బాబు విజన్ లో దోషం లేదు, కానీ…

అమరావతి శంకుస్థాపన సభలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ వరాల జల్లులు కురిపించలేదనీ, ఆ సభలో ముఖ్యమంత్రి చంద్రబాబు కూడా మోదీని గట్టిగా నిలదీసి అడగలేదన్న విమర్శలు వస్తున్న ప్రస్తుత పరిస్థితుల్లో, బాబు మెగాడ్రీమ్ గా చెప్పుకుంటున్న అమరావతి ఏమేరకు కార్యరూపం దాలుస్తుందన్న ప్రశ్న ఉదయిస్తోంది. అంతేకాదు, ప్రజలరాజధాని అంటూ నానాహడావుడిచేసిన చంద్రబాబు గుండెలోతుల్లో అసలేముందీ? ఇంతకీ ఆయనగారు తన కలలోని రాజధానిని వాస్తవంగా నిలబెడతారా? లేక మధ్యలోనే జావగారిపోతారా ? ప్రజల నమ్మకాన్ని వొమ్ముచేస్తారా?? అన్నవి ఐదుకోట్ల ఆంధ్రుల్లో తలెత్తుతున్న అనుమానాలు. ఇవేమీ అర్థంలేని అనుమానాలు, సందేహాలు కానేకావు. బాబు ఆలోచనలు, వ్యూహరచన తెలిసినవారు కూడా ఈ మెగా ప్రాజెక్ట్ పై సందేహాలు వ్యక్తం చేస్తున్నారు.

దీర్ఘదర్శి

చంద్రబాబు ఆలోచనల్లోని చిత్తశుద్ధిని ఏమాత్రం శంకించలేము. ఆయన చాలా ముందుచూపుతో ఆలోచిస్తుంటారు. అందుకుతగ్గట్టుగా వ్యూహరచన చేస్తుంటారు. అయితే మధ్యమధ్యలో కొన్ని రాజకీయమైన, స్వార్థచింతనతోకూడిన తప్పులు చేస్తారు. దీంతో తన ఆలోచనలు, పథకాలు పూర్తికాకముందే ప్రతిపక్షనేతగా కూర్చుంటారు. గతంలో జరిగింది కూడా ఇదే.

శంషాబాద్ లో నూతన విమానాశ్రయాన్ని అంతర్జాతీయస్థాయిలో కట్టాలనుకున్నప్పుడుగానీ, అంతకుముందు హైటెక్ సిటీ నిర్మించాలనుకున్నప్పుడుగానీ ఆయన ఆలోచనల్లోని పదును ఎంతటిదో అందరికీ తెలిసొచ్చింది.

15ఏళ్ల క్రిందటి ముచ్చట ఇది… ఢిల్లీ నుంచి హైదరాబాద్ కు చంద్రబాబు విమానంలో వస్తున్నారు. ఆయనగారి సీటు పక్కనే సీనియర్ జర్నలిస్ట్, పొలిటికల్ ఎనలిస్ట్ సంజయ్ బారూ కూర్చున్నారు. మాటల సందర్బంలో ఆనాటి ప్రతిపాదిత శంషాబాద్ ఎయిర్ పోర్ట్ ప్రస్తావన వచ్చింది. చంద్రబాబు తన ఆలోచనలను చాలా చక్కగా వివరించారు. పట్టణాల అభివృద్ధిలో బాబుకున్న సమగ్రఆలోచన ఏమిటో తెలుసుకున్న సంజయ్ బారూ విస్మయం చెందారు. అప్పటి వరకు శంషాబాద్ లో ఏదో మామూలు విమానాశ్రయం కడుతున్నారనే అంతాఅనుకున్నారు. కానీ నిజానికి అది కేవలం విమానాశ్రయం మాత్రమేకాదు, సింగపూర్, దుబాయ్ మధ్య ఎయిర్ పోర్ట్ హబ్ గా ఉంటుందని బాబు చెప్పారు. మరో రకంగా చెప్పాలంటే అది ఎయిర్ పోర్ట్ నగరమన్నమాట. అంతర్జాతీయ విమానాల రాకపోకలేకాదు, ఇది ఒక కార్గోగా, ఎయిర్ క్రాప్ట్ మెయింటినెన్స్ కేంద్రంగా, ఎగుమతుల కేంద్రంగా, అంతర్జాతీయ సదస్సులకు , ఎగ్జిబిషన్స్ కు వేదికగా నిలవాలన్నది బాబు ఆలోచన.

