క్రిష్ అసంతృప్తి… కార‌ణమేంటి?

గ‌మ్యం చిత్రం మొద‌లుకొని నిన్న‌టి ఎన్టీఆర్ క‌థానాయ‌కుడు వ‌ర‌కు ద‌ర్శ‌కుడు క్రిష్ ప్ర‌యాణం అందరికి తెలిసిందే. ప్ర‌తి క‌థ‌లో చ‌క్క‌టి హ్యుమ‌న్ ఎమోష‌న్స్ పండిస్తూ సోష‌ల్ రెస్పాన్స్‌బిలిటీ ప్ర‌తిఫ‌లించేలా ఆయ‌న సినిమాల్ని రూపొందిస్తార‌ని పేరుంది. ఆయ‌న సినిమాలు ఫెయిలైన సంద‌ర్భాలున్నాయేమో కానీ ద‌ర్శ‌కుడిగా మాత్రం క్రిష్ ఎప్పుడూ ఫెయిల్ కాలేదు. కంచె చిత్రం జాతీయ‌స్థాయిలో విమ‌ర్శ‌కుల ప్ర‌శంస‌లందుకుంది. గౌత‌మీపుత్ర శాత‌క‌ర్ణి చిత్రం ద్వారా క్రిష్ త‌న‌లోని మ‌రో సృజ‌నాత్మ‌క కోణాన్ని ఆవిష్క‌రించారు. అయితే త‌న తాజా చిత్రం ఎన్టీఆర్ క‌థానాయ‌కుడు విష‌యంలో క్రిష్ కాస్త అసంతృప్తిగా ఉన్నార‌ని అంటున్నారు. ఎన్టీఆర్ వంటి లెజెండ్ జీవిత క‌థ‌కు ప‌రిపూర్ణంగా న్యాయం చేయాల‌ని క్రిష్ ఎంత‌గానో త‌పించారు. ఎంద‌రినో క‌లిసి విస్తృత ప‌రిశోధ‌న‌తో స‌బ్జెక్ట్‌కు రూప‌క‌ల్ప‌న చేశారు. ప్ర‌స్తుతం ఈ బ‌యోపిక్ బ‌క్సాఫీస్ వ‌ద్ద అంతంత మాత్రంగానే వ‌సూళ్ల‌ను సాధిస్తున్న‌ది. క్రిష్ గ‌త చిత్రాల‌పై జాతీయ‌స్థాయిలో మీడియా ఆస‌క్తిని చూపించింది. ప‌లువురు అగ్ర‌శ్రేణి సినీ పాత్రికేయుల నుంచి ప్ర‌శంస‌లు ల‌భించాయి. కానీ ఎన్టీఆర్ బ‌యోపిక్ బాగుంద‌ని అన్నారే కానీ క్రిష్ ప‌నిత‌నం గురించి ఎవ‌రూ కూడా మెచ్చుకోలును ప్ర‌ద‌ర్శించ‌లేదు. బాహుబ‌లి సినిమా విష‌యంలో నేష‌న‌ల్ మీడియా ద‌ర్శ‌కుడి రాజ‌మౌళిని ఆకాశానికెత్తేసింది. భార‌తీయ వెండితెర‌పై బాహుబ‌లి ఓ అద్భుత‌మ‌ని కొనియాడింది. ఆ స్ధాయిలో కాక‌పోయినా ఎన్టీఆర్ బ‌యోపిక్ కూడా నేష‌న‌ల్ లెవ‌ల్‌లో అంద‌రి దృష్టిని ఆక‌ట్టుకుంటుంద‌ని క్రిష్ అంచ‌నా వేశార‌ట‌. అయితే ఈ సినిమా గురించి జాతీయ మీడియా ఎక్క‌డా ప్ర‌స్తావించ‌లేదు. మ‌రోవైపు అంద‌రూ యునానిమ‌స్‌గా బాగా లేద‌ని డిక్లేర్ చేసిన విన‌య విధేయ రామ చిత్రం సైతం కొన్ని సి క్లాస్ సెంట‌ర్ల‌లో మంచి వ‌సూళ్ల‌ను సాధిస్తోంది. ఆరంభంలో మంచి టాక్ సంపాదించుకున్న ఎన్టీఆర్ బ‌యోపిక్ మాత్రం క్ర‌మంగా క‌లెక్ష‌న్ల‌లో వెన‌క‌బ‌డ‌టంతో క్రిష్ అసంతృప్తితో వున్నార‌ట‌. ఎన్నో జాగ్ర‌త్త‌లు తీసుకొని ప్ర‌తిష్టాత్మ‌కంగా తీసిన సినిమాలో ఎక్క‌డ లోపం జ‌రింగింద‌ని విశ్లేషించే ప‌నిలో ఉన్నార‌ట‌…

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

బాల‌కృష్ణ‌తో నాకు శ‌త్రుత్వం లేదు: నాగ‌బాబు

టాలీవుడ్ Vs నంద‌మూరి బాల‌కృష్ణ కాస్తా.. నాగ‌బాబు Vs బాల‌కృష్ణ‌గా మారింది. బాల‌య్య బాబు నోరు జార‌డం ఏమో గానీ.. వెంట‌నే వాటిపై ఘాటు వ్యాఖ్య‌లు చేస్తూ.. కామెంట్లు...

టాలీవుడ్‌లో బాలకృష్ణ మాటల మంటలు..!

షూటింగ్‌లు ఎప్పుడు ప్రారంభించాలన్నదానిపై తెలంగాణ మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్‌తో చిరంజీవి నేతృత్వంలో బృందం సమావేశం కావడంపై.. బాలకృష్ణ చేసిన వ్యాఖ్యలు కలకలం రేపుతున్నాయి. షూటింగ్‌లు ఎప్పుడు ప్రారంభించాలా టాలీవుడ్ పెద్దలు..తెలంగాణ ప్రభుత్వంతో సంప్రదింపులు...

కేంద్రం ఏపీపై ఆధారపడినప్పుడు ప్రత్యేక హోదా : జగన్

అప్పు రేపు.. తరహాలో ప్రత్యేకహోదా రేపు అంటున్నారు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి. ఏడాది పాలన పూర్తయిన సందర్భంగా గతంలో ఆయన "హోదా యోధ"గా స్వయం ప్రకటితంగా చేసుకున్న పోరాటం ఏమయిందని.. ప్రజలు...

శ్రీవారి ఆస్తులు అమ్మేదిలేదని టీటీడీ బోర్డు తీర్మానం..!

శ్రీవారికి భక్తులు కానుకగా ఇచ్చిన వాటిని అమ్మే ప్రసక్తే లేదని... తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డు తాజాగా ప్రకటించింది. ఈ మేరకు పాలకమండలి భేటీలో నిర్ణయం తీసుకున్నారు. శ్రీవారి ఆస్తుల అమ్మకాన్ని పూర్తిగా...

HOT NEWS

[X] Close
[X] Close