విశ్వ‌క్ సేన్‌తో బేరం కుదిరింది

త‌మిళ‌ ‘ఓ మై క‌ద‌వులే’ రీమేకు హ‌క్కులు పీవీపీ ద‌గ్గ‌రున్నాయి. ఈ సినిమాని విశ్వ‌క్‌సేన్‌తో రీమేక్ చేయాల‌న్న‌ది ప్లాన్‌. ఆ విష‌యం ముందే మీడియాకు లీకైంది. య‌ధావిధిగా వార్త‌లొచ్చాయి. అయితే విశ్వ‌క్ మాత్రం `ఈ రీమేకులో నేను చేయ‌డం లేద‌`ని తేల్చేశాడు. దాంతో పీవీపీ మ‌రో హీరోని చూసుకుంటుందేమో అనిపించింది. కానీ.. అలా జ‌ర‌గ‌లేదు. పీవీపీ విశ్వ‌క్‌ని ఒప్పించ‌గ‌లిగింది. చివ‌రికి…. ఈ సినిమా ఓకే చేసేశాడు విశ్వ‌క్‌. ఈ బేరం కుద‌ర‌డానికి రెండు ప్ర‌ధాన కార‌ణాలున్నాయి.

ఒకటి పారితోషికం. ఈ సినిమా చేయాలంటే విశ్వ‌క్ 2 కోట్ల పారితోషికం అడిగాడ‌ట‌. విశ్వ‌క్ రేంజుకి అది చాలా ఎక్కువ‌. కానీ… పీవీపీ ఒప్పుకుంది. మ‌రోటి.. త‌రుణ్‌భాస్క‌ర్ మ‌ధ్య‌వ‌ర్తిత్వం. ‘ఓ మై క‌ద‌వులే’ రీమేక్‌కి త‌రుణ్ మాట‌లు రాస్తున్నాడు. పైగా విశ్వ‌క్‌తో చ‌నువు, స్నేహం ఉన్నాయి. విశ్వ‌క్ ని హీరోగా ప‌రిచ‌యం చేసింది త‌రుణే. అందుకే…. త‌రుణ్ మ‌ధ్య‌వ‌ర్తిత్వం చేసి విశ్వ‌క్ ని ఒప్పించాడు. అలా ఈ కాంబో సెట్ట‌యింది. మాతృక తీసిన అశ్వంత్ మారిముత్తు రీమేక్‌కీ ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తారు. క‌థానాయిక‌, మిగిలిన సాంకేతిక నిపుణులు వివ‌రాల్ని పీవీపీ త్వ‌ర‌లోనే ప్ర‌క‌టించ‌నుంది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

రాజ‌మౌళి ద‌ర్శ‌క‌త్వంలో నాని

రాజ‌మౌళి - నాని కాంబోలో 'ఈగ' వ‌చ్చింది. అది సూప‌ర్ హిట్ అయ్యింది. మ‌ళ్లీ ఈ కాంబో కోసం ఆస‌క్తిగా ఎదురు చూస్తున్నారు ప్రేక్ష‌కులు 'ఈగ 2' ఆలోచ‌న రాజ‌మౌళికి ఉంది. కానీ...

కేసీఆర్ పై ఈసీ బ్యాన్

మాజీ సీఎం కేసీఆర్ ను ప్రచారం చెయ్యకుండా ఎన్నికల కమిషన్ నిషేధించింది. ఈరోజు రాత్రి8 గంటల నుండి రెండు రోజుల పాటు అంటే 48గంటల పాటు ఈ నిషేధం అమల్లో ఉంటుంది అని...

టీడీపీ మేనిఫెస్టోకి మరిన్ని కలిపి ఆకర్షణీయంగా ప్రచారం చేస్తున్న జగన్

టీడీపీ వాళ్లు సూపర్ సిక్స్ పథకాలపై చాలా కాలంగా ప్రచారం చేసుకుంటున్నారు. ప్రజల్లోకి తీసుకెళ్తున్నారు. వారి మేనిఫెస్టోను వారు ప్రచారం చేసుకుంటున్నారు. అయితే వారితో పాటు జగన్ కూడా ప్రచారం చేస్తున్నారు. ...

పాన్ ఇండియా ‘సుడిగాడు’

అల్లరి నరేష్ కెరీర్ లో హిట్ సినిమా 'సుడిగాడు'. స్పూఫ్ లకు పరాకాష్టగా వచ్చిన ఆ సినిమా బాగానే నవ్వించింది. తర్వాత నరేష్ కి వరుస పరాజయాలు వచ్చాయి. ఏ సినిమా చేసిన...

HOT NEWS

css.php
[X] Close
[X] Close