద‌న రావ‌డంతో చిత్ర బృందం విజ‌యోత్సాహంతో ఉంది. ఈ సినిమా స‌క్సెస్‌లో సింహ‌భాగం ద‌ర్శ‌కుడు క్రిష్‌దేన‌ని బాల‌కృష్ట చెబుతున్నార‌ట‌. దీంతో ఆయ‌న‌కు అద‌నంగా ఐదుకోట్ల పారితోషికాన్ని అందివ్వాల‌ని బాల‌కృష్ణ నిశ్చ‌యించున్నార‌ని తెలిసింది. ముందుగా రెండు భాగాల‌కు క‌లిపి క్రిష్‌కు ప‌దికోట్ల రెమ్యున‌రేష‌న్ ఆఫ‌ర్ చేశారు. ఈ సినిమా చిత్రీక‌ర‌ణ‌లో క్రిష్ చూపించిన అంకిత‌భావం, ప్రణాళిబ‌ద్ద‌మైన ప‌నితీరు బాల‌య్య‌ను ఎంత‌గానో ఆక‌ట్ట‌కుంద‌ట‌. కేవ‌లం మూడునెల‌ల వ్య‌వ‌ధిలో రెండు భాగాల షూటింగ్‌ను పూర్తిచేశారు క్రిష్‌. సంక్రాంతి బ‌రిలో ఈ సినిమా సంతృప్తిక‌ర‌ర‌మైన ఫ‌లితాల్ని సాధిస్తుండ‌టంతో రెండో భాగం స‌క్సెస్‌పై ధీమాగా ఉన్నారు. ఈ విష‌యాల‌న్నింటిని ప‌రిగ‌ణ‌న‌లోకి తీసుకున్న బాల‌కృష్ణ రెండో భాగం విడుద‌ల‌కు ముందే క్రిష్‌కు బోన‌స్‌గా ఐదుకోట్ల రెమ్యున‌రేష‌న్‌ను అందించ‌బోతున్నార‌ని ఫిల్మ్‌న‌గ‌ర్‌లో వ‌ర్గాల్లో టాక్ వినిపిస్తున్న‌ది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

నేనూ లైంగిక వేధింపులు ఎదుర్కున్నా

చిత్ర‌రంగంలో లైంగిక వేధింపులు స‌ర్వ‌సాధార‌ణ విష‌యంగా మ‌రిపోయింది. అయితే ఇప్ప‌టి వ‌ర‌కూ ఎవ‌రూ... ఈ విష‌యంలో నోరు మెద‌ప‌లేదు. `చెబితే అవ‌మానం` అని భ‌య‌ప‌డ్డారు. కానీ ఆ భ‌యాల్ని వ‌దిలి.. బ‌య‌ట‌కు వ‌స్తున్నారు...

ఇక పూరి.. ద‌బాంగ్‌!

బాలీవుడ్‌లో ఓ సినిమా చేయ‌డానికి పూరి జ‌గ‌న్నాథ్ గ‌ట్టిగా ప్లాన్ చేస్తున్నాడు. త్వ‌ర‌లోనే ఓ బాలీవుడ్ లో పాన్ ఇండియా సినిమా చేయబోతున్న‌ట్టు పూరి ఇటీవ‌లే ప్ర‌క‌టించాడు. అందులో ఓ అగ్ర క‌థానాయ‌కుడు...

కేసుల వలలో టీవీ 5 ..!

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఎజెండాగా పెట్టుకుని మరీ కేసులు పెడుతుందో.. అలా జరిగిపోతున్నాయో కానీ.. తమకు వ్యతిరేకంగా ఉన్నారని అనుకుంటున్న వారందరిపైనా కేసులతో ఎదురుదాడి చేస్తోంది. సోషల్ మీడియాలో పోస్టులు పెట్టే పెట్టే కార్యకర్తల...

‘ఎఫ్ 3’ త‌ర‌వాతే ఏదైనా…

లాక్ డౌన్ స‌మ‌యాన్ని సంపూర్ణంగా స‌ద్వినియోగం చేసుకున్న ద‌ర్శ‌కుల‌లో అనిల్ రావిపూడి ఒక‌రు. సొంత ఊరిలో ఉంటూనే `ఎఫ్ 3` సినిమా స్క్రిప్టుని పూర్తి చేసేశాడు. షూటింగుల‌కు ఎప్పుడు అనుమ‌తి వ‌స్తే అప్పుడు...

HOT NEWS

[X] Close
[X] Close