నాన్నకు ప్రేమతో హిట్ అని ముందే చెప్పిన వినాయక్

ప్రస్తుతం తారక్ సంచలనం నాన్నకు ప్రేమతో.. ఈ సినిమా హిట్ అనే మాట చిన్నదేమో ఎందుకంటే విదేశాల్లో సినిమా కలక్షన్ల సునామి సృష్టిస్తుంది.. తెలుగు రెండు రాష్ట్రాల్లోనూ నాన్నకు ప్రేమతో హౌజ్ ఫుల్స్ తో విజయవంతంగా ప్రదర్శితమవుతుంది. అయితే సినిమా సంక్రాంతి బరిలో అన్ని సినిమాల కన్నా ముందు విడుదలయ్యింది. 13న నాన్నకు ప్రేమతో విడుదలవగా.. 14న డిక్టేటర్.. 15న సోగ్గాడే చిన్ని నాయనా విడుదలయ్యాయి.

నాన్నకు ప్రేమతో మొదటి షో టాక్ ఏంటంటే.. సినిమా ఎవరికి అర్ధం కావట్లేదు కేవలం ఏ క్లాస్, మల్టీప్లెక్స్ వారికి మాత్రమే సినిమా నచ్చుతుంది అని.. రివ్యూస్ కూడా సూపర్ అన్నట్టుగా ఇచ్చాయి. ఓవరాల్ గా రోజు గడిచిన తర్వాత అందరు కనెక్ట్ అయ్యి సూపర్ అనేశారనుకోండి. అయితే సినిమా మొదటి ఆట చూసిన తర్వాత సుకుమార్ కు ఫోన్ చేసిన వినాయక్ మాత్రం సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అనేశాడట. అయితే అప్పటికే సినిమా మీద వస్తున్న డివైడ్ టాక్ కు కాస్త నిరసపడబోతున్న సుక్కుకి వినాయక్ ఫోన్ కొత్త ఉత్సాహాన్నిచ్చిందట.

వినాయక్ చెప్పినట్టుగానే సినిమా తారక్ సినిమాల్లోనే అత్యధికంగా వసూళ్లను రాబట్టిన సినిమాగా పరుగులు తీస్తుంది. ఇక ఎప్పటినుండో అందని ద్రాక్షలా ఉన్న 50 కోట్ల మార్క్ ని కూడా టచ్ చేసేలా దూసుకెళ్తున్నాడు యంగ్ టైగర్. మాస్ సినిమాలే తీసినా సినిమా ఫలితాన్ని ముందే కనిపెట్టి మరోసారి సూపర్ అనిపించుకున్నాడు వినాయక్.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com