హౌస్ అఫ్ మంచుస్ .. ఇదొక బూటకం !

మంచు విష్ణు, మనోజ్ మధ్య ఏవో గొడవలు వున్నాయి. అయితే అది ఇండస్ట్రీ క్లోజ్ సర్కిల్ లో వున్న కొద్దిమందికే తెలుసు. కానీ మొన్న మనోజ్ విడుదల చేసిన వీడియో కారణంగా గొడవ పబ్లిక్ అయ్యింది. అయితే దీనిపై మంచు ఫ్యామిలీ నుంచి ఎవరూ స్పందించడానికి ఇష్టపడలేదు. మనోజ్ మాత్రం తన ట్విట్టర్ పరోక్షంగా కొన్ని సూక్తులు పెట్టాడు. అవి ఎవరి తగలాలో వాళ్ళకి తగిలాయి.

అయితే ఈ గొడవ బయటికి వచ్చిన కొన్ని రోజుల తర్వాత విష్ణు ‘హౌస్ అఫ్ మంచుస్’ అంటూ ఒక వీడియో విడుదల చేశాడు. ఇదొక రియాలిటీ షో అన్నాడు. దీంతో మంచు బ్రదర్స్ మీడియా, జనాలతో ఆడుకుంటున్నారా ? అనే విమర్శ కూడా వచ్చింది. అయితే అసలు విషయం వేరే వుంది. అసలు ఇలాంటి రియాలిటీ షోనే వాళ్ళు చేయడం లేదు.

విష్ణు విడుదల చేసిన వీడియోనే తేడాగా వుంది. ఆ వీడియో మనోజ్ కి సంబధించిన ఒక్క షాట్ లేదు. మొత్తం విష్ణు, మోహన్ బాబు, వాళ్ళు నడుపుతున్న సంస్థల విజువల్స్ కనిపించాయి కానీ మనోజ్ లేడు. అప్పుడే ఇది ఉత్తుత్తి షో అని చాలా మంది అర్ధమైయింది. పైగా ఈ వీడియోని అటు మనోజ్ గానీ లక్ష్మీ గానీ షేర్ చేయలేదు. అసలు లాంటి షో ఏమీ చేయడం లేదనేది వారి సమాధానం. జరిగిన గొడవని కవర్ చేయడానికి విష్ణు క్రియేట్ చేసిన వీడియోనే కానీ అందులో రియాలిటీ లేదనేది మాత్రం వాస్తవం.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

భాగ‌మ‌తి ద‌ర్శ‌కుడి ‘ఎస్‌.. బాస్‌’

పిల్ల‌జ‌మిందార్‌, భాగ‌మ‌తి చిత్రాల‌తో ఆక‌ట్టుకొన్నాడు అశోక్. ఆ త‌ర‌వాత‌.. అశోక్ ఓ సినిమా చేశాడు. అది ఫ్లాప్ అయ్యింది. అప్ప‌టి నుంచి అశోక్ ఏం చేస్తున్నాడు? త‌న త‌దుప‌రి సినిమా ఎవ‌రితో అనే...

దక్షిణాదిలో తగ్గిపోయే లోక్‌సభ సీట్లపై కేటీఆర్ ఆందోళన!

దక్షిణాదికి దేశంలో ప్రాధాన్యం తగ్గించే దిశగా కేంద్రం అడుగులు వేస్తోందని చాలా కాలంగా ఆరోపణలు వినిపిస్తున్నాయి. ముఖ్యంగా లోక్ సభ సీట్లను తగ్గించబోతున్నారని చాలా కాలంగా పార్టీలు ఆరోపిస్తున్నాయి. 2026వ...

రైతు భరోసా క్యాలెండర్ తప్పింది !

జాబ్ క్యాలెండర్ పేరుతో యువతను మోసం చేసినా సంక్షేమ క్యాలెండర్ ను మాత్రం వదిలి పెట్టకుండా అమలు చేస్తున్నామని వైసీపీ నేతలు చెబుతున్నారు. కానీ అది కూడా దారి తప్పుతోంది. చెప్పిన...

బింబిసార-2కి కొత్త దర్శకుడు?

కల్యాణ్‌ రామ్‌ సోషియో ఫాంటసీ 'బింబిసార’ మంచి విజయాన్ని అందుకుంది. పటాస్ తర్వాత కళ్యాణ్ రామ్ కి మళ్ళీ జోష్ తెచ్చింది. దీనికి పార్ట్ 2 వుంటుందని సినిమా ముగింపులోనే చెప్పారు....

HOT NEWS

css.php
[X] Close
[X] Close