బాబు ఆలోచనలు ఎంత ముందుంటాయో చెప్పాలంటే, శంషాబాద్ ఎయిర్ పోర్ట్ ఆలోనచలు బాబుమదిలోకి వచ్చిన పదేళ్లకు చైనాలో Zhengzhou లో ఎయిర్ పోర్ట్ నగరం అభివృద్ధి చెందింది. ఇదీ బాబుకున్న ముందుచూపు.

పరాజయం

మంచి ఆలోచనలతో , అభివృద్ధి వ్యూహంతో ముందుకుసాగుతున్న బాబుకు 2004లో ఎదురుదెబ్బ తగిలింది. అప్పటి ఎన్నికల్లో బాబు అధికారం కోల్పోవాల్సివచ్చింది. రాష్ట్రంలో కాంగ్రెస్ గద్దెనెక్కింది. కేంద్రంలో యుపీఏ ప్రభుత్వం వచ్చింది. అప్పటి విమానయాన మంత్రిగా ఒక మహారాష్ట్ర నాయకుడు ఉండేవారు. ఆయన బాబు ఊహించిన ఎయిర్ పోర్ట్ సిటీని నాగపూర్ లో కట్టించాలనుకున్నాడు. హైదరాబాద్ లో ఉన్న సౌకర్యాలు (ఆర్థిక, సామాజిక స్థితిగతులు వంటివి) అక్కడ లేకపోయినా సదరుమంత్రి పంతానికి పోయారు. కానీ అది ఫలించలేదు. చివరకు శంషాబాద్ లోనే అతిపెద్ద ఎయిర్ పోర్ట్ సిటీ వచ్చింది. అయితే ఇదికూడా బాబు ఆలోచనలకు పూర్తి ప్రతిరూపం కానేకాదు.

విభజన చేసిన మేలు

తెలంగాణ ఉద్యమం బలపడటంతో రాష్ట్ర విభజన అనివార్యమైంది. నిజానికి ఇది బాబుకు మేలుచేసింది. దీంతో మరోసారి తన అందమైన కలలకు, భారీ వ్యూహాలకు తెరదీశారు. బాబు అద్భుత ఆలోచనలకు ప్రధాని మోదీ సైతం సన్మోహితులయ్యారు. సింగపూర్ తరహా రాజధాని నిర్మించడానికి కంకణం కట్టుకున్నారు. ఆంధ్రులంటే అంతవరకూ ప్రపంచదేశాలకు తెలియకపోవచ్చు. కానీ బాబు చేపట్టిన అమరావతి నగర నిర్మాణ పథకంతో ఆంధ్రుల పేరు మారుమ్రోగింది. యాక్ట్ ఈస్ట్ పాలసీ (దీనికి ప్రధాని మోదీ కూడా కట్టుబడేఉన్నారు) ప్రకారం సింగపూర్, జపాన్, చైనా దేశాల నుంచి మంచి స్పందన రాబట్టగలిగారు. ఆయాదేశాలు పెట్టుబడులు పెట్టడానికి సిద్ధమయ్యాయంటే, అమరావతిని బాబు ఎంతగా గ్లోబల్ స్థాయిలో మార్కెటింగ్ చేశారో అర్థంచేసుకోవచ్చు. కార్బన్ డైఆక్సైడ్ వంటి కర్బనఉద్గారాలు బాగా తక్కువస్థాయిలో ఉండే నగరంగా అమరావతిని తీర్చిదిద్దాలనుకున్నారు.

