విష్వక్సేన్, ‘జాతిరత్నాలు’ ఫేం అనుదీప్.కె.వి కలయికలో రూపొందుతున్న సినిమా ‘ఫంకీ. సితార ఎంటర్టైన్మెంట్స్ నాగవంశీ నిర్మిస్తున్నారు. తాజాగా టీజర్ వదిలారు. ఒక డైరెక్టర్, ప్రొడ్యూసర్ కి మధ్య లవ్ స్టొరీ ఇది.
చిన్నప్పుడు అమ్మ చెప్పిన మాటలు వినలేదు మనం.
ఏం చెప్పింది?
చెప్పా కదా వినలేదు అని.. ఇలా అనుదీప్ మార్క్ పంచ్ టీజర్ ఓపెన్ అయ్యింది.
టీజర్ అడుగడుగునా అనుదీప్ పంచులతో నిండిపోయింది. విష్వక్సేన్ కయదూ లోహార్ జోడి బావుంది. లవ్ ట్రాక్ కొత్తగా ప్రత్నించారనే ఫీలింగ్ కలిగించింది. భీమ్స్ సిసిరోలియో బీజీఎం ఎనర్జిటిక్ గా వుంది.
టీజర్ లో కథ జోలికి వెళ్ళలేదు. ఒక డైరెక్టర్ ప్రొడ్యూసర్ కి మధ్య జరిగే ట్రాక్ మాత్రమే రిజిస్టర్ చేశారు. అనుదీప్ పంచులకి సెపరేట్ ఫ్యాన్‌బేస్ వుంది. మళ్ళీ జాతిరత్నాలు తరహా వినోదం పండితే విశ్వక్, అనుదీప్ ఇద్దరూ ఫామ్ లోకి వచ్చేసినట్లే.