ఆహాకి ‘మెగా’ షాక్‌!

చిరంజీవి కుమార్తె సుస్మిత ఇప్పుడు నిర్మాత‌గా మారింది. ఓయ్ ద‌ర్శ‌కుడు ఆనంద్ రంగా తో ఓ వెబ్ సిరీస్ ని రూపొందిస్తోంది. మెగా త‌న‌య వెబ్ సిరీస్ అంటే… అది ఆహాలోనే స్ట్రీమింగ్ అవుతుంద‌ని ఆశిస్తారు. ఆహా కోస‌మే సుస్మిత వెబ్ సిరీస్ తీస్తుంద‌నుకుంటారు. ఎందుకంటే.. ఆహాకి క‌ర్త క‌ర్మ క్రియ అంతా అల్లు అర‌వింద్‌నే. త‌న ఓటీటీ ఫ్లాట్ ఫామ్ కోసం వెబ్ సిరీస్‌ల‌నూ, సినిమాల్నీ వెదికి ప‌ట్టుకుని కంటెంట్ బ్యాంక్‌ని సంవృద్థి ప‌ర‌చుకోవ‌డానికి అల్లు అర‌వింద్ ఆప‌సోపాలు ప‌డుతున్నారు. మెగా ఇంటి నుంచి ఓ వెబ్ సిరీస్ వ‌స్తోంటే, అది ఆహా ఖాతాలోకే అనుకోవ‌డం స‌హ‌జం. కానీ… సుస్మిత మాత్రం త‌న వెబ్ సిరీస్‌ని జీ5కి ఇచ్చేసింది. ఇందుకు సంబంధించిన ఎగ్రిమెంట్లు కూడా పూర్త‌య్యాయి.

ఇదో క్రైమ్ థ్రిల్ల‌ర్‌. మొత్తం ఎనిమిది ఎపిసోడ్లు ఉంటాయి. హైద‌రాబాద్ న‌గ‌ర నేప‌థ్యంలో సాగుతుంది. పోలీస్‌లూ – హంత‌కుల మ‌ధ్య జ‌రిగే వెదుకులాట‌, ఇన్వెస్టిగేష‌న్ ఈ వెబ్ సిరీస్ సారాంశం. ప్ర‌స్తుతం హైదరాబాద్‌లో లాక్ డౌన్ నియ‌మ నిబంధ‌న‌ల్ని ఆచ‌రిస్తూ.. షూటింగ్ మొద‌లెట్టారు. టైటిల్ ఇంకా ఖ‌రారు కాలేదు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

క‌రోనాని జ‌యించిన జ‌క్క‌న్న కుటుంబం

ప్ర‌ముఖ ద‌ర్శ‌కుడు ఎస్‌.ఎస్.రాజ‌మౌళి, అత‌ని కుటుంబ స‌భ్యుల‌కు క‌రోనా సోకిన విష‌యం తెలిసిందే. రెండు వారాల నుంచి రాజ‌మౌళి, కుటుంబ స‌భ్యులు హోం క్వారెంటైన్‌లోనే ఉంటున్నారు. డాక్ట‌ర్ల ప‌ర్య‌వేక్ష‌ణ‌లో చికిత్స తీసుకుంటున్నారు. ఈరోజు...

ప్చ్…ఇళ్ల పట్టాల పంపిణీ మళ్లీ వాయిదా..!

ఆగస్టు పదిహేనో తేదీన 30 లక్షల మందికి ఇళ్ల స్థలాలిస్తామన్న ఏపీ సర్కార్ మళ్లీ వాయిదా బాట పట్టింది. కోర్టుల్లో కేసులున్నాయంటూ... మరోసారి ముహుర్తం మార్చింది. ఈ సారి గాంధీ జయంతికి...

అనధికార కేబినెట్ భేటీని నిర్వహించేసిన కేటీఆర్..!

తెలంగాణ సర్కార్‌లో నెంబర్ టూగా ఉంటూ.. సీఎం రేంజ్ పవర్స్ తో పాటు విధులు కూడా నిర్వహిస్తున్న అనధికారికంగా కేబినెట్ భేటీ కూడా నిర్వహించేశారు. ప్రాక్టీస్ కోసం అన్నట్లుగా జరిగిన ఈ కేబినెట్...
video

స‌డ‌క్ 2 పై.. సుశాంత్ అభిమానుల సెగ‌

సుశాంత్ సింగ్ రాజ్ పుత్ ఆత్మ‌హ‌త్య వెనుక‌.. ప్ర‌త్య‌క్షంగానూ ప‌రోక్షంగానూ మ‌హేష్ భ‌ట్ ప్ర‌మేయం ఉంద‌ని సుశాంత్ అభిమానులు న‌మ్ముతున్నారు. చాలా రోజులుగా సుశాంత్ వ‌ర్గం మ‌హేష్ భ‌ట్ ని టార్గెట్ చేస్తోంది....

HOT NEWS

[X] Close
[X] Close