గతంలోని తప్పులు

ఆలోచనలు బాగానే ఉన్నాయి. వ్యూహాలు అంతకంటే మెరుగ్గానే ఉన్నాయి. కానీ, చంద్రబాబు గతంలో చేసిన తప్పుల్లాంటివే మళ్ళీ చేస్తే అమరావతిపై ఆయన కంటున్న కల మధ్యలోనే ఆగిపోతుంది. బాబు అప్పట్లో అధికారంలో ఉన్నప్పుడు కొన్ని పొరపాట్లు చేసిఉండకపోతే, అసలు తెలంగాణ ఉద్యమం ఊపెక్కేదేకాదు. తెలంగాణ నాయకులను (కేసీఅర్ సహా) బాబు పట్టించుకోలేదు. కేసీఆర్ కి ఉపముఖ్యమంత్రి పదవి కట్టబెట్టిఉంటే పరిస్థితి మరోరకంగా ఉండేదేమో… అంతేకాదు, ప్రతి చిన్న విషయంలో తన సామాజిక వర్గానికి పెద్దపీట వెయ్యడం మరో పొరపాటు. తెలంగాణ అభివృద్ధిలోనూ స్వీయవ్యాపార ప్రయోజనాలను చూసుకోవడం మరో తప్పిదం. వీటన్నింటి కారణంగా తెలంగాణ ఉద్యమం బలోపేతమైంది. చివరకు రాష్ట్రం రెండుముక్కలైంది.

పొంచిఉన్న ప్రమాదం

అలాంటి ప్రమాదం ఇప్పటికీ పొంచి ఉంది. చంద్రబాబు ఆలోచనలు బాగానే ఉన్నాయి. మహామేథావి కావచ్చు. కానీ గతంలో అధికారంలో ఉన్నప్పటిలాగానే ప్రవర్తిస్తున్నారు. తన సామాజిక వర్గాన్ని కలుపుకుంటూ, అదే సమయంలో బలమైన మరో సామాజిక వర్గానికి దూరం చేసుకుంటున్నారు. ఇప్పటికే రాష్ట్రంలో కమ్మ- రెడ్డి వర్గాల మధ్య రాజకీయ శత్రుత్వం తీవ్రస్థాయిలోనే ఉంది. ఇది చివరకు నవ్యాంధ్రప్రదేశ్ లో ప్రత్యేక రాష్ట్ర ఉద్యమానికి దారితీయవచ్చు. రాయలసీమ రాష్ట్ర సాధన కోసం ఇప్పటికే ఉద్యమం నడుస్తోంది. కులరాజకీయాలు నడుపుతున్న చంద్రబాబు మరి ఈ సమస్యనుంచి ఎలా బయటపడతారన్నదే చాలా కీలకం.

కుటుంబ హవా

పైగా బిజేపీ, కమ్యూనిస్ట్ పార్టీలు మినహా దేశంలోని మిగతా పార్టీల మాదిరిగానే తెలుగుదేశం పార్టీలో కూడా కుటుంబ హవా కొనసాగుతోంది. దీన్ని బాబే ప్రోత్సహిస్తున్నారు. తన సొంత కుమారుడు లోకేష్ కి కీలక పదవి కట్టబెట్టారు. పనిచేస్తున్నాడుకనుకనే పదవి కట్టబెట్టామని బాబు ఇచ్చిన వివరణ పార్టీలోని వారికే రుచించడంలేదు. ప్రజల రాజధాని అమరావతి వంటి ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్ ని చేపట్టినప్పుడు ఎంత జాగ్రత్తగా ఉండాలో అంతస్థాయిలో బాబు ఉండటంలేదన్నది తిరుగులేని వాస్తవం. ఇది చివరకు ఎటుదారితీస్తుందన్న ధ్యాసే ఆయనగారికి లేదు. పచ్చటి పొలాలను రాజధానికోసం తీసుకున్నప్పుడు వాటిని సద్వినియోగం చేయాల్సిన బాధ్యత నూటికినూరుపాళ్లు చంద్రబాబుదే. అలాకాని పక్షంలో అతనిపై `రైతు వ్యతిరేకి’ అన్న ముద్ర మరోసారి పడుతుంది. అదే జరిగితే బాబు మళ్ళీ ప్రతిపక్షనేతగా కూర్చోవాల్సివస్తుంది. ఈ కారణంగా ఆయనలోని అతిచక్కటి ఆలోచనలు కేవలం కలగానే మిగిలిపోతాయి. ఇదో దురదృష్టకరమైన పరిస్థితి.

