స్టీల్‌ప్లాంట్‌ను అమ్మనీయరట విజయసాయిరెడ్డి..!

విశాఖ స్టీల్ ప్లాంట్‌ను ప్రైవేటు పరం కానివ్వబోమని వైసీపీ పార్లమెంటరీ పార్టీ నేత విజయసాయిరెడ్డి ప్రకటించారు . దాని కోసం ఆయన పార్లమెంట్‌ను స్తంభింపచేస్తారా.. ప్రభుత్వంపై అవిశ్వాస తీర్మానం పెడతారా.. రాజ్యసభలో తమకు ఉన్న కమాండింగ్ బలాన్ని ఉపయోగించి.. ఇంకేమైనా చేస్తారా అన్నదానిపై ఆయన క్లారిటీ ఇవ్వలేదు. కానీ ఢిల్లీలో జంతర్ మంతర్‌లో ధర్నా చేస్తున్న స్టీల్ ప్లాంట్ కార్మికులకు మద్దతుగా ఎంపీలతో కలిసి వచ్చిన విజయసాయిరెడ్డి… ధైర్య వచనాలు చెప్పారు. స్టీల్ ప్లాంట్‌ను ప్రైవేటు పరం కానివ్వబోమని గంభీరంగా ప్రకటించారు. ఈ సందర్భంగా ప్రస్తుతం స్టీల్ ప్లాంట్ రెండు వందల కోట్ల లాభాల్లో నడుస్తోందని.. అయినా అమ్మడం శోచనీయమన్నారు.

కేంద్ర ప్రభుత్వానికి వైసీపీ ఎంపీలు పదే పదే ప్రశ్నలు వేస్తున్నారు. అదే పనిగా … స్టీల్ ప్లాంట్ అమ్మకం ఖాయమని సమాధానాలిప్పిస్తున్నారు. ఇప్పటికే కేంద్రం .. అమ్మకానికి మొదటి అడుగుగా న్యాయసలహాదారుల్ని నియమించడానికి రంగం సిద్దం చేసుకుంది. ఆ తర్వాత అమ్మకం ప్రక్రియను ప్రారంభించడమే. ఇప్పటికే దీనికి సంబంధించి జోరుగా అంతర్గతంగా చర్యలు తీసుకుంటున్నారు. అమ్మవద్దని కేంద్రంపై ఎవరి నుంచి ఒత్తిడి లేదు. కేవలం స్టీల్ ప్లాంట్ ఉద్యోగ సంఘాలు మాత్రమే పోరాడుతున్నాయి. వారు కూడా వైసీపీ నేతల్నే నమ్ముకున్నారు. వారు ఎక్కడ ధర్నాలు చేయమంటే అక్కడ చేస్తున్నారు. వారి ధర్నాల వద్దకు వైసీపీ నేతలు వచ్చి.. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ కాదని భరోసా ఇస్తున్నారు

స్టీల్ ప్లాంట్ విషయంలో మొదట్లో పెద్ద ఎత్తున ఉద్యమాలు జరిగాయి కానీ.. రాను రాను తగ్గిపోయాయి. గ్రేటర్ విశాఖ మున్సిపల్ ఎన్నికల కోసం అన్ని పార్టీలు పోటీ పడి స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ ఉద్యమాన్ని నడిపాయి. తర్వాత అందరూ సైలెంటయిపోయారు. అయితే అధికారంలో ఉన్న పార్టీగా వైసీపీకి.. తాము స్టీల్ ప్లాంట్‌ను పరిరక్షిస్తున్నామని చెప్పుకోవడానికి తగినంత పోరాటం చేస్తున్నారు. అయితే అది… కేవలం చెప్పుకోవడానికే కానీ.. కేంద్రానికి సెగతగిలేటట్లుగా లేదనేది బహిరంగంగా కనిపిస్తున్న వాస్తవం.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

ఎయిడెజ్ కాలేజీలపై ప్రభుత్వ విధానంతో మైనస్సే !

దశాబ్దాలుగా విద్యా సేవ అందిస్తున్న ఎయిడెడ్ కాలేజీలను అయితే ప్రభుత్వానికి స్వాధీనం చేయాలి లేకపోతే ప్రైవేటుగా నిర్వహించుకోవాలని ప్రభుత్వం ఆదేశించడం ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశం అవుతోంది. ఎయిడెడ్ కాలేజీలు ప్రభుత్వానివిగానే సాగుతున్నాయి....

తెలంగాణలో కూడా ప్రభుత్వ మటన్ !

ఏపీ ప్రభుత్వం మటన్ మార్టుల పేరుతో ఓ కాన్సెప్ట్‌ను ‌తమ అధికార మీడియా ద్వారా ప్రజలకు తెలియచెబితే జరిగిన రచ్చ అంతా ఇంతా కాదు. చివరికి పశుసంవర్థక మంత్రి అలాంటి ఆలోచనలేదని. అలా...

కేశినేనివి బెదిరింపులా ? నిజంగానే విరక్తి చెందారా ?

కేశినేని నాని ఇక ఎన్నికల్లో పోటీ చేయకూడదని నిర్ణయించుకున్నట్లుగా టీడీపీని వ్యతిరేకించే.. వైసీపీకి దగ్గరగా ఉండే మీడియాలో ప్రచారం జరిగింది. ఆయనే ఈ విషయాన్ని చెప్పినట్లుగా ఆ మీడియా చెప్పుకొచ్చింది. తన ఆశక్తతను...

టీ కాంగ్రెస్ సీనియర్ల అసంతృప్తి కూడా కామెడీ అయిపోతోందా !?

తెలంగాణ కాంగ్రెస్‌లో సీనియర్లుగా చెలామణి అయ్యే కొంత మంది నాయకులను రేవంత్ రెడ్డి ప్రణాళిక ప్రకారం సైడ్ చేస్తున్నట్లుగా ఉన్నారు. కలసి వస్తే సరే లేకపోతే వారి అసంతృప్తిని కూడా లెక్కలోకి రాకుండా...

HOT NEWS

[X] Close
[X] Close