ఆంధ్రప్రదేశ్ వైపు ఇప్పుడు ప్రపంచ పారిశ్రామిక రంగం చూస్తోంది. ఏపీని దారిలో పెట్టాలని ప్రజలు ఇచ్చిన బాధ్యతను చంద్రబాబు, నారా లోకేష్ శక్తివంచన లేకుండా నిర్వర్తించేందుకు ప్రయత్నిస్తున్నారు. ప్రణాళికాబద్ధంగా చేసిన ప్రయత్నాలు ఫలితాలు ఇస్తున్నాయి. ఆంధ్రప్రదేశ్‌కు ఓ హైప్ తీసుకురావడానికి ఎలాంటి ఎకోసిస్టమ్ అవసరమో.. అలాంటిది ఏర్పాటు చేశారు. ఇన్వెస్టర్స్ సమ్మిట్ నాటికి ఆ ఎకోసిస్టమ్ పక్కాగా ఏర్పడింది. గూగుల్ ను బ్రాండ్ అంబాసిడర్ గా వాడుకుని.. దిగ్గజ పారిశ్రామికవేత్తలను ఆహ్వానిస్తున్నారు. ఏపీలో ఇప్పుడు పెట్టుబడి పెట్టకపోతే చాలా మిస్సవుతారన్న ఫీలింగ్ ను పారిశ్రామికవేత్తల్లో తీసుకు రావడంలో విజయం సాధించారు.
గూగుల్‌తో ముందే ఒప్పందం చేసుకోవడం పక్కా ప్రణాళిక
గూగుల్ సంస్థ విశాఖలోదాదాపుగా లక్షన్నర కోట్లతో ఏఐ హబ్ పెట్టాలని అనుకున్నప్పుడు అలాంటి ఒప్పందం ఇన్వెస్టర్స్ సమ్మిట్ లో చేసుకుంటే బాగుంటుందని ఎవరైనా అనుకుంటారు. కానీ చంద్రబాబు, నారా లోకేష్ అలా అనుకోలేదు. అసలు గూగుల్ నే తమ బ్రాండ్ అంబాసిడర్ గా చేసుకోవాలంటే.. ముందుగానే ఒప్పందం చేసుకోవాలనుకున్నారు. అందుకే నెల రోజుల ముందుగానే ఒప్పందం పూర్తి చేశారు. అదే విషయాన్ని ప్రపంచవ్యాప్తంగా పారిశ్రామికవేత్తల్లోకి ఓ సందేశం పంపించారు. ఇది బాగా వర్కవుట్ అయింది. ప్రసిద్ధ ఐటీ కంపెనీలు విశాఖ వైపు చూస్తున్నాయి. పెద్ద ఎత్తున ఇన్వెస్టర్స్ సమ్మిట్‌లో ఒప్పందాలు చేసుకునేందుకు ముందుకు వస్తున్నాయి.
రూ. పది లక్షల కోట్లకుపైగా ఒప్పందాలు ఖాయం
ఇన్వెస్టర్స్ సమ్మిట్ ఈ సారి ప్రత్యేకంగా జరగబోతోంది. ముందుగానే ఆయన పారిశ్రామిక సంస్థలతో నారా లోకేష్ టీమ్ సంప్రదింపులు జరిపింది. ఏపీఈడీబీ టీమ్ ఎప్పటికప్పుడు ఫాలో అప్ చేసి.. ఒప్పందాలకు ఏర్పాట్లు చేసింది. పెట్టుబడిదారులకు అనువైన పాలసీలను ప్రకటించి .. వారిని ఆకర్షించారు. వేగంగా పెట్టుబడులను గ్రౌండ్ చేసి ఉద్యోగావకాశాలు కల్పించేలాచూస్తున్నారు. ఏపీకి ఉన్న తీరమే ప్లస్ పాయింట్‌గా.. రెన్యూవబుల్ ఎనర్జీ సహా అనేక రంగాల్లో పెద్ద ఎత్తున పెట్టుబడులు రానున్నాయి. అదే సమయంలో విశాఖలో .. ప్రముఖ సాఫ్ట్ వేర్ కంపెనీలన్నీ పెద్ద పెద్ద క్యాంపస్ లు పెట్టడానికి ఒప్పందాలు చేసుకోనున్నాయి. ఇప్పటికే టీసీఎస్, కాగ్నిజెంట్ ఒప్పందాలు చేసుకున్నాయి. ఇన్ఫోసిస్,యాక్సెంచర్ రెడీ అయ్యాయి. హెచ్‌సీఎల్ ఇప్పటికే విజయవాడలో ఉంది. విప్రోతో పాటు మరికొన్ని కీలక పెద్ద కంపెనీలు విశాఖకు వచ్చే అవకాశాలు ఉన్నాయి. మొత్తంగా పది లక్షల కోట్ల ఒప్పందాలు జరగనున్నాయి. ప్రతి ఒప్పందం వచ్చే ఆరు నెలల్లో గ్రౌండ్ అయ్యేలా జాగ్రత్తలు తీసుకుంటున్నారు.
ఏపీ వైపు ప్రపంచ దిగ్గజ పారిశ్రామికవేత్తల చూపు
దేశీ పారిశ్రామికవేత్తల కంటే.. గ్లోబల్ పెట్టుబడులను ఆకర్షించేందుకు చంద్రబాబు,లోకేష్ ఎక్కువగా శ్రమిస్తున్నారు. విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు వస్తేనే ఎక్కువ లాభం. దేశానికి కూడా ఎంతో మేలు జరుగుతుంది. అందుకే.. సీఐఐ సాయంతో అంతర్జాతీయ స్థాయిలో రోడ్ షోలు నిర్వహించి పెద్ద ఎత్తున ఆహ్వానాలు పపారు. ఆ ప్రభావం ఎక్కువగానే ఉంది. యూరప్ సమ్మిట్ ద్వారానేపెద్ద ఎత్తున ఒప్పందాలు చేసుకున్నారు. రాబోయే పెట్టుబడుల్లో అత్యధికం.. విదేశాల నుంచి వచ్చేవే. సాఫీగా సాగిపోయేలా.. ప్రభుత్వం చూసుకుంటే చాలు.. ఏపీ రాత మారిపోతుంది. యువతకు స్కిల్ ఉంటే చాలు వైట్ కాల్ జాబ్స్ వచ్చేస్తాయి. దానికి కావాల్సింది ఈ ఫ్రో ఇలా కొనసాగడమే.