నాయకునికి మంచి ఆలోచనలు ఉండటం తప్పుకానేకాదు, కాకపోతే అవి ఆచరణలోకి తీసుకువచ్చేలోగా ఎలాంటి జాగ్రత్తలు పాటించాలో తెలుసుకోవాలి. ఇది మహా యజ్ఞం. అది అయ్యేదాకా నిష్టతో మడికట్టుకుని, త్రికరణ శుద్ధితో పనులు చక్కబెట్టాలి. ఆనేర్పు చంద్రబాబుకి లేదు. అందుకే బాబుపై ప్రజలు ఇప్పటికీ పూర్తి విశ్వాసం ఉంచలేకబోతున్నారు.

– కణ్వస

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

ఫ‌హ‌ద్ ఫాజిల్‌పై ‘పుష్ష‌’ ఆశ‌లు

ఆగ‌స్టు 15న 'పుష్ష 2' రిలీజ్‌కి రెడీ అయ్యింది. ఈ డేట్ కి ఎప్ప‌టి ప‌రిస్థితుల్లోనూ 'పుష్ష 2' రిలీజ్ చేయాల‌ని టీమ్ మొత్తం అహ‌ర్నిశ‌లూ కృషి చేస్తోంది. ఈ సినిమా విడుద‌ల‌పై...

దెందులూరు రివ్యూ : లండన్ బాబు వర్సెస్ లోకల్ మాస్ లీడర్

చింతమనేని ప్రభాకర్. తనదైన రాజకీయం చేయడంలో ప్రత్యేకత చూపించారు. మాస్ లీడర్ గా ఎదిగారు. ఆయన గత ఎన్నికల్లో ఓడిపోతారని ఎవరూ అనుకోలేదు.కానీ ఓడిపపోయారు. లండన్ లో ఉండే అబ్బయ్య చౌదరి...

ట్యాపింగ్ కేసు మొత్తం అధికారులపై నెట్టేసిన కేసీఆర్ !

ట్యాపింగ్ కేసుపై కేసీఆర్ తేల్చేశారు. ఆ కేసులో చట్టవిరుద్ధంగా ఏది జరిగినా అదంతా అధికారుల తప్పే కానీ సీఎంకు.. మంత్రులకు సంబంధం లేదనేశారు. తనకు తెలిసి జరిగినదంతా చట్టబద్దంగా జరిగిందని.. మిగిలిన...

అదేదో ప్రెస్మీట్‌లో చెబితే సరిపోయేదిగా -అన్ని టీవీల్లో వచ్చేది !

పదేళ్ల తర్వాత కేసీఆర్ టీవీ డిబేట్‌లో పాల్గొంటున్నారని బీఆర్ఎస్ నేతలు హడావుడి చేశారు. ఎన్నికల ప్రచారం కోసం ఊళ్లల్లో ఏర్పాటు చేసిన డిజిటల్ ప్రచార వాహనాల్లో ప్రత్యక్ష ప్రసారం చేస్తామని...

HOT NEWS

css.php
[X] Close
[X] Close