తెలుగు రాష్ట్రాల్లో ఇళ్లకే ఐసోలేషన్ కిట్లు..!

కరోనా పాజిటివ్ కేసులు.. తెలుగు రాష్ట్రాల్లో అంతకతకూ పెరిగిపోతున్నాయి. ఎన్ని బెడ్లు ఏర్పాటు చేసినా… కోవిడ్ ఆస్పత్రులు ఏర్పాటు చేసినా సరిపోని పరిస్థితి. లక్షణాలు లేని.. ఓ మాదిరి లక్షణాలు ఉన్న కరోనా పేషంట్లే సగానికిపైగా ఉంటున్నారు. వారిని ఆస్పత్రికి తీసుకెళ్లకపోతే.. సూపర్ స్ప్రెడర్లుగా మారుతారేమోనని బయం… తీసుకెళ్తే.. సీరియస్ పేషంట్లకు బెడ్లు సరిపోవని… ప్రభుత్వానికి భారం అవుతుందేమోననే ఆందోళన. అందుకే.. ఇక కరోనా పాజిటివ్ వచ్చిన వారికి.. ఇంటికే.. ఐసోలేషన్ కిట్లు పంపాలని నిర్ణయించుకున్నారు. ఈ మేరకు రెండు రాష్ట్రాల ప్రభుత్వాలు.. కిట్లలో ఏమేమి ఉంటాయో ప్రకటనలు.. ఫోటోలు విడుదల చేస్తున్నాయి.

కరోనా వచ్చిన చాలా మందికి ప్రాథమిక లక్షణాలే ఉంటున్నాయి. వారందరికీ ఇంటి దగ్గర ట్రీట్‌మెంట్ చాలని.. చెబుతున్నారు. అయితే.. ఏంతో కొంత ట్రీట్‌మెంట్ .. మెడికేషన్ అవసరం. దానిపై.. సరైన అవగాహన ఉండటం లేదు. కావాల్సిన విటమిన్, జింక్ టాబ్లెట్లు దొరకని పరిస్థితి. అందుకే… ఓ ఐసోలేషన్ కిట్‌ను… తీసుకోవాల్సిన జాగ్రత్తలన్నింటినీ వివరిస్తూ.. పంపిణీ చేయాలని నిర్ణయించుకున్నట్లుగా తెలుస్తోంది. ఇందులో మెడిసిన్ తో పాటు.. మాస్కులు.. గ్లౌజులు.. శానిటైజర్లను కూడా ఉంచుతున్నారు.

అయితే ప్రభుత్వాలు.. పని చేయడం కన్నా.. పబ్లిసిటీనే ఎక్కువగా ఉంటోందన్న విమర్శలు వస్తున్నాయి. ఎవరికీ పంపిణీ చేయకుండానే.. ప్రారంభించకుండానే… ఫోటోలు విడుదల చేసి.. సోషల్ మీడియాల్లో గొప్పగా ప్రచారం చేసుకుంటున్నాయని అంటున్నారు. తెలుగు రాష్ట్రాల్లో ఇప్పటి వరకూ.. ఏ ఒక్కరికీ ఇలాంటి కిట్లు పంపిణీ చేయలేదు కానీ.. పబ్లిసిటీ మాత్రం.. రెండు రాష్ట్రాల ప్రభుత్వాలకు ఫ్యాన్స్ హోరెత్తిస్తున్నారు. హోంక్వారంటైన్‌లో ఉన్న వారు.. తమకు ఐసోలేషన్ కిట్లు అందలేదే అని మథన పడుతున్నారు. కరోనా బారిన పడి హోం ఐసోలేషన్ లో ఉన్న వారికి కిట్లు అందించకుండా.. పబ్లిసిటీ చేసుకుంటే.. ఏం ప్రయోజనం ఉంటుందనే విమర్శలు గట్టిగానే వినిపిస్తున్నాయి.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

ఆ స్థానాల్లో ఇద్దరేసి అభ్యర్థులకు బీజేపీ బీ ఫాం..!?

పార్లమెంట్ ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకున్న బీజేపీ వ్యూహాత్మకంగా ముందుకు సాగుతోంది.పోటీ చేసే అభ్యర్థులకు గెలుపు వ్యూహాలను చేరవేస్తూనే..మరోవైపు పార్టీ పరంగా ఎలాంటి వ్యూహాలను అనుసరించాలో అన్నింటిని పక్కా ప్లాన్ తో అమలు చేస్తోంది....

కేసీఆర్ బస్సులో లిఫ్ట్.. ఎంట్రీ వేరే లెవల్..!!

బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ వినియోగిస్తోన్న బస్సు అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. కేసీఆర్ సౌలభ్యం కోసం బస్సును కొత్త టెక్నాలజీతో అప్డేట్ చేయడంతో బస్సు డిజైన్ ఆకట్టుకుంటోంది. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు ముగిసాక కేసీఆర్...

రియల్లీ గ్రేట్..50 మందిని కాపాడిన బాలుడు

రంగారెడ్డి జిల్లా షాద్ నగర్ లోని ఫార్మా కంపెనీ అగ్ని ప్రమాద ఘటనలో ఓ బాలుడి సాహసం 50మందిని ప్రాణాపాయం నుంచి కాపాడింది. భారీగా మంటలు ఎగిసిపడటంతో ప్రమాదంలో చిక్కుకొని ఆపన్నహస్తం కోసం...

పిఠాపురంపైకి అసాంఘిక శక్తుల దండయాత్ర !

ఒక్కడిని ఒక్కరంటే ఒక్కర్ని ఓడించడానికి అన్ని రకాల మాఫియాల్ని రంగంలోకి దించుతోంది వైసీపీ. విచ్చలవిడిగా డబ్బులు ఖర్చుపెట్టడమే కాదు.. నకిలీ మద్యంతో ముంచెత్తుతున్నారు. బయట నుంచి ఎర్ర చందనం స్మగ్లర్లు,...

HOT NEWS

css.php
[X] Close
[X] Close