దాసుకి ఫేటు ఎలా ఉందో..?

హీరోగా డ్యూయ‌ల్ రోల్ చేస్తూ, దర్శ‌క‌త్వం వ‌హిస్తూ, నిర్మాత‌గా బాధ్య‌త‌లు చూసుకొంటూ `దాస్ దా ధ‌మ్కీ` రూపొందించాడు విశ్వ‌క్‌సేన్‌. నిజంగా.. ఓ యువ హీరో, ఇన్ని విభాగాల్లో దృష్టి పెడుతూ సినిమా చేయ‌డం అంటే గ్రేటే! ద‌ర్శ‌క‌త్వం, నిర్మాణం, నట‌న‌.. ఇలా త్రిపాత్రాభిన‌యం చేస్తూ ఓ సినిమా తీసిన యువ హీరో… విశ్వ‌కేనేమో..? ఫ‌ల‌క్ నామా దాస్‌తో విశ్వ‌క్‌కి డైరెక్ష‌న్‌పై గురి కుదిరింది. అయితే.. ఇంత భారీ ప్రాజెక్ట్ ని డీల్ చేయ‌డం క‌త్తిమీద సామే. ఈ సినిమాతో విశ్వ‌క్ త‌న కెరీర్‌ని ప‌ణంగా పెట్టాడ‌నే అనిపిస్తోంది. కాక‌పోతే.. ఇప్పుడొస్తున్న బ‌జ్ పై విశ్వ‌క్ హ్యాపీగా ఉన్నాడు. ఈనెల 22న ఉగాది సంద‌ర్భంగా ఈ సినిమా విడుద‌ల అవుతోంది. రంగ‌మార్తండ త‌ప్ప‌.. ఈ సినిమాకి పోటీ లేదు. రంగ‌మార్తాండ కూడా ఈ సినిమాకి పోటీ కాదు. ఎందుకంటే అది వేరే జోన‌ర్‌. యూత్ అంతా.. దాస్ కా ద‌మ్కీ పైనేఫోక‌స్ పెడుతుంది. విశ్వ‌క్ కెరీర్‌లో బిగ్గెస్ట్ రిలీజ్ ఈ సినిమాకి ద‌క్కింది.

సినిమా జ‌నంలోకి వెళ్తే క‌నుక క‌నీసం రూ.20 కోట్ల‌యినా థియేట‌ర్ల నుంచి రావడం ఖాయ‌మ‌న్న లెక్క‌ల్లో ఉన్నాడు విశ్వ‌క్‌. ట్రైల‌ర్ బాగుంది. `ప‌డిపోయిందే పిల్లా` పాట జ‌నంలోకి విప‌రీతంగా వెళ్లిపోయింది. ఈమ‌ధ్య పాట‌లు సినిమాల‌కు చాలా ప్ల‌స్ అయిపోతున్నాయి.పాట‌ల కోస‌మే జ‌నాలు థియేట‌ర్ల‌కు వెళ్తున్నారు. `సార్‌`లో మాస్టారూ మాస్టారు పాట జ‌నానికి బాగా ఎక్కేసింది. సార్ విజ‌యంలో ఆపాట కీల‌క స్థానాన్ని ఆక్ర‌మించుకొంది. అలా దాస్ కా ద‌మ్కీ కి..`ప‌డిపోయిందే పిల్లా` పాట ఎట్రాక్ష‌న్ అవ్వ‌బోతోంది. అన్నింటికి మించి దాస్ కా ద‌మ్కీ ప్రీ రిలీజ్ ఫంక్ష‌న్‌కి ఎన్టీఆర్ అతిథిగా వ‌చ్చాడు. విశ్వ‌క్‌పై త‌న ప్రేమ‌ని చూపించాడు. ఎన్టీఆర్ రాక‌తో.. ఈ సినిమాకి మంచి ప్ర‌మోష‌న్ లభించిన‌ట్టైంది. మొత్తానికి విశ్వ‌క్‌కి అన్ని వైపుల నుంచి శుభ‌శ‌కునాలే క‌నిపిస్తున్నాయి. మ‌రి త‌న జాత‌కం ఎలా ఉందో తెలియాలంటే ఇంకో రెండు రోజులు ఆగాలి.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

భాగ‌మ‌తి ద‌ర్శ‌కుడి ‘ఎస్‌.. బాస్‌’

పిల్ల‌జ‌మిందార్‌, భాగ‌మ‌తి చిత్రాల‌తో ఆక‌ట్టుకొన్నాడు అశోక్. ఆ త‌ర‌వాత‌.. అశోక్ ఓ సినిమా చేశాడు. అది ఫ్లాప్ అయ్యింది. అప్ప‌టి నుంచి అశోక్ ఏం చేస్తున్నాడు? త‌న త‌దుప‌రి సినిమా ఎవ‌రితో అనే...

దక్షిణాదిలో తగ్గిపోయే లోక్‌సభ సీట్లపై కేటీఆర్ ఆందోళన!

దక్షిణాదికి దేశంలో ప్రాధాన్యం తగ్గించే దిశగా కేంద్రం అడుగులు వేస్తోందని చాలా కాలంగా ఆరోపణలు వినిపిస్తున్నాయి. ముఖ్యంగా లోక్ సభ సీట్లను తగ్గించబోతున్నారని చాలా కాలంగా పార్టీలు ఆరోపిస్తున్నాయి. 2026వ...

రైతు భరోసా క్యాలెండర్ తప్పింది !

జాబ్ క్యాలెండర్ పేరుతో యువతను మోసం చేసినా సంక్షేమ క్యాలెండర్ ను మాత్రం వదిలి పెట్టకుండా అమలు చేస్తున్నామని వైసీపీ నేతలు చెబుతున్నారు. కానీ అది కూడా దారి తప్పుతోంది. చెప్పిన...

బింబిసార-2కి కొత్త దర్శకుడు?

కల్యాణ్‌ రామ్‌ సోషియో ఫాంటసీ 'బింబిసార’ మంచి విజయాన్ని అందుకుంది. పటాస్ తర్వాత కళ్యాణ్ రామ్ కి మళ్ళీ జోష్ తెచ్చింది. దీనికి పార్ట్ 2 వుంటుందని సినిమా ముగింపులోనే చెప్పారు....

HOT NEWS

css.php
[X] Close
[X] Close