మళ్లీ వైసీపీ వాదన ఎత్తుకున్న బీజేపీ విష్ణు..!

భారతీయ జనతా పార్టీ నేత విష్ణువర్ధన్ రెడ్డి… ప్రభుత్వంపై అప్పుడప్పుడూ సుతిమెత్తగా విమర్శలు చేస్తారు కానీ.. కీలకమైన సమయాల్లో వారి వాదనను సమర్థించడానికి ఎలాంటి మొహమాటాలు పెట్టుకోరు. తాజాగా అన్నీ వదిలేసి… వైసీపీ నేతలు.. ఎస్‌ఈసీ తీసుకొచ్చిన ఓ యాప్ మీద విమర్శలు చేస్తున్నారు. ఆ యాప్ వల్ల ఏదేదో జరిగిపోతుందని పేపర్లలో రాసుకుంటున్నారు. ఇదే ఇప్పుడు.. విష్ణువర్ధన్ రెడ్డి అజెండాగా మార్చుకున్నారు. ఆ యాప్ గురించి డీటైల్డ్‌గా చెప్పాలని ట్వీట్ చేశారు. అందులో మొత్తం సాక్షి పత్రిక వ్యక్తం చేసిన అనుమానాలే ఉన్నాయి. బహుశా.. ఈ యాప్ పై అనుమానాల్ని మరింత విస్తృతం చేయాలన్న ఉద్దేశంతో… విష్ణువర్ధన్ రెడ్డితో ఉన్న సత్సంబంధాలతో వైసీపీ నేతలే ఇలా ప్రకటన చేయించి ఉంటారని అనుమానిస్తున్నారు.

ఎందుకంటే.. ఎస్‌ఈసీ ఉపయోగించాలని చెప్పిన యాప్ ఇప్పటికి ఉపయోగంలో ఉందో లేదో తెలియదు. ఆ యాప్ గురించి ఎలాంటి ప్రచారమూ చేయడం లేదు. అయితే ఆ యాప్ ఒక్క వెబ్ కాస్టింగ్ కాకుండా.. పోలింగ్ బూత్ బయట ప్రాంతాలపై కూడా నిఘా పెడుతుంది. ఇది మంచిదే కదా అన్న అంశాన్ని మాత్రం తీసుకోవడం లేదు. పోలింగ్ బూత్ ల బయట మొత్తం చేయాల్సిందంతా చేసేస్తున్నారు. బెదిరింపులు.. ప్రలోభాలతో పని కానిస్తున్నారు. అందుకే ఎస్‌ఈసీ మరింత కొత్తగా ఆలోచించారు. పోలింగ్ బూత్ బయట కూడా నిఘా పెట్టేలా యాప్ తీసుకొచ్చానని ప్రకటించారు. ఆ యాప్ ఎవరు చేయించారు… ప్రైవేటు వాళ్లా.. గవర్నమెంట్ వాళ్లా.. అంటూ లేని పోని అనుమానాలు సాక్షి మీడియా తరహాలో విష్ణువర్ధన్ రెడ్డి వ్యక్తం చేయడం… ఆయనకు ప్రత్యేకంగా సర్టిఫికెట్ ఇవ్వాల్సిన అవసరంలేదని గుర్తు చేస్తోందని అంటున్నారు.

నిమ్మగడ్డ ఎన్నికల కోసం ఆ యాప్ వినియోగించడం చట్ట విరుద్ధమైతే.. కోర్టులకు వెళ్లడం క్షణాల్లో పని . ఎవరు నిర్వహించినా యాప్ ను సాఫ్ట్ వేర్ కంపెనీలే రూపొందిస్తాయి. అయితే అది టీడీపీ వాళ్లు తయారు చేసిన యాప్ అని సాక్షి చెబుతూంటే.. దాన్నే విష్ణువర్ధన్ రెడ్డి హైలెట్ చేస్తున్నారు. ఇలాంటి నేతల వల్లనే… వైసీపీ బీ టీంగా బీజేపీని గుర్తిస్తున్నారు తప్ప… ప్రత్యామ్నాయంగా కాదన్న చర్చ సహజంగానే నడుస్తోంది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

ఈ ప్ర‌శ్న‌కు బ‌దులేది జ‌క్క‌న్నా..?!

RRR.... ఇండియ‌న్ ఫిల్మ్ ఇండ‌స్ట్రీలోనే ఓ చ‌రిత్ర‌. వ‌సూళ్ల ప‌రంగా, రికార్డుల ప‌రంగా, అవార్డుల ప‌రంగానూ... ఈ సినిమాకు తిరుగులేదు. మ‌ల్టీస్టార‌ర్ స్టామినా పూర్తి స్థాయిలో చాటి చెప్పిన సినిమా ఇది. తెలుగు...

నో హోప్స్ : డబ్బుల పంపకంపై జగన్ సిగ్నల్ ఇచ్చారా ?

చంద్రబాబులా నా దగ్గర డబ్బల్లేవు.. చంద్రబాబు డబ్బులిస్తే తీసుకుని నాకే ఓటేయండి అని జగన్ రెడ్డి ఎన్నికల ప్రచారసభల్లో తన ప్రచార స్పీచ్‌లలో కొత్తగా చెబుతున్నారు. జగన్ దగ్గర డబ్బుల్లేవా అని వైసీపీ...

కాంగ్రెస్‌లో మల్లారెడ్డి కోవర్టులా .. అసలు కాంగ్రెస్ కోవర్టే మల్లారెడ్డినా ?

మేడ్చల్ ఎమ్మెల్యే మల్లారెడ్డి కాంగ్రెస్ పార్టీలో తన కోవర్టులున్నారని ప్రకటించుకున్నారు. ఎవరయ్యా వాళ్లు అంటే.. కాంగ్రెస్ అధికారంలోకి రాగానే కాంగ్రెస్ లోకి జంప్ అయిన వాళ్లు. వాళ్లందర్నీ తానే కాంగ్రెస్ లోకి పంపానని...

ఈసీ ఆదేశించకుండానే షర్మిలపై కేసులు కూడా !

ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చిన తర్వాత ఎన్నికలకు సంబంధించిన ప్రకటనలు.. వ్యవహారాలు అన్నీ ఈసీ పరిధిలోకి వస్తాయి. కోడ్ ఉల్లంఘిస్తే.. చర్యలు ఈసీ తీసుకోవాలి. కానీ ఏపీలో రాజ్యాంగం వేరుగా ఉంటుంది. ఎన్నికల...

HOT NEWS

css.php
[X] Close
[X] Close