సీబీఐ దర్యాప్తును కొనసాగించడం అంటే రాజకీయ దురుద్దేశమేనని అవినాష్ రెడ్డి, భాస్కర్ రెడ్డి, శివశంకర్ రెడ్డి సీబీఐ కోర్టులో అఫిడవిట్ వేశారు. ప్రస్తుతం అధికారంలో ఉన్న వారితో కలిసి సునీత రాజకీయంలో భాగంగానే ఈ పిటిషన్ వేశారని చెప్పుకొచ్చారు. సీబీఐ విచారణ ఇక కొనసాగించవద్దనేది వారి అభిప్రాయం. ఈ అఫిడవిట్ చూసి అందరూ ఆశ్చర్యపోతున్నారు. తప్పు చేయకపోతే.. సీబీఐ కాకపోతే ఎఫ్బీఐ విచారణకు సిద్ధమని నిందితులు చెప్పాలి కానీ..అసలు విచారణ వద్దని..దానికి రాజకీయ రంగు పులమడం దేనికి సంకేతమో అందరికీ అర్థమైపోతుంది.
హంతకుల్ని పట్టుకోవడం రాజకీయం ఎలా అవుతుంది?
వివేకానందరెడ్డి హత్య కేసు నిందితుల్ని, సూత్రధారుల్ని పట్టుకోవడం కోసం వైఎస్ సునీత నిరంతర పోరాటం చేస్తున్నారు. కానీ ఆ హత్యకేసు నిందితులు ఎవరో బాగా తెలిసిన జగన్ రెడ్డి అండ్ గ్యాంగ్ మాత్రం అసలు విచారణ వద్దని.. కేసును క్లోజ్ చేయాలని అనుకుంది.కానీ సీబీఐకి కేసు వెళ్లడంతో వారి గుట్టు బయటపడాల్సి వచ్చింది. కానీ అక్కడా న్యాయస్థానాల ద్వారా అడ్డుకున్నారు. కానీ ఎంతో కాలం ఆపలేరని తాజాగా స్పష్టత వస్తోంది. నిందితులు ఇంత గట్టిగా విచారణ వద్దంటున్నారంటే ఖచ్చితంగా దర్యాప్తు చేస్తే ఏదో బయటపడుతుందని భయపడుతున్నారని అర్థం చేసుకోవచ్చు.
పోలీసులు లెక్క తేల్చాలనుకుంటే రెండు రోజుల పని !
ప్రస్తుతం జరుగుతున్న ఎన్నో నేరాల విషయంలో పోలీసులు చాకచక్యంగా .. గంటల్లోనే హత్యకేసులు చేధిస్తున్నారు. అత్యంత ఆధునికమైన సాంకేతికత అందుబాటులో ఉంది. అలాంటిది.. వివేకానందరెడ్డిని అత్యంత దారుణంగా నరికి చంపడమే కాకుండా.. రక్తపు వాంతులతో చనిపోయాడు అని నమ్మించే ప్రయత్నం చేశారు. సాక్ష్యాలను తుడిచేశారు. అంతకు మించి ఆయన కుమార్తె రాక ముందే అంత్యక్రియలు చేయించాలనుకున్నారు. కానీ సునీత హైదరాబాద్ నుంచి వచ్చి.. పోస్టు మార్టం చేయిస్తే.. నరికిన ఆనవాళ్లు స్పష్టంగా కనిపించాయి. ఈ హత్యను ఎవరు దాచి పెట్టాలనుకున్నారు?.
సీబీఐ కోర్టు తీర్పుపైనే అందరి చూపు !
పోలీసులకు సీరియస్ గా ఎలాంటి ఒత్తిళ్లు లేకుండా.. దర్యాప్తు చేస్తే.. వివేకా హత్యకేసు నిందితుల్ని రెండు రోజుల్లో పట్టుకుంటారు. సూత్రధారుల్ని కూడా అంతే. కానీ నిందితులు అత్యంత పవర్ ఫుల్.. అన్ని రకాల వ్యవస్థల్ని అడ్డగోలుగా కలుషితం చేసి మరీ ..బయటపడే ప్రయత్నం చేస్తున్నారు. సీబీఐ విచారణ కొనసాగించడానికి కోర్టు అంగీకరిస్తే.. ఆ తర్వాత వీళ్ల ఆటలు తేలిపోతాయి. సీబీఐ కోర్టు ఇచ్చే తీర్పుపై అందరి దృష్టి ఉంది.
 
                                                 
				 
				 
				 
				 
				 
				 
				 
				 
				 
				 
				 
				 
				 
				 
				 
				 
				 
				 
				 
				 
                                               
                                               
                                               
                                               
                                              
 
                                                   
                                                   
                                                   
                 
                 
                 
                 